kakatiya Posted September 19 Report Posted September 19 🎵 ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ 'శ్రీ' జయంతి మన Arava Bioscope పేజ్ ద్వారా తెలుగు సినిమా కంపోజర్, సింగర్ 'శ్రీ' జయంతి సందర్భంగా మన అరవ బయోస్కోప్ పేజ్ అడ్మిన్ తరఫున మీ అందరి తరపున సంస్మరణ నివాళులు అందచేస్తున్నాము... శ్రీ గానే చిత్ర పరిశ్రమలో అందరు క్లుప్తంగా పిలవడం, తెలిసిటుండటం వల్ల శ్రీ పేరు స్థిరపడింది. అసలు పేరు మాత్రం శ్రీనివాస చక్రవర్తి కొమ్మినేని !!! తెలుగు సినీ సంగీత ప్రపంచంలో కొత్తతరం వచ్చిన రాజ్ కోటి జంట కంపోజర్లతో నూతన శకం ప్రారంభమైంది. ఈ వరుసలలో వచ్చిన యువతరం సంగీత దర్శకుడు మన శ్రీ. మంచి సంగీత అభినివేశం పాటు వారసత్వంగా వచ్చిన స్వర జిజ్ఞాస వలన ఒక కొత్త తరం ట్రెండ్ పాటలు శ్రీ శ్రీకారం చుట్టాడు. శ్రీ కుటుంబమంతా కళాకారుల నేపథ్యంలో ఉండటం వలన శ్రీకి తండ్రి అడుగుజాడల్లో నడిచి విన్నూత్న ప్రయోగాత్మక కంపోజింగ్ ముందుకొచ్చాడు. శ్రీ తండ్రి గారు ప్రఖ్యాత మకుటంలేని మహారాజు, డైనమిక్, డేరింగ్ డాషింగ్ కంపోజర్ 'చక్రవర్తి' మరియు బాబాయ్ కొమ్మినేని శేషగిరిరావు కూడా సినిమా నటుడు కావడం విశేషం. శ్రీ కొడుకు రాజేశ్ చక్రవర్తి నటుడు, కంపోజర్ కావడం గమనార్హం. కీ బోర్డు, గిటార్, వోకల్ లో మంచి నిష్ణాతుడవ్వడం గమనించతగ్గది. శ్రీ ఉత్తమాభిరుచి కలిగిన కంపోజర్ కాకుండా మంచి శ్రావ్యమైన గాత్రం కలిగినవాడు కావటం గమనార్హం✌️ 🌺🌼🌻🌼🌺 Rajesh Chakravarthy 🎬 మ్యూజికల్ సిట్టింగ్ వర్కింగ్ స్టిల్ క్లిక్ 📷 1997 సంవత్సరంలో విడుదలైన "సిందూరం" సినిమా మ్యూజికల్ చర్చలు జరిపే రికార్డింగ్ థియేటర్లో కుడివైపు యువ సంగీత దర్శకుడు 'శ్రీ' పక్కనే దర్శకుడు 'క్రిష్ణవంశీ'ని మనం చూడవచ్చును 👍 🎵🎶🎵🎶❤️🎵🎶🎵🎶 ♠️ 'శ్రీ' యువ సంగీత నిర్దేశకత్వం విలక్షణత్వం: తండ్రి చక్రవర్తి గారి వారసత్వంగా సంగీతంలో ఒక జిజ్ఞాస, దృష్టి పుట్టుకతోనే రావడం వల్ల మంచి కంపోజర్ గా పేరు తెచ్చుకున్న కూడా దౌర్భాగ్య దిశలో పరిశ్రమ పూర్తిగా విస్మరించి నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత సమస్యల వలన అతి పిన్న వయసులోనే ఈ లోకం వదిలి వెళ్లిపోవడం అత్యంత బాధాకరమైన సంఘటన. కొందరికి సంగీతంలో పూర్తి అవగాహన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై మంచి వివేచన ఉండే వారికి శ్రీ లేని లోటు ఇట్టే తెలిసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కోల్పోయామనే ఎంతో విచారిస్తారు. కన్నతల్లి ఇటీవలే మరణించడం. ఆ సంఘటన తీవ్రంగా బాధించింది మరియు చాలా మార్పుకు కారణమైంది. ఈ కారణం వల్ల సంగీతం చేయడం మానేయడం జరిగింది. తల్లి మరణం ఒక మిషతో కెరియర్ స్వయంకృతాపరాధం చేస్తున్నానని తెలుసుకొని గ్రహించడం మరల వర్క్ మీద ఫోకస్ చేయడం మొదలెట్టాడు. తరువాత ఈ సంఘటన వల్ల కెరియర్ కి గ్యాప్ రావటం పరిశ్రమకు చెందినవారు అవకాశాలు ఇవ్వడం మానేసి, మోహం చాటేయడంతో ఎంతో ఆర్ధికంగా తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. శ్రీ సంగీత స్వరకల్పనం చేసే వేళ పూర్తి స్థాయిలో హృదయాన్ని, మెదడుని, ఆత్మని, మనసుపెట్టి చేసే దృక్పథం. అంతే గాని, ఏదో కమర్షియల్ కోణంలో వచ్చిందా చేసేసామా వదిలిచ్చుకొన్నామా, నలభై మంది జూనియర్ ఆర్టిస్టులు మధ్యలో హీరోహీరోయిన్లు గెంతులేసే పాటల గురించి యావ, ఆలోచన ఎంతవరకు అవసరమని భావాజాలం కలిగిన వ్యక్తిత్వం శ్రీ ది. సినీ జనాలