Jump to content

Recommended Posts

Posted

Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న...తెలంగాణ రాజ్యాధికార పార్టీ

17-09-2025 Wed 15:10 | Telangana
Teenmaar Mallanna Announces New Party Telangana Rajyadhikara Party
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న
  • ఎరుపు, ఆకుపచ్చ రంగులతో జెండా ఆవిష్కరణ
  • జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు. పార్టీ జెండాను రెండు రంగులతో రూపొందించారు. జెండా పైభాగంలో ఎరుపు రంగు, కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి. జెండా మధ్యలో కార్మిక చక్రాన్ని, దాని నుంచి పైకి లేస్తున్నట్లుగా పిడికిలి బిగించిన మానవుడి చేతిని చిహ్నంగా పొందుపరిచారు. ఈ చిహ్నానికి ఇరువైపులా రెండు ఆలీవ్ ఆకులను చేర్చారు. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అనే నినాదాన్ని ముద్రించారు.
  • psycopk changed the title to Teenmaar Mallanna: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న... తెలంగాణ రాజ్యాధికార పార్టీ
Posted

KTR: సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కొందాం: కేటీఆర్ పిలుపు

17-09-2025 Wed 13:35 | Telangana
KTR calls to confront Congress government with armed struggle spirit
  • జాతీయ సమైక్యతా దినోత్సవం రోజున కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ ప్రభుత్వానివి నియంతృత్వ పోకడలని తీవ్ర విమర్శ
  • గ్రూప్-1, రైతుల సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
  • కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ సంక్షేమ రాజ్యం తెస్తామన్న కేటీఆర్
  • తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేటీఆర్
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణులతో వ్యవహరిస్తోందని, ఈ పోకడలను తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదుర్కోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ అంటేనే త్యాగాలకు, పోరాటాలకు చిరునామా అని కేటీఆర్ అన్నారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆనాడు లక్షలాది మంది పోరాడితే, వేలాది మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఆ అమరవీరుల స్ఫూర్తితోనే నేటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి వినమ్రంగా నివాళులర్పించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో విఫలమై, నిరసన తెలుపుతున్న విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారిని పట్టించుకోకుండా, ప్రభుత్వం ఒలింపిక్స్ వంటి ఇతర అంశాలపై దృష్టి సారిస్తోందని ఎద్దేవా చేశారు.

ఇలాంటి నియంతృత్వ పోకడలను ఎదుర్కొని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో మళ్లీ సంక్షేమ, రైతు రాజ్యం తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17ను కొందరు విమోచనం, మరికొందరు విలీనం అంటున్నారని, కానీ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంలోకి సమైక్యమైన రోజు కాబట్టే తాము ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా పాటిస్తున్నామని ఆయన వివరించారు. 
Posted

: తెలంగాణ సాయుధ పోరాటం చాలా గొప్పది: ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి

17-09-2025 Wed 11:33 | Telangana
cr-20250917_8a504dbece8233ad.jpg
  • పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర అపూర్వమన్న సీఎం 
  • మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న సీఎం
ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు.
 
మహిళల పాత్ర అపూర్వం – కోటి మందిని కోటీశ్వరులు చేస్తాం

తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్ర మరువలేనిదని గుర్తుచేస్తూ, “మహిళల అభివృద్ధికి మేం అండగా నిలుస్తాం. కోటి మందిని కోటీశ్వరులుగా చేయడం మా లక్ష్యం” అని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణను స్వేచ్ఛ, సమానత్వంలో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు.
 
విద్య, క్రీడలకు ప్రాధాన్యం – యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి నిధులపై ఫోకస్

విద్య మాత్రమే భవిష్యత్తుకు దారి చూపే మార్గమని, అందుకే ప్రపంచ స్థాయి విద్యా అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ఎఫ్‌ఆర్‌బీఎం నుంచి మినహాయించాలని కేంద్రాన్ని కోరారు. క్రీడల అభివృద్ధికీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.
 
రైతులకు న్యాయం – బీసీలకు 42శాతం రిజర్వేషన్

రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, 48 గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని సీఎం తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి, ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదుల జలాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి రాజీపడేది లేదని స్పష్టం చేసిన సీఎం, “మన వాటా కోసం న్యాయపోరాటం కొనసాగుతోంది. ఇది తెలంగాణ ప్రజల హక్కు” అని అన్నారు.
 
హైదరాబాద్ అభివృద్ధిపై విశేష దృష్టి – మూసీ ప్రక్షాళనకు డిసెంబరులో శ్రీకారం

హైదరాబాద్‌ను గేట్ ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రజలకు మెరుగైన జీవితం కల్పించనున్నామని, ప్రపంచ స్థాయి నిర్మాణాలతో మూసీని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళికను వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌లో శ్రీకారం చుడతామన్నారు. 30 వేల ఎకరాల్లో "ఫ్యూచర్ సిటీ" నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే కొందరు దీనికి అడ్డంకులు సృష్టిస్తున్నారని, ప్రజలే వారికి బుద్ది చెప్పాలని రేవంత్ కోరారు. 
Posted

Narendra Modi: నిజాం పాలనలో అనేక దారుణాలు జరిగాయి: హైదరాబాద్ విమోచనంపై నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

17-09-2025 Wed 15:35 | National
Narendra Modi comments on atrocities during Nizam rule Hyderabad Liberation
  • సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పం వల్లే హైదరాబాద్ విలీనం సాధ్యమైందని వెల్లడి
  • గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని దశాబ్దాలుగా విస్మరించాయని విమర్శ
  • తమ ప్రభుత్వం వచ్చాకే ఈ వేడుకను చిరస్మరణీయం చేసిందని వ్యాఖ్య
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకున్నారు. నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో జరిగిన దారుణాలను ఆయన గుర్తుచేశారు. దశాబ్దాల పాటు గత ప్రభుత్వాలు ఈ చారిత్రక దినాన్ని విస్మరించాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసిందని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో బుధవారం జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. "ఈ రోజు, సెప్టెంబర్ 17, ఒక చారిత్రకమైన రోజు. సరిగ్గా ఇదే రోజున దేశం సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని చూసింది. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించి, భారతదేశ గౌరవాన్ని పునఃస్థాపించింది" అని ఆయన గుర్తు చేశారు.

హైదరాబాద్ విమోచన దినం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. "భారతమాత గౌరవం, ప్రతిష్ఠల కంటే ఏదీ గొప్పది కాదు" అని మోదీ వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వాల తీరును పరోక్షంగా విమర్శిస్తూ, "దశాబ్దాలు గడిచిపోయినా ఈ చారిత్రక విజయాన్ని ఎవరూ పెద్దగా జరుపుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చిరస్మరణీయం చేసింది. మేము ఈ రోజును 'హైదరాబాద్ విమోచన దినం'గా జరపడం ప్రారంభించాం. ఈ రోజు హైదరాబాద్‌లో ఈ వేడుకను ఎంతో గర్వంగా జరుపుకుంటున్నారు" అని తెలిపారు.

1948 సెప్టెంబర్ 17న నాటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలలో జాతీయ జెండాను ఎగురవేస్తారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...