Jump to content

Recommended Posts

Posted

 

Chandrababu: సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం.. తొలిరోజు పర్యటన ఇలా!

27-07-2025 Sun 08:11 | Andhra
Chandrababu Naidu Singapore tour begins with diaspora meet
 
  • చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం
  • సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు, మహిళలు
  • కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు
సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు కుటుంబాలు, మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలక‌డం విశేషం. అటు చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు.  

సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి క‌నిపించింది. ఇక‌, ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్ర‌బాబు 29 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. 

సీఎం చంద్రబాబు సింగపూర్ తొలిరోజు పర్యటన ఇలా..
 
  • ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు భారత హైకమిషనర్  శిల్పక్ అంబులేతో షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో సమావేశం కానున్న సీఎం
  • ఉదయం 11:30 నుంచి 12:00 గంటల వరకు సుర్భా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ ఎక్‌లో, రిక్ యియో, జిగ్నేష్ పట్టానీలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె. నాథన్ తో పెట్టుబడులపై చర్చించనున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 2:00 నుంచి 6:30 గంటల వరకు OWIS ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
  • సాయంత్రం 7:00 నుంచి 9:00 గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయాస్పోరా నేతలతో  విందు సమావేశంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు.

20250727fr68859afe5c563.jpg20250727fr68859b0872bd6.jpg20250727fr68859b11d281f.jpg
 
Chandrababu
Singapore tour

 

  • Sad 1
Posted

ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్ర‌బాబు 29 సమావేశాల్లో పాల్గొననున్నారు— arey. Jagga nee yabba eppudu foriegn poina doctor ni kalavatam tappa ee roju aaina state kosam pani chesava… nee bratuki ninu cm chesinanpudu neku vote vesina vallani cheputho kotali ra

  • Upvote 1
Posted

Nara Lokesh: సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేశ్‌కు తెలుగు ప్ర‌జ‌ల ఘ‌న స్వాగ‌తం

27-07-2025 Sun 07:45 | Andhra
Minister Nara Lokesh Arrives in Singapore Receives Grand Welcome
 
  • సీఎం చంద్రబాబుతో కలిసి ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ పర్యటన 
  • రాష్ట్రానికి పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై  మంత్రి లోకేశ్‌ సింగపూర్ పర్యటన  
  • ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరాతో సమావేశం 
ఐటీ, విద్య శాఖల‌ మంత్రి నారా లోకేశ్‌ సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు స్థానిక తెలుగు ప్రజలు పుష్పగుచ్ఛాలతో ఘ‌న‌ స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో కలిసి ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సింగపూర్ లో వేర్వేరు కార్యక్రమాలకు మంత్రి లోకేశ్‌ హాజరు కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పై  మంత్రి లోకేశ్‌ సింగపూర్ పర్యటన కొన‌సాగ‌నుంది. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎంతో క‌లిసి మంత్రులు పాల్గొననున్నారు. 
Posted

Sontha hotel la vuntunada leka vere hotel la vuntunda ?

  • Haha 1
Posted

Singapore Jail la Eshwaran tho ‘Mulakaqat la Milaqat’ anta kada..

Posted
2 hours ago, 7691 said:

Naaku Singapore ki janma janmala anubandham tammullu.

Prapancha patam lo 200 desalu unnai ,meeku ee Singapore blow job fantasy enti babu garu ?

Posted

naa doubt, does he stay in his own hotel when he goes there?

Posted
16 minutes ago, ManOffSteel said:

naa doubt, does he stay in his own hotel when he goes there?

Single city country idhi , he can watch his hotel from other hotel room ,no worries 

Posted

Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు

27-07-2025 Sun 13:30 | Andhra
CM Chandrababu invites Singapore investments in Andhra Pradesh
  • డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీలో విస్తృత అవకాశాలు
  • సింగపూర్‌లో భారత హై కమిషనర్‌తో భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సింగపూర్‌లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న హైకమిషనర్ శిల్పక్ ఆంబులే
  • ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడి
పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు..
సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ ఆంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలుచేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి  భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను తెలియజేశారు. భారత్‌ తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని వివరించారు. భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ ఏపీ ముఖ్యమంత్రికి తెలిపారు. 

