Jump to content

Recommended Posts

Posted

Allu Aravind: అల్లు కుటుంబంలో విషాదం.. నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృవియోగం

30-08-2025 Sat 08:41 | Entertainment
Allu Aravind Mother Allu Kanakarathnamma Passes Away
  • అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూత
  • గ‌త కొంత‌కాలంగా ఆమెకు వృద్ధాప్య సమస్యలు
  • ఈరోజు మధ్యాహ్నం కోకాపేటలో అంత్యక్రియలు
  • హైదరాబాద్‌కు చేరుకుంటున్న బన్నీ, రాంచరణ్
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత, అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి అల్లు కనకరత్నమ్మ (94) వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈరోజు ఉదయం 9 గంటలకు ఆమె పార్థివదేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ల నిమిత్తం వేర్వేరు నగరాల్లో ఉన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైసూర్ నుంచి మధ్యాహ్నానికి నగరానికి చేరుకోనున్నారు.

ప్రస్తుతం అల్లు అరవింద్‌, మెగాస్టార్ చిరంజీవి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, పవన్ కల్యాణ్, నాగబాబు వైజాగ్‌లో ఒక బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నందున, వారు ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించనున్నట్లు తెలిసింది.

అల్లు కనకరత్నమ్మ మర‌ణ‌వార్త తెలియగానే టాలీవుడ్ ప్రముఖులు, అల్లు అరవింద్ సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నారు. అల్లు కుటుంబానికి సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.
Posted

Chiranjeevi: అత్తగారి మృతిపై స్పందించిన చిరంజీవి

30-08-2025 Sat 14:33 | Both States
Chiranjeevi Reacts to Mother in Law Kanakaratnammas Death
  • ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు మాతృవియోగం
  • దివంగత నటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి  కనకరత్నమ్మ కన్నుమూత
  • మెగాస్టార్ చిరంజీవి తీవ్ర భావోద్వేగం
  • తన అత్తయ్య మరణం ఎంతో బాధాకరమంటూ ట్వీట్
  • ఆమె చూపిన ప్రేమ, విలువలు ఎప్పటికీ ఆదర్శమన్న చిరంజీవి
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన అత్తగారి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగభరితమైన సంతాప సందేశాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "మా అత్తయ్య గారు... కీ.శే అల్లు రామలింగయ్య గారి అర్ధాంగి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం" అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరి పట్ల ఆమె చూపిన ప్రేమను, అందించిన ధైర్యాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.

"మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః" అంటూ చిరంజీవి తన సంతాపాన్ని తెలియజేశారు. కాగా, అల్లు కనకరత్నమ్మ మృతి వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు అల్లు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 
Posted

Allu Kanaka Ratnamma: చెన్నైలో ఉన్నప్పటి నుంచి కనకరత్నమ్మ గారు ఎంతో ఆప్యాయత చూపేవారు: పవన్ కల్యాణ్

30-08-2025 Sat 15:26 | Both States
Pawan Kalyan Remembers Allu Kanaka Ratnammas Affection
  • ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి కనకరత్నమ్మ కన్నుమూత
  • ఆమె మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందన
  • చెన్నై రోజుల నుంచే ఆ కుటుంబంతో తనకు అనుబంధం ఉందని వెల్లడి
  • తమ వదిన సురేఖను ఎంతో ఆదర్శంగా పెంచారని కొనియాడిన పవన్
  • అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కనకరత్నమ్మ మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్, అల్లు కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పటి నుంచి కనకరత్నమ్మ ఎంతో ఆప్యాయత చూపేవారని ఆయన స్మరించుకున్నారు. ఆమె గొప్ప మాతృమూర్తి అని, తమ వదినమ్మ అయిన సురేఖ గారిని ఎంతో ప్రేమాభిమానాలతో తీర్చిదిద్దారని పవన్ కల్యాణ్ కొనియాడారు. చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమగా మెలగడం సురేఖ గారు తల్లి కనకరత్నమ్మ నుంచే నేర్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.

కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ కష్ట సమయంలో అల్లు అరవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
Posted

Allu Arjun: మామయ్య చిరంజీవి ఎదుట కంటతడి పెట్టుకున్న అల్లు అర్జున్

30-08-2025 Sat 16:19 | Entertainment
Allu Arjun Breaks Down Before Chiranjeevi After Grandmothers Demise
  • అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ కన్నుమూత
  • ముంబై నుంచి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్
  • నానమ్మ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురైన బన్నీ
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ అయిన అల్లు కనకరత్నమ్మ (94) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త తెలియడంతో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నానమ్మ మరణవార్త తెలిసిన వెంటనే, ముంబైలో తన సినిమా షూటింగ్‌లో ఉన్న అల్లు అర్జున్ హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇంటికి చేరుకుని నానమ్మ భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు.

ఈ విషాద సమయంలో అల్లు కుటుంబాన్ని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన అర్ధాంగి సురేఖ వారి నివాసానికి వెళ్లారు. తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న తన బావమరిది అల్లు అరవింద్‌ను, తీవ్ర వేదనలో ఉన్న అల్లు అర్జున్‌ను చిరంజీవి ఓదార్చారు. ఈ సందర్భంగా చిరంజీవిని చూడగానే అల్లు అర్జున్ మరోసారి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 
Posted

Chiranjeevi: అత్తగారి పాడె మోసిన చిరంజీవి... వీడియో ఇదిగో!

30-08-2025 Sat 16:54 | Entertainment
Chiranjeevi Carries Mother in Laws Bier
  • అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ కన్నుమూత
  • పాడె మోసిన చిరంజీవి, అల్లు అర్జున్
  • కోకాపేటలో జరుగుతున్న అంత్యక్రియలు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి, దివంగత నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, తన నివాసంలోనే కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు కోకాపేటలోని ఫామ్‌హౌస్‌లో జరుగనున్నాయి. 

ఈ సందర్భంగా ఓ భావోద్వేగ దృశ్యం అందరినీ కదిలించింది. మెగాస్టార్ చిరంజీవి తన అత్తమ్మ కనకరత్నమ్మ పాడెను భుజాలపై మోశారు. అల్లు అర్జున్ తో కలిసి ఆయన కనకరత్నమ్మ పాడెను మోశారు. రామ్ చరణ్ కూడా అక్కడే ఉండి, అంత్యక్రియల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయమే అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్న చిరంజీవి, రామ్ చరణ్ అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Posted

Chiranjeevi: అల్లు కనకరత్నం నేత్రదానంపై చిరంజీవి స్పందన 

31-08-2025 Sun 06:06 | Both States
Chiranjeevi Responds to Allu Kanaka Ratnam Eye Donation
 
  • అల్లు కనకరత్నం కళ్లను దానం చేసిన కుటుంబ సభ్యులు
  • అవయవదానంలో నేత్రదానం మహా గొప్పదన్న మెగాస్టార్ చిరంజీవి
  • కనకరత్నం నేత్ర దానం ఎంత మందికి స్పూర్తిదాయంగా నిలుస్తుందన్న చిరంజీవి
అవయవదానంలో నేత్రదానం ఎంతో గొప్పదని ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాతృమూర్తి, దివంగత అల్లు రామలింగయ్య అర్ధాంగి కనకరత్నం కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసిన సందర్భంపై చిరంజీవి స్పందిస్తూ, ఆమె నేత్రదానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ అల్లు కనకరత్నం నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె బతికి ఉన్న సమయంలోనే చిరంజీవి చేపట్టిన బ్లడ్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితమై, తాను మరణించిన తర్వాత తన కళ్లను దానం చేయాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ కోరిక మేరకు ఆమె మరణించిన తర్వాత కళ్లను అల్లు కుటుంబం దానం చేసింది. 
Posted

94yrs ki vishadam emiti naa bonda...  that lady should thank her luck to stay this long...

  • Haha 1
Posted
9 minutes ago, andhra_jp said:

94yrs ki vishadam emiti naa bonda...  that lady should thank her luck to stay this long...

Yeyyyy poyaru ani gentharu kada vayya...it's still a loss even at 94

  • Haha 2
Posted
12 hours ago, psycopk said:

 

Aa mahathalli gariki om shanthi...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...