psycopk Posted September 20 Author Report Posted September 20 Mithun Reddy: రెండో రోజు ముగిసిన మిథున్ రెడ్డి సిట్ విచారణ 20-09-2025 Sat 16:17 | Andhra ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ రెండో రోజు కూడా కొనసాగిన సిట్ కస్టడీ సుమారు 4 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు ముగిసిన రెండు రోజుల సిట్ కస్టడీ గడువు విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలింపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెండు రోజుల సిట్ కస్టడీ ముగిసింది. రెండో రోజైన శనివారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు. విచారణ ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన్ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో నాలుగో నిందితుడిగా (ఏ-4) ఉన్న మిథున్ రెడ్డిని.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి అధికారులు విజయవాడకు తరలించి ప్రశ్నించారు. శనివారం దాదాపు నాలుగు గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. స్కామ్‌కు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. రెండు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజైన శుక్రవారం కూడా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని నాలుగు గంటలకు పైగా విచారించారు. ఆ సమయంలో ఆయనకు 50కి పైగా ప్రశ్నలు సంధించినట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు పలు కీలక వివరాలు రాబట్టినట్లు భావిస్తున్నారు. విచారణ ముగిసిన నేపథ్యంలో, ఆయన్ను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, అనంతరం తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. Quote
psycopk Posted September 20 Author Report Posted September 20 Mithun Reddy: విచారణలో మిథున్ రెడ్డి దాటవేత ధోరణి 20-09-2025 Sat 12:52 | Andhra 50కి పైగా ప్రశ్నలు సంధించిన అధికారులు ఒక్కదానికీ సరైన జవాబివ్వని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రెండోరోజు విచారిస్తున్న సిట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్న విషయం విదితమే. కోర్టు అనుమతితో అధికారులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ నాలుగు గంటల వ్యవధిలో అధికారులు ఆయనకు 50కి పైగా ప్రశ్నలు సంధించారు. రూ.5 కోట్ల మద్యం ముడుపుల సొమ్ము మిథున్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాల్లో జమకావడంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఎంపీ మిథున్ రెడ్డి ఏ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. కాగా, మిథున్ రెడ్డిని అధికారులు రెండోరోజు శనివారం కూడా విచారిస్తున్నారు. విచారణ అనంతరం సాయంత్రం ఆయనను కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.