అమరావతి ప్రాజెక్టులో సింగపూర్..
గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని.. కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

పెట్టుబడుల కోసం కొత్త పాలసీలు తెచ్చాం..
వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, అవకాశాలను చంద్రబాబు భారత హై కమిషనర్‌కు వివరించారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇప్పటికే విశాఖలో ఎన్టీపీసీ, కాకినాడలోనూ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పట్టాలెక్కాయని సీఎం వివరించారు. ఇండియా క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో తొలి క్యాంటం వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం తెలియజేశారు. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

డిఫెన్స్ సంస్థలకు రాయలసీమ అనుకూలం..
రాయలసీమలో డిఫెన్సు, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సింగపూర్ నుంచి భారత్‌ కు పెట్టుబడులు రావాలని దీనికి ఏపీ గేట్ వేగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. ఏపీలో పెట్టుబడులకు అవసరమైన సహకారాన్ని అందించాలని హైకమిషనర్ ఆంబులేను సీఎం చంద్రబాబు కోరారు. మరోవైపు సింగపూర్‌లో 83 శాతం మేర పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని భారత హై కమిషనర్ వివరించారు. దీనిపై ఏపీలో చేపడుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ వివరించారు. అలాగే విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, భవిష్యత్ ఆలోచనల్ని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ భారత హై కమిషనర్‌కు వివరించారు. ఏపీలో ఇప్పటికే ఏర్పాటు అవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి తెలిపిన మంత్రి ఏపీకి త్వరలో తరలివచ్చే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని లోకేశ్ స్పష్టం చేశారు. 

ఏపీ టెక్ నిపుణులకు ప్రత్యేక డిమాండ్ 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెక్ నిపుణులకు ఆగ్నేయాసియాలో ప్రత్యేకించి సింగపూర్‌లో డిమాండ్ ఉందని భారత హై కమిషనర్ ఆంబులే సీఎం చంద్రబాబుకు వివరించారు. అమెరికా తరహాలోనే ఆగ్నేసియాలోని సింగపూర్ లాంటి దేశాల విద్యార్ధులను, టెక్ నిపుణులను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సింగపూర్ నుంచి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి ఆయన వివరించారు.

వివిధ రంగాల్లో పెట్టుబడికి అపార అవకాశాలు
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల ఉత్పత్తి, షిప్ బిల్డింగ్, పోర్టు కార్యకలాపాల నిర్వహణ, డేటా సెంటర్ల ఏర్పాటు, ఫార్మా తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సీఎంకు వివరించారు. సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా పసిఫిక్ దిగ్గజ కంపెనీలు ఎస్టీటీ, కెప్పెల్, కాపిటాల్యాండ్, ఈక్వినిక్స్, పీఎస్ఏ తదితర సంస్థల విస్తరణకు అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఏఐ, స్టార్టప్‌లు, వైద్య పరికరాల రంగంలో పరిశోధన, ఏపీ, సింగపూర్ యూనివర్సిటీల మధ్య భాగస్వామ్యం కుదుర్చుకునే అంశంపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్ తో పాటు ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

20250727fr6885dc3a5ade5.jpg
Posted

Chandrababu Naidu: సింగపూర్ లో చంద్రబాబు.. భారత హైకమిషనర్ తో భేటీ

27-07-2025 Sun 12:06 | Andhra
Chandrababu Naidu Meets Indian High Commissioner in Singapore
  • సింగపూర్ లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు
  • ఏపీ మంత్రుల బృందంతో హైకమిషనర్ అంబులే వెల్లడి
  • విద్యాశాఖలో సంస్కరణలను వివరించిన మంత్రి నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సింగపూర్ లోని షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఏపీ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు బృందం శిల్పక్ అంబులేకు వివరించారు.

అనంతరం శిల్పక్ అంబులే మాట్లాడుతూ.. భారతదేశంతో సింగపూర్ ప్రభుత్వం సత్సంబంధాలను కలిగి ఉందని అన్నారు. సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు. 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను శిల్పక్ అంబులేకు వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతం అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ, విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి నారా లోకేశ్ వివరించారు.
Posted

Nara Lokesh: ఐదేళ్లలో ఎంత నష్టం జరిగిందో అంతకు వడ్డీతో కలిపి తీసుకువస్తాం: మంత్రి నారా లోకేశ్

