Sucker Posted September 17 Report Posted September 17 13 minutes ago, DinguTaka said: ‘బ్యాటరీ తినేస్తోంది’.. iOS 26 అప్‌డేట్‌పై యూజర్ల అసంతృప్తి iOS 26 Battery issue: యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఓఎస్ 26 అప్‌డేట్‌పై ఐఫోన్ యూజర్లు పెదవి విరుస్తున్నారు. By Eenadu 1 min. read View original iOS 26 Battery issue | ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ తాజాగా విడుదల చేసిన ఐఓఎస్ 26 అప్‌డేట్‌పై ఐఫోన్ యూజర్లు పెదవి విరుస్తున్నారు. జూన్‌లో జరిగిన డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించిన ఈ అప్‌డేట్‌ను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అప్‌డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత తమ ఫోన్ల బ్యాటరీ వేగంగా తగ్గిపోతోందంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఈ సమస్య తాత్కాలికమేనంటూ యాపిల్ వివరణ ఇచ్చింది. బ్యాటరీ సమస్యను వివరిస్తూ ఓ యూజర్ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. ‘‘గంట క్రితమే పూర్తిగా ఛార్జ్ చేసిన ఫోన్ బ్యాటరీ 58 నిమిషాల్లోనే 79 శాతానికి తగ్గిపోయింది. ఐఓఎస్ 26 అప్‌డేట్ తన ఫోన్‌ను ఇటుకలాగా మార్చేసింది’’ అని రాసుకొచ్చాడు. ‘‘అప్‌డేట్ తర్వాత ఫోన్ వేడెక్కిపోతోంది. బ్యాటరీ హెల్త్ ఒక్కసారిగా 80 శాతానికి పడిపోయింది. నేను ఛార్జింగ్ అలవాట్లలో ఎలాంటి మార్పు చేయలేదు’’ అని మరో యూజర్ పేర్కొన్నాడు. ‘‘రోజూ కంటే తక్కువగా ఫోన్ వాడినా నా ఫోన్ బ్యాటరీ ఇప్పటికే 50 శాతానికి అయిపోయింది’’ అంటూ మరో యూజర్ ఎక్స్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ఇంతకుముందు మేజర్ ఐఓఎస్ అప్‌డేట్‌ల తర్వాత ఇలాంటి సమస్యలు తలెత్తినప్పటికీ, కొన్ని రోజుల్లో సర్దుకున్న సందర్భాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈసారి వినియోగదారుల్లో అసహనం ఎక్కువగా కనిపిస్తోంది. దీనిపై యాపిల్ స్పందిస్తూ.. ఇది తాత్కాలిక సమస్య అని స్పష్టం చేసింది. “మేజర్ అప్‌డేట్ తర్వాత, ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా ఇండెక్సింగ్, కొత్త ఫైళ్లు, అసెట్స్ డౌన్‌లోడ్, యాప్‌ల అప్‌డేట్ వంటి పనులు పూర్తిచేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో బ్యాటరీ లైఫ్, ఫోన్ వేడి ప్రభావితం కావడం సహజమే. కానీ ఇది తాత్కాలికమే” అని యాపిల్ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. Usage pattern antaru every company Quote
halwafan Posted September 17 Report Posted September 17 Update available undi 26 .. should I opt ? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.