Jump to content

Recommended Posts

Posted

Sajjala Ramakrishna Reddy: కన్సల్టెన్సీలకు గుడ్ బై.. ఇక మా వ్యూహాలు మావే: సజ్జల కీలక ప్రకటన

25-07-2025 Fri 23:41 | Andhra
Sajjala Ramakrishna Reddy Says Goodbye to Consultancies
 
  • ఎన్నికల వ్యూహాల కోసం ఇకపై బయటి ఏజెన్సీలపై ఆధారపడం
  • గతంలో పాలనపై దృష్టి పెట్టడంతో సంస్థాగత నిర్మాణంపై  పెట్టలేకపోయాం
  • రాజకీయ ఎత్తుగడలు, పైఎత్తుల విషయంలో మేం బలహీనమే
  • వైఎస్సార్సీపీలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నాయకుడు, మిగతావారంతా కార్యకర్తలే
  • విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన సజ్జల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికల సమయంలో బయటి ఏజెన్సీలు, రాజకీయ వ్యూహకర్తలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో అలాంటి వాటికి తావుండదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పార్టీని క్షేత్రస్థాయి నుంచి సొంతంగా నిర్మించుకోవడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు.

సజ్జల మాట్లాడుతూ, "గతంలో ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లాగా బయటి సంస్థలపై ఆధారపడటం జరిగింది. అయితే ఇకపై వాటి అవసరం లేదు. మాకు ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా నిర్మించుకుంటున్నాం. టెక్నాలజీని వాడుకుని, పార్టీ అధినేత సందేశాన్ని నేరుగా కార్యకర్తకు చేరవేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నాం," అని వివరించారు. ఏడాదిలోగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో పాలనపైనే అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల సంస్థాగత నిర్మాణంపై అనుకున్నంతగా దృష్టి పెట్టలేకపోయామని సజ్జల అంగీకరించారు. ఈ కారణంగానే ఎన్నికల సమయంలో బయటి సంస్థల అవసరం ఏర్పడిందని పరోక్షంగా తెలిపారు.

ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ఎవరినో సంతృప్తి పరచడానికే మాట్లాడుతుంటారని అన్నారు. వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నాయకుడని, తామంతా ఆయనకు మద్దతుగా పనిచేసే సైనికులం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి కోటరీలు లేవని, ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.
Posted

Kutami gallu inkentha mandi ni samputar ra ayya…

 

Posted
10 minutes ago, Android_Halwa said:

Kutami gallu inkentha mandi ni samputar ra ayya…

 

MLK jagga thaluka anta

Posted

Babai ni lepsadu boseDK gadu

ee pillodu oka lekka naa asalu vadu chillala LK gadu

Posted
39 minutes ago, Android_Halwa said:

Kutami gallu inkentha mandi ni samputar ra ayya…

 

Avunu bhayya, gee champudende😡😡😡jarantha goddeli tho oka naalgu potleshi gunde potu deppinchaale gani😡😡😡

Posted
5 hours ago, Android_Halwa said:

Kutami gallu inkentha mandi ni samputar ra ayya…

 

Papam. Jagan Anna mida kutra. Intha amayakudu malli power Loki ela vastad raa ayya. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...