27-07-2025 Sun 15:11 | Andhra
Nara Lokesh Vows to Recover Losses with Interest
  • సింగపూర్ లో తెలుగు డయాస్పొరాతో మంత్రి నారా లోకేశ్ సమావేశం
  • రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కష్టపడుతోందని వెల్లడి
  • సింగపూర్ ను ఆదర్శంగా తీసుకుని కొత్త విధానాలు అమలు చేస్తున్నామని స్పష్టీకరణ
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు... రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు.... చంద్రబాబు గారి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి... మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, అంతకు అంత వడ్డీతో కలిపి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపిన చంద్రబాబు 

తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని, దానిని నిలబెట్టింది ఎన్టీ రామారావు గారని లోకేశ్ పేర్కొన్నారు. తెలుగువారిని ప్రపంచపటంలో నిలిపింది చంద్రబాబు అని, ఆయనే మన బ్రాండ్ అని అన్నారు. ఐటీ గురించి కొందరు విమర్శించినా, చంద్రబాబు ఇంజినీరింగ్ కళాశాలలను స్థాపించినప్పుడు విమర్శించినా, ఈ రోజు అదే కంప్యూటర్లతో తెలుగువారు ప్రపంచాన్ని శాసిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది తెలుగు ప్రవాస భారతీయులు ఉండగా, ఫార్ ఈస్ట్‌లో మాత్రమే 3 లక్షల మంది ఉన్నారని, సింగపూర్ సమావేశానికి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఇతర ఫార్ ఈస్ట్ దేశాల నుండి పెద్ద ఎత్తున తెలుగువారు తరలిరావడం మన శక్తికి నిదర్శనమని లోకేశ్ వ్యాఖ్యానించారు.

సీబీఎన్ బ్రాండ్ తో పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాల సృష్టి

ప్రతి దేశానికి, వస్తువుకు ఒక బ్రాండ్ ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంటే సీబీఎన్ బ్రాండ్ అని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ బ్రాండ్‌తో ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే తమ ప్రయత్నాలకు ఎన్ఆర్ఐల సహకారం అవసరమని కోరారు. సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని, వేగంగా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామని తెలిపారు. 

దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, భూములు వంటి అపారమైన వనరులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని, ఇది పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని, ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలు వచ్చాయని, బిట్స్ పిలానీ త్వరలో రానుందని వెల్లడించారు.

"20 లక్షల ఉద్యోగాల కల్పన... ఇదే మన నినాదం... ఇదే మన విధానం" అని లోకేశ్ పునరుద్ఘాటించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో జన్మభూమి కార్యక్రమానికి ఎన్నారైలు అండగా నిలిచారని, ఇప్పుడు జీరో పావర్టీ లక్ష్యంగా చంద్రబాబు తలపెట్టిన పీ4 (P4) కార్యక్రమంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని కోరారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలన్నదే చంద్రబాబు గారి కోరిక అని, ఆరోగ్యవంతమైన, సంపన్నవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పీ4 లో మార్గదర్శిగా చేరి పేద కుటుంబాలకు ఆసరాగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్

ఆంధ్రప్రదేశ్‌లో 'డబుల్ ఇంజిన్ సర్కార్' నడుస్తోందని, కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇతర దేశాల్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) కంపెనీలను కూడా ప్రోత్సహిస్తామని, ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఉద్యోగాలు ఎంఎస్ఎంఈల ద్వారానే వస్తున్నాయని పేర్కొన్నారు. టీసీఎస్‌లో 35 శాతం తెలుగువారు పనిచేస్తున్నారని, అందుకే ఏపీకి వస్తున్నామని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు.

శాసనసభ్యుల్లో 50 శాతం మంది కొత్తవారు ఉన్నారని, మంత్రివర్గంలో 17 మంది కొత్తవారు ఉన్నారని, అందరూ సహకరిస్తే ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ 1గా తయారుచేస్తామని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తామని లోకేశ్ అన్నారు. సింగపూర్‌లో ఇంతమంది తెలుగువారు రావడం తన జీవితంలో మర్చిపోలేని రోజని, ఇక్కడున్న వారిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన కనిపిస్తోందని ఆయన ప్రశంసించారు. ఏపీఎన్‌ఆర్‌టీ 2.0ని ప్రారంభించామని, ఎన్ఆర్ఐలకు ఎటువంటి సమస్యలున్నా ఏపీఎన్‌ఆర్‌టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చివరగా, పహల్గాం దాడిలో వీరమరణం పొందిన మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్‌కు నివాళులర్పించాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...