psycopk Posted September 2 Report Posted September 2 Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్... కేసీఆర్ సంచలన నిర్ణయం 02-09-2025 Tue 14:35 | Telangana కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్ కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని పేర్కొన్న బీఆర్ఎస్ తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది. "పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు" అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 KCR: కేసీఆర్, హరీశ్ రావులకు ఊరటనిచ్చిన హైకోర్టు 02-09-2025 Tue 12:20 | Telangana కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు కేసీఆర్, హరీశ్ పిటిషన్లపై విచారణ అక్టోబర్ 7కి వాయిదా అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల కేసును దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తునకు, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు ఎలాంటి సంబంధం ఉండదని కూడా ఏజీ స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. వెకేషన్ అనంతరం దీనిపై విచారణ చేపడతామని పేర్కొంటూ, తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు పిటిషనర్లపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో కేసీఆర్, హరీశ్ రావులకు తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Danam Nagender: కవిత ఆరోపణలను కొట్టిపారేసిన దానం నాగేందర్ 02-09-2025 Tue 14:53 | Telangana హరీశ్, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్న కవిత కవితది కేవలం రాజకీయ ఆరోపణ మాత్రమేనన్న దానం కాళేశ్వరం వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరగాలని వ్యాఖ్య కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకూడదని, ఇందులో కీలక పాత్ర పోషించిన కాంట్రాక్టర్లు, అధికారులను కూడా విచారించాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కేవలం నేతలనే బలిపశువులను చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల ఇళ్లలో వందల కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయని, అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని దానం ప్రశ్నించారు. కాళేశ్వరం వ్యవహారంలో సమగ్రమైన, లోతైన విచారణ జరగాలని, అప్పుడే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. ఈ కేసులో హరీశ్ రావు, సంతోష్ రావు వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కవిత చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అది కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, తన పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై కూడా దానం స్పందించారు. ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పలు శాఖల పాత్రపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Mahesh Kumar Goud: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్... టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఏమన్నారంటే? 02-09-2025 Tue 15:30 | Telangana కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ ఆమె సస్పెన్షన్ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని వ్యాఖ్య అవినీతి సొమ్ము పంపకాలలో తేడాతోనే కవిత వ్యాఖ్యలు చేశారన్న టీపీసీసీ చీఫ్ పదేళ్ల బీఆర్ఎస్ పాలన అవినీతిని ఆమె బయటపెట్టాలని డిమాండ్ ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని, ఆమె అవసరం తమ పార్టీకి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానితో తమకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు రావడం వల్లే ఇప్పుడు కవిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి బాగోతాన్ని కవిత పూర్తిగా బహిర్గతం చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కఠిన చర్యలు తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలోని కీలక నేతలు హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత బహిరంగంగా విరుచుకుపడిన నేపథ్యంలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యుడు మేఘా కృష్ణారెడ్డిపై కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రతిష్ఠకు వీరే మచ్చ తెచ్చారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ చుట్టూ ఉన్న కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పెద్ద కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని, వారి వల్లే ఇప్పుడు కేసీఆర్ సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ఐదేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావుకు ఈ విషయంలో ప్రధాన పాత్ర లేదా?" అని కవిత సూటిగా ప్రశ్నించారు. కవిత వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంది. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 K Kavitha: కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 02-09-2025 Tue 15:59 | Telangana కవిత సస్పెన్షన్‌పై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాల వల్లే ఆమెపై చర్యలు తీసుకున్నామని వెల్లడి కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం జరిగిందని స్పష్టీకరణ కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని తీవ్ర ఆరోపణ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శ కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని తేల్చిచెప్పిన పల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర పన్నిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని విడదీసి, బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచేందుకే కాంగ్రెస్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు. కవిత సస్పెన్షన్ అనేది పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు తీసుకున్న నిర్ణయమని పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందువల్లే ఈ చర్యలు తప్పలేదని వివరించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. పార్టీలో ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారని అన్నారు. కానీ తమకు కేసీఆర్ ఆదేశాలే శిరోధార్యమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయం: హన్మంత్ షిండే పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. పార్టీ సీనియర్ నేతలపై వ్యాఖ్యలు చేసిన కవితను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. Quote
citizenofIND Posted September 2 Report Posted September 2 #Thokkesaru akkada Sharmila ikkada kavitha Gandhi and rakul Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.