Popular Post psycopk Posted July 17 Popular Post Report Posted July 17 Chandrababu Naidu: ఇవాళ మనసుకు చాలా సంతృప్తిగా ఉంది: సీఎం చంద్రబాబు 17-07-2025 Thu 19:00 | Andhra హంద్రీ నీవా నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద రెండు మోటార్లు ఆన్ చేసిన వైనం రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమేనని వెల్లడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ-నీవా సుజల శ్రావంతి (HNSS) ఫేజ్-1 కాలువల నీటిని విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గురువారం నాడు రెండు మోటార్లను ఆన్ చేసి, శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ నుంచి కృష్ణా నది జలాలను రాయలసీమ జిల్లాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తదితరులు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. "మనసుకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. రాయలసీమ ప్రాంతానికి నీళ్లిచ్చి రైతన్నలకు మంచి చేసే కార్యక్రమంలో కలిగే సంతోషం ఎప్పుడూ ప్రత్యేకమే. రాయలసీమకు జీవనాడి హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ పనులు శరవేగంగా చేశాం. మొదటి ఫేజ్ పూర్తి చేసి మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి నీటిని విడుదల చేశాం. హంద్రీనీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2200 క్యూసెక్కుల నుంచి 3850 క్యూసెక్కులకు పెంచడం వల్ల సీమ రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. రికార్డు స్థాయిలో ఈ పనులు పూర్తి చేయడంలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో త్వరలోనే ఫేజ్ 2 పనులు పూర్తి చేద్దాం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీటిని అందించే ప్రాజెక్టును పూర్తి చేస్తాం. నీళ్లిస్తే రైతులు బంగారం పండిస్తారు. సంపద సృష్టికి మూలమైన జలాన్ని ప్రతి ఎకరాకు అందిచాలనే సంకల్పాన్ని అందరి దీవెనలతో సహకారంతో నేరవేరుస్తాం. రైతన్నల సాగునీటి కష్టాలు తీర్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం" అని వివరించారు. హంద్రీ-నీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి, దీంతో కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమలోని తాగునీటి, సాగునీటి కష్టాలను తీర్చడానికి 40 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. ఈ నీరు నంద్యాల జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి రిజర్వాయర్ వరకు తరలిస్తారు. గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా ఈ లక్ష్యం సాధ్యమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ కోసం రూ.3,890 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వంద రోజుల్లోనే ఈ పనులను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం, రాయలసీమ ప్రజల నీటి నిరీక్షణను ముగించింది. ఈ ప్రాజెక్ట్ రాయలసీమలో సాగు, తాగునీటి సమస్యలను కొంతవరకు పరిష్కరిస్తుందని, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. దీని ద్వారా రాయలసీమలోని గొల్లపల్లి, మరాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు నిండనున్నాయి. అలాగే, జీడిపల్లి నీటిని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు తరలించేందుకు 15 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నారు. రాయలసీమలో నీటి సమృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. 2 1 Quote
psycopk Posted July 17 Author Report Posted July 17 Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు 17-07-2025 Thu 22:24 | Andhra సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ ఎస్ఐపీబీ సమావేశం హాజరైన లోకేశ్, అచ్చెన్నాయుడు, కేశవ్, టీజీ భరత్, అనగాని తదితరులు రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకో సిస్టం వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎకో సిస్టం ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకూ లబ్ధి కలుగుతుందని సీఎం స్పష్టం చేశారు. గురువారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, కె.అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్ లు హాజరయ్యారు. ఎస్ఐపీబీ సమావేశానికి సీఎస్ కె.విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, పర్యాటక రంగాలకు సంబంధించిన రూ.39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది. పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున ప్రాజెక్టులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. సమీకృత ప్రణాళికతో పారిశ్రామిక ప్రాజెక్టులు పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులు, స్థానికులకు ప్రయోజనం కలిగితేనే వారు సంతోషంగా భూములు ఇవ్వగలుగుతారని సీఎం పేర్కోన్నారు. భూములు కేటాయించిన ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా తమ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటక ప్రాజెక్టుల విషయంలోనూ సమీకృత ప్రణాళికల్ని అమలు చేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. కేవలం నిర్దేశిత ప్రాజెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధంగా కార్యకలాపాలు వచ్చేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ప్రత్యేకించి సర్వీసు సెక్టార్ కూడా వచ్చేలా ప్రాజెక్టులను ఇంటిగ్రేట్ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. పీపీపీ విధానంలో చేపట్టే పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములను సేకరించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. శ్రీశైలంలో దేవాలయంతో పాటు భారీ నీటి ప్రాజెక్టు కూడా ఉందని ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆస్కారం ఉండేలా సమీకృత పర్యాటక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీశైలం రహదారి విస్తరణపైనా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆతిథ్య రంగంలో కేవలం హోటల్ గదులకు మాత్రమే పరిమితం కాకుండా అనుబంధ వినోద కార్యకలాపాలు, సేవల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేలా చూడాలన్నారు. మరో వైపు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఎంత మందికి ఉద్యోగాలను కల్పించామో వివరాలు తెలిసేలా ఎంప్లాయిమెంట్ పోర్టల్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 8వ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 1. ఫినామ్ పీపుల్ ప్రైవేటు లిమిటెడ్ - విశాఖలో రూ.205 కోట్లు పెట్టుబడి, 2500 ఉద్యోగాలు. 2. శ్రీజా మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ- చిత్తూరులో రూ.282 కోట్లు పెట్టుబడి, 1400 ఉద్యోగాలు. 3. రెన్యూ వ్యోమన్ పవర్ లిమిటెడ్ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.1800 కోట్లు పెట్టుబడి, 380 ఉద్యోగాలు. 4. రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ - కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రూ.3600 కోట్ల పెట్టుబడి, 760 ఉద్యోగాలు 5. జేఎస్ డబ్ల్యూ నియో ఎనర్జీ - కడప జిల్లాలో రూ.2000 కోట్ల పెట్టుబడి, 1380 ఉద్యోగాలు 6. పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.204 కోట్లు పెట్టుబడి, 1000 ఉద్యోగాలు 7. పీవీఎస్ గ్రూప్ - విజయనగరం జిల్లాలో రూ.102 కోట్ల పెట్టుబడి ,500 ఉద్యోగాలు 8. ఆర్వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్- నంద్యాల జిల్లాలో పంప్డ్ స్టోరేజి పవర్ ప్రాజెక్టు, రూ.4708 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు 9. ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ - విశాఖలో రూ.328 కోట్ల పెట్టుబడి, 1100 ఉద్యోగాలు 10. లాన్సమ్ లీజర్స్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్- విశాఖలో రూ.86 కోట్ల పెట్టుబడి, 720 ఉద్యోగాలు 11. స్టార్ టర్న్ హోటల్స్ ఎల్ఎల్ పీ- తిరుపతిలో రూ.165 కోట్ల పెట్టుబడి , 280 ఉద్యోగాలు 12. గ్రీన్ ల్యామ్ లిమిటెడ్ - తిరుపతి నాయుడుపేట సెజ్ లో రూ.1147 కోట్ల పెట్టుబడి, 1475 ఉద్యోగాలు 13. యాక్సెలెంట్ ఫార్మా - తిరుపతి శ్రీసిటీలో రూ.1358 కోట్ల పెట్టుబడి, 1770 ఉద్యోగాలు 14. అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - కర్నూలు జిల్లాలో (సోలార్ సెల్, పీవీ మాడ్యూల్ ఉత్పత్తి), రూ.6933 కోట్ల పెట్టుబడి, 2138 ఉద్యోగాలు 15. జేఎస్ డబ్ల్యూ ఏపీ స్టీల్ ప్లాంట్ - కడప జిల్లా స్టీల్ ప్లాంట్ రూ.4500 కోట్ల పెట్టుబడి (రెండు దశల్లో), 2500 ఉద్యోగాలు 16. రెన్యూ ఫోటో వోల్టాయిక్ ప్రైవేట్ లిమిటెడ్- అనకాపల్లి జిల్లా (ఫోటో వోల్టాయిక్ ప్లాంట్) రూ.3700 కోట్ల పెట్టుబడి, 1200 ఉద్యోగాలు 17. లారస్ ల్యాబ్స్ - అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద రూ.5630 కోట్ల పెట్టుబడి, 6350 ఉద్యోగాలు 18. లులూ షాపింగ్ మాల్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్- విశాఖ, విజయవాడలలో రూ.1222 కోట్లు పెట్టుబడి, 1500 ఉద్యోగాలు 19. ఏస్ ఇంటర్నేషనల్ - చిత్తూరు జిల్లా కుప్పంలో డైరీ యూనిట్ రూ.1000 కోట్ల పెట్టుబడి, 2000 ఉద్యోగాలు 20. బ్రాండిక్స్ ఇండియా అపారెల్ సిటీ ఇండియా- అచ్యుతాపురం సెజ్ లో ఫుట్ వేర్, టాయ్స్ తయారికీ అనుమతి 21. వీఎస్ఆర్ సర్కాన్ - శ్రీకాకుళం జిల్లాలో రూ.39 కోట్ల పెట్టుబడి, 246 ఉద్యోగాలు 22. అవిశా ఫుడ్స్ అండ్ ఫ్యూయెల్స్ - కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో రూ.500 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ జరిగిన ఎస్ఐపీబీ సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగలో 11, ఐటీ లో 7, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు ఎస్ఐపీబీ ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా రూ.5,74,238 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అలాగే 5,05,968 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. Quote
psycopk Posted July 17 Author Report Posted July 17 1 minute ago, ARYA said: Wonderful achievement After pattiseema 6month 1200crs.. this is the fastest project 1yr 3800crs Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.