psycopk Posted September 10 Report Posted September 10 Nepal violence: నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం ఢిల్లీలో సహాయక కేంద్రం 10-09-2025 Wed 15:45 | Telangana తెలంగాణ భవన్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ముగ్గురు అధికారుల బృందానికి బాధ్యతల అప్పగింత అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచన నేపాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పలువురు తెలంగాణవాసులు అక్కడ చిక్కుకుపోవడంతో, వారికి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సహాయ కేంద్రం బాధ్యతలను ముగ్గురు అధికారుల బృందానికి అప్పగించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నేపాల్‌లో తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఖాట్మాండ్‌లోని భారత రాయబార కార్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులు, వారి కుటుంబ సభ్యులు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. నేపాల్‌లో ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుంటే వారి కుటుంబ సభ్యులు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులను ఈ కింది నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. వందన, రెసిడెంట్ కమిషనర్, ప్రైవేట్ సెక్రటరీ అండ్ లైజన్ హెడ్ +91 9871999044, రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 9643723157, హెచ్ చక్రవర్తి, ప్రజా సంబంధాల అధికారి +91 9949351270. Quote
psycopk Posted September 10 Author Report Posted September 10 Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న 187 మంది ఏపీ వాసులు.. రంగంలోకి దిగిన మంత్రి లోకేశ్ 10-09-2025 Wed 11:25 | Andhra సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ తెలుగు వారి కోసం తన అనంతపురం పర్యటన రద్దు భారత రాయబార కార్యాలయంతో ఏపీ ప్రభుత్వం సమన్వయం బాధితుల కోసం పలు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు అమరావతి ఆర్టీజీ కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్న లోకేశ్ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న నేపాల్‌లో ఏపీకి చెందిన 187 మంది చిక్కుకున్నారు. వీరిని సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఈ సహాయక చర్యలను మంత్రి నారా లోకేశ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తెలుగు వారి భద్రత దృష్ట్యా, ఆయన తన అనంతపురం జిల్లా పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అమరావతిలోని ఆర్టీజీ కేంద్రం నుంచి మంత్రి లోకేశ్ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన అనంతపురం వెళ్లాల్సి ఉండగా, దానిని రద్దు చేసుకున్నారు. "ఏపీ ఆర్టీజీ మంత్రిగా, మన ప్రజలను వీలైనంత త్వరగా సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అవసరమైన సహాయక చర్యలను సమన్వయం చేస్తాను" అని ఆయన 'ఎక్స్' వేదికగా తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం, నేపాల్‌లోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏపీ వాసులు చిక్కుకుపోయారు. బఫల్‌లో 27 మంది, సిమిల్‌కోట్‌లో 12 మంది, పశుపతిలోని మహాదేవ్ హోటల్లో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్‌లో 90 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మొత్తం 187 మందిని గుర్తించామని, బాధితులతో మరిన్ని పరిచయాలు ఏర్పడుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవను అప్రమత్తం చేసింది. బాధితులను త్వరగా తరలించేందుకు, వారికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసేందుకు రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సహాయం అవసరమైన వారు సంప్రదించేందుకు ప్రభుత్వం పలు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని 977 – 980 860 2881 లేదా 977 – 981 032 6134 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఢిల్లీలోని ఏపీ భవన్ నంబర్ 91 9818395787, ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్ 0863 2340678, వాట్సాప్ నంబర్ 91 8500027678 ద్వారా కూడా సాయం కోరవచ్చని ప్రభుత్వం సూచించింది. తెలుగు పౌరుల భద్రతకే తమ ప్రథమ ప్రాధాన్యత అని, వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. 1 Quote
psycopk Posted September 10 Author Report Posted September 10 Nara Lokesh: నేపాల్ బాధితులతో మంత్రి లోకేశ్ వీడియో కాల్.. బస్సుపై దాడి జరిగిందన్న మంగళగిరి వాసులు 10-09-2025 Wed 12:50 | Andhra నేపాల్‌లో ఆందోళనల కారణంగా చిక్కుకుపోయిన 241 మంది ఏపీ వాసులు వీరిలో మంగళగిరికి చెందిన 8 మంది కూడా ఉన్నట్లు గుర్తింపు బాధితులతో వీడియో కాల్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన మంత్రి లోకేశ్ అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేశ్ హామీ వెనక్కి రప్పించే ఏర్పాట్లపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నేపాల్‌లో జరుగుతున్న ఆందోళనల కారణంగా రాజధాని ఖాట్మండులో చిక్కుకుపోయిన మంగళగిరి వాసులతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నేరుగా మాట్లాడారు. వీడియో కాల్ ద్వారా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నేపాల్‌లో మొత్తం 241 మంది ఏపీకి చెందిన యాత్రికులు చిక్కుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిని వీలైనంత త్వరగా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. మంగళగిరికి చెందిన మాచర్ల హేమసుందర్ రావు, దామర్ల నాగలక్ష్మి తదితర 8 మంది యాత్రికులు ప్రస్తుతం ఖాట్మండు ఎయిర్‌పోర్టుకు కిలోమీటరు దూరంలో ఉన్న పశుపతి ఫ్రంట్ హోటల్లో తలదాచుకుంటున్నారు. మంత్రి లోకేశ్‌తో వీడియో కాల్ లో మాట్లాడిన వారు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. నిన్న తాము ప్రయాణిస్తున్న బస్సుపై ఆందోళనకారులు దాడి చేశారని, తీవ్ర భయాందోళనకు గురయ్యామని తెలిపారు. తమతో పాటు మరో 40 మంది తెలుగువారు కూడా అదే హోటల్లో ఉన్నట్లు వారు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్, ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. బాధితులతో నిరంతరం టచ్‌లో ఉండి, వారికి అవసరమైన సహాయాన్ని సమన్వయం చేసేందుకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును నియమించినట్లు తెలిపారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ భవన్ అధికారి అర్జా శ్రీకాంత్‌తో పాటు సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, ముఖేశ్ కుమార్ మీనా, కోన శశిధర్, అజయ్ జైన్, హిమాన్షు శుక్లా, జయలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని వెనక్కి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని లోకేశ్ అధికారులను ఆదేశించారు. Quote
jpismahatma Posted September 10 Report Posted September 10 What are we peeking in Nepal anna ? Tourism aa? Quote
psycopk Posted September 10 Author Report Posted September 10 7 minutes ago, jpismahatma said: What are we peeking in Nepal anna ? Tourism aa? work kuda aaiundochu... business.. tourism.. education..health Quote
psycopk Posted September 10 Author Report Posted September 10 Nara Lokesh: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది: నారా లోకేష్ 10-09-2025 Wed 22:06 | Andhra ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాం నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగువారు రేపు మధ్యాహ్నం ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆంధ్రుల తరలింపు సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ వెల్లడి నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు సచివాలయం నాలుగో బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, "ఉదయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాం. అక్కడ తెలుగువారు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అని, తిరిగి వారిని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు గారు మాకు చెప్పారు. ఉదయం నుంచి నేను ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాం. గౌరవ హోం మంత్రి అనిత, మంత్రి దుర్గేష్ అనంతపురం సభ నుంచి నేరుగా అమరావతికి వచ్చారు. మేం ముగ్గురం పరిస్థితిని సమీక్షించాం. ఏపీ భవన్లో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటుచేసి ఒక సింగిల్ నెంబర్ ద్వారా తెలుగువారిని సంప్రదించాం. ఎవరైతే ఆ నంబర్‌కు ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితిని సమీక్షించాం. వారికి అందుతున్న ఆహారం, నీరు, విద్యుత్ సదుపాయాలపై రియల్ టైంలో ఆరా తీశాం. నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో చిక్కుకున్న 217 మంది తెలుగువారు "ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్ ద్వారా టీడీపీ ఎంపీ సానా సతీష్, ఏపీ భవన్ అధికారి అర్జే శ్రీకాంత్ రియల్ టైంలో మానిటరింగ్ చేశారు. ఇప్పటికే మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 217 మంది ఆంధ్రులు 12 ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. వీరంతా హోటళ్లలో కాని, వేరే పట్టణాల్లో కానీ ఉన్నారు. ఇందులో సుమారు 173 మంది ఖాట్మండూలో, 22 మంది హిటోడాలో, 10 మంది పోక్రాలో, 12 మంది సిమికోట్‌లో ఉన్నారు. ఇది మేము టైం టు టైం మానిటరింగ్ చేస్తున్నాం. ఇందులో సుమారుగా 118 మంది మహిళలు, 98 మంది మగవారు ఉన్నారు. అటు ఏపీ భవన్, ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టైం టూ టైం ఇటు ఎంబీసీతో, ఇతర అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేశాం" అని లోకేశ్ వెల్లడించారు. రేపు మధ్యాహ్నం ఖాట్మండు నుంచి ప్రత్యేక విమానం ద్వారా తరలింపు ప్రధానంగా రేపు ఖాట్మండు నుంచి ఆంధ్రావారిని తీసుకువచ్చేందుకు రేపు మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విమానం ఖాట్మండులో దిగి, అక్కడి నుంచి ఆంధ్రులు అందరినీ మొదటి హాల్ట్ విశాఖ, రెండో హాల్ట్ కడపకు తీసుకు వస్తుందని అన్నారు. ఖాట్మండుతో పాటు సిమికోట్‌లో ఉన్న 12 మందిని ఉత్తర ప్రదేశ్ సరిహద్దులో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్ పోర్ట్‌కు రేపు ఉదయం తరలిస్తామని వెల్లడించారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వారు లక్నోకు వెళ్లి, అక్కడి నుంచి కమర్షియల్ ఫ్లైట్ ద్వారా తిరిగి వస్తారని తెలిపారు. పోక్రాలో ఉన్న 10 మందిని రేపు ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ఖాట్మండుకి తీసుకువచ్చి, అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన విమానం ద్వారా తిరిగి రాష్ట్రానికి వస్తారని మంత్రి తెలిపారు. హిటోడాలో ఉన్న మరో 22 మంది రోడ్డు మార్గం ద్వారా ఈ రోజు రాత్రే బీహార్ సరిహద్దులోని రాక్సాల్‌కు చేరుకున్నారు. వారికి కావాల్సిన ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు కూడా చేశాం. వీరి సంరక్షణను ఏపీ భవన్ చూసుకుంటోందని అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రేపు సాయంత్రానికి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ప్రభుత్వానిది "రేపు ఉదయం పది గంటలకు మేం తిరిగి సమావేశం అవుతాం. రేపు మొత్తం మానిటరింగ్ చేసి ప్రతి ఆంధ్రుడు తిరిగి వచ్చేంత వరకు పనిచేస్తాం. కేవలం విశాఖ, కడపకే కాదు.. ప్రభుత్వం అందరినీ వారి వారి నివాసాలకు చేర్చుతాం. విమానాశ్రయంలో కూడా వారికి కావాల్సిన వాహనాలు ఏర్పాటుచేసి నేరుగా వారిని ఇంటివద్దకే చేర్చుతాం. ఈ రోజు ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుని నేపాల్ లో చిక్కుకున్న ఆంధ్రులను తిరిగి తీసుకురావడం జరిగింది. మేం అందరం వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటుచేసుకున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. ప్రతి రెండు గంటలకు ఒకసారి ముఖ్యమంత్రి గారికి పరిస్థితిని వివరించాం. రేపు సాయంత్రం నాటికి అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది" అని వివరించారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు తొలుత కొంత ఆందోళనతో ఉన్నారని, మేం మాట్లాడిన తర్వాత కుదురుకున్నారని మంత్రి వెల్లడించారు. అక్కడ నెలకొన్న భయానక పరిస్థితులను వారంతా వివరించారని, ఏపీ నుంచి మేం 12 గ్రూప్‌లతో నిరంతరం మాట్లాడుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే మమల్ని సంప్రదించాలని సూచన చేశామని తెలిపారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో కూడా దాదాపు 12 సార్లు మాట్లాడామని తెలిపారు. మంత్రివర్గ భేటీకి ముందు కూడా సంప్రదించినట్లు వెల్లడించారు. భారతీయులను తీసుకువచ్చే బాధ్యత రామ్మోహన్ నాయుడు తీసుకున్నారని అన్నారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిలో ప్రధానంగా విశాఖ నుంచి 42 మంది, విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది ఉన్నారన్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.