psycopk Posted July 28 Report Posted July 28 సజ్జల మెల్ల మెల్లగా వైకాపాను తన చేతుల్లోకి తీసుకొంటున్నారా? వైకాపా సీనియర్ నాయకులు అంతర్మథనం చెందుతున్నారట. తెలివైన విజయసాయి రెడ్డి గారు పార్టీ భవిష్యత్తు మీద ముందే ఒక అంచనాకు వచ్చి, తన వయసును కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్లిపోయినప్పుడే మనం కూడా ఆలోచించాల్సింది. తాము వీడకుండా అధినేత జగన్ గారి జిల్లాల పర్యటనలు వుంటాయి అని ఊరించి, పార్టీని బలోపేతం చెయ్యడానికి తరువాత పాదయాత్ర కూడా చేస్తారని నమ్మించి, అవన్నీ వాయిదాలు వేస్తున్నారు. ఇటీవల అనవసర కార్యక్రమాలకు జగన్ను బయటకు రప్పించి, ఎవరిమాటా ఎవరూ వినని పరిస్థితులలో.. ఆయన కార్యక్రమాలు వివాదాస్పదం అయ్యేలా.. జనంలో అసహ్యం కలిగేలా తీవ్ర నిర్లక్ష్యంతో.. కావాలని ఆయనతో అలా చేయించారనే చర్చ నడుస్తోంది. అధికారంలో వున్నప్పుడు కూడా అమరావతిలో అయితే అర్థం చేసుకోవచ్చు, బయట కూడా పరదాలు కట్టించి, అక్కడ వున్న కోటరీ ఆయనలో భయాన్ని నూరిపోసి క్రమంగా దూరం చేశారు. ఆఖరికి ఎమ్మెల్యేలను, బంధువులను కూడా దగ్గరకు రాకుండా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ముందు వైఎస్ రాజారెడ్డి కాలం నుండి సందింటి నమ్మిన బంటులను కూడా కలుసుకోకుండా కట్టడి చేయగలిగారు. వేలాదిమందితో చెవిరెడ్డి చేయించిన సర్వే రిపోర్టు, ఇంటలిజెన్స్ రిపోర్టు, ఐప్యాక్ రిపోర్టు, వేరే ప్రయివేటు ఏజెన్సీలతో చేయించిన రిపోర్టులను మార్చి, ఆయనకు వాస్తవాలు చెప్పకుండా ఎలాగైనా.. గెలుస్తున్నాము అనే ఫీలింగ్ ఆయనకు కలిగించారని తాడేపల్లి వార్ రూములో కూర్చొనే.. సీనియర్ ఐఏఎస్ విజయ్ కుమార్ కూడా ఇటీవల కుండబద్దలు కొడుతూ జాఫర్ ఇంటర్వ్యూలో చెప్పడం మీద కూడా సీనియర్లు ఉదహరిస్తున్నారు. పార్టీ నాయకులతో సాధారణంగా పార్టీ అధినేతలు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్ కూడా సజ్జలే నిర్వహించడం మొదలెట్టడాన్ని జీర్ణించుకోలేపోతున్నారు. ఎవరి సలహాలతో ఇలా తమ రాజకీయ జీవితాలు, వ్యక్తిగత ప్రతిష్ట కూడా మంటగల్సిపోయిందో.. పార్టీ నాశనం అయ్యిందో ఇక ఆయనే నడిపితే ఎలా వుంటుందో ఊహించుకోండి అని ఒకరి ఒకరు చెప్పుకొంటూ ఉలిక్కిపడుతున్నారట. జగన్ను కూడా అరెస్ట్ చేస్తారు. గతంలో జైల్లో వున్నపుడే ఏమీ లేని పార్టీని నడిపాం. ఇప్పుడు బలంగా వుంది నడిపించే సత్తా వుంది అని జగన్ మద్యం కుంభకోణంలో తప్పు చేసినట్లు, అరెస్ట్ అవ్వబోతున్నట్లు ముందే తప్పుడు సంకేతాలు ఇచ్చి ఆయనలో భయం కలిగేలా చేశారు. పైగా మీరు లండన్లో వున్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేయించినట్లు, చంద్రబాబు నాలుగు రోజులు సింగపూర్లో వున్నపుడే మీ అరెస్ట్ జరగవచ్చు అని జగన్ను మానసికంగా తాడేపల్లిలో కూర్చుని భయపెట్టారు అనే చర్చ జరుగుతోంది. టెలికాన్ఫరెన్స్ అనేది ప్రపంచంలో ఎక్కడ వున్నా నేటి టెక్నాలజీ కాలంలో జరపవచ్చు. బ్రాడ్ బ్యాండ్ కూడా వున్న బెంగుళూరు ప్యాలెస్ నుండి నిర్వహించుకోవచ్చు. కనీసం అది కూడా చెయ్యనివ్వకుండా.. టెక్నాలజీతో మిమ్మల్ని సిట్ కనిపెట్టి అరెస్ట్ చేస్తుందేమో.. అది కూడా వద్దని సలహాల రూపంలో బయపెట్టినట్లుగా సీనియర్ల అంతర్గత హాట్ హాట్ చర్చల్లో నడుస్తోంది. తనకూ.. తన వారసుడికీ ఏమీ కాకుండా జాగ్రత్త పడి ఇలా వ్యవహరిస్తున్నారు, ఇప్పుడు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదనే అయోమయంలో ఉన్నారట. //(సాక్షి స్క్రోలింగ్) తాడేపల్లి : నగర, మండల అధ్యక్షులతో సజ్జల టెలి కాన్ఫరెన్స్ - ఆగస్టులోగా గ్రామస్థాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి - మండల స్థాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి - అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేద్దాం - సోషల్ మీడియాను ఉపయోగించుకుని మన వాణిని బలంగా వినిపిద్దాం - ప్రజలను చైతన్యపరుద్దాం : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి// Quote
Pavanonline Posted July 28 Report Posted July 28 1 hour ago, psycopk said: okadni ekkinchina buddi raledu ga janalaki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.