psycopk Posted September 2 Report Posted September 2 Nara Lokesh: 'ఓరి నీ పాసుగాల' అంటూ జగన్ పై లోకేశ్ సెటైర్లు 02-09-2025 Tue 13:19 | Andhra పులివెందుల పర్యటనలో ఉన్న జగన్ జగన్ ను కలిసేందుకు పాస్ లు జారీ చేశారనే వార్త వైరల్ కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా అంటూ లోకేశ్ సెటైర్ ఓరి నీ పాసుగాల! .. అంటూ వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళి అర్పించారు. మరోవైపు, పులివెందులలో జగన్ ను కలవడానికి వైసీపీ వీఐపీ పాస్ లు అందజేసింది అనే వార్త వైరల్ అయింది. దీనిపై నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే.. చూడలే" అంటూ పోస్ట్ చేశారు. Quote
psycopk Posted September 2 Author Report Posted September 2 Rasedi ani luchaa news lu… malli edupula ra Jupudi Prabhakar: సాక్షి కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారు: జూపూడి ప్రభాకర్ 02-09-2025 Tue 16:19 | Andhra డీఎస్పీల ప్రమోషన్లలో అక్రమాలపై వార్త రాసినందుకు వేధిస్తున్నారన్న జూపూడి సాక్షి ఎడిటర్‌పై అక్రమంగా కేసు బనాయించారని మండిపాటు ప్రభుత్వ తీరు నియంతృత్వాన్ని తలపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను కాలరాస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. డీఎస్పీల ప్రమోషన్లలో జరిగిన అవకతవకలపై వార్తలు ప్రచురించినందుకే ‘సాక్షి’ మీడియా కార్యాలయంపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. "పోలీసుల మేలు కోరుతూ వార్త రాస్తే, అదే పోలీసులను అర్ధరాత్రి సాక్షి కార్యాలయానికి పంపి వీరంగం సృష్టించారు. వార్తలు రాసినందుకు దాడులు చేస్తారా?" అని జూపూడి ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మొదట వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం, ఇప్పుడు సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకుందని అన్నారు. "దేశానికి స్వాతంత్ర్యం అర్ధరాత్రి వస్తే, కూటమి ప్రభుత్వం అదే అర్ధరాత్రి పత్రికా స్వేచ్ఛను హరించింది" అని ఆయన ధ్వజమెత్తారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేయించారని జూపూడి ఆరోపించారు. గతంలో మే 8న కూడా ఆయన ఇంట్లో అక్రమంగా సోదాలు నిర్వహించారని గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, ఇది అప్రజాస్వామికమని అన్నారు. "ప్రభుత్వం వీధి రౌడీలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోం. మానవ హక్కులకు, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయాలని చూస్తే కుదరదు" అని జూపూడి ప్రభాకర్ హెచ్చరించారు. Quote
paaparao Posted September 2 Report Posted September 2 2 hours ago, psycopk said: veedini lopala veyyali. veedu malli MLA ga contest cheyakunda invalid cheyali. he must be punished. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.