karna11 Posted September 2 Report Posted September 2 Enti @Android_Halwa asalu kavitakka problem, em kavali? Emaku Share ivvakunda vallee panchukunnraa Quote
Mancode Posted September 2 Report Posted September 2 Better she join bjp and contest from jagityal easy win as mla Quote
argadorn Posted September 2 Report Posted September 2 Good job kcr … it’s a master plan to check others and people will realise in 1 year 1 Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Kavitha: బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత ఫ్లెక్సీల తొలగింపు.. హుస్నాబాద్‌లో దిష్టిబొమ్మ దగ్ధం 02-09-2025 Tue 16:49 | Telangana రాష్ట్రవ్యాప్తంగా పార్టీల కార్యాలయాల్లో పోస్టర్ల తొలగింత ఫ్లెక్సీలు, కటౌట్‌లు, బ్యానర్లను తొలగించిన పార్టీ శ్రేణులు కవితకు వ్యతిరేకంగా హుస్నాబాద్‌లో ధర్నా ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆమె పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆయా కార్యాలయాల లోపల, వెలుపల ఉన్న ఫ్లెక్సీలను, కటౌట్‌లను, బ్యానర్లను పార్టీ శ్రేణులు తొలగిస్తున్నాయి. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నిరసన తెలిపింది. హుస్నాబాద్ మల్లెచెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కవితకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడుపోయారని, ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఏం చెబితే అది చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే పార్టీలోని నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కవిత ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసులకు భయపడి కవిత బీజేపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Kavitha: కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్న కవిత!.. సర్వత్ర ఉత్కంఠ 02-09-2025 Tue 16:47 | Telangana బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచన సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, కవిత సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆమె దాదాపుగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ తనపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేయకముందే, తానే స్వయంగా ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత యోచిస్తున్నారని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీతో అన్ని సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ అనంతరం తన ముఖ్య అనుచరులతో విస్తృతంగా చర్చలు జరిపిన కవిత, ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇంతటితో ఆగకుండా, త్వరలోనే సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే యోచనలో కవిత ఉన్నట్లు ఆమె అనుచరులు బలంగా చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఆమె రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కవిత ఎలాంటి ప్రకటన చేయనున్నారనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. Quote
Teluguredu Posted September 2 Report Posted September 2 Good for party that they kicked her out ,too many power centres in the party. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్... భగ్గుమన్న 'జాగృతి' 02-09-2025 Tue 17:40 | Telangana జూబ్లీహిల్స్ జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్తత హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు కవిత ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామన్న జాగృతి నేతలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ నుంచి ఆమెను సస్సెండ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే, ఆమె మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. జూబ్లీహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. 'జై కవితక్క.. జై జాగృతి' అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సంతోష్ రావులకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో జాగృతి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జాగృతి నేతలు మాట్లాడుతూ, కవితను పార్టీ నుంచి బహిష్కరించడం వల్ల ఆమెకు ఎలాంటి నష్టం జరగదని అన్నారు. తన తండ్రి కేసీఆర్‌పై సీబీఐ విచారణను ఆమె తట్టుకోలేకపోయారని తెలిపారు. చాలా రోజులుగా కవితను పార్టీకి దూరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. సామాజిక తెలంగాణ కోసమే కవిత పోరాడుతున్నారని, బడుగు బలహీన వర్గాలు ఆమె వెంటే ఉంటాయని స్పష్టం చేశారు. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తేల్చిచెప్పారు. మరోవైపు, ఈ తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయం నేపథ్యంలో, తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. Quote
akkum_bakkum Posted September 2 Report Posted September 2 2 hours ago, psycopk said: Kavitha: బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్... కేసీఆర్ సంచలన నిర్ణయం 02-09-2025 Tue 14:35 | Telangana కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్ కవిత తీరు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉందని పేర్కొన్న బీఆర్ఎస్ తక్షణమే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శులు సోమా భరత్ కుమార్, టి. రవీందర్ రావు పేర్ల మీద ప్రకటన వెలువడింది. "పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు" అని బీఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది. Maakee sisters potlenti antunna langas and jaffas. Quote
TeluguTexas Posted September 2 Report Posted September 2 Pakka state meeda interest eppudu ochindi neeku? @psycopk Jagan poye ippudu KCR meeda paddav Quote
Satakarni_bali Posted September 2 Report Posted September 2 Ninnati varaku liquor scam queen ani anna norlu ipudu deep throating... Antis Expect cheyaledu papam, good job by pedda dora.... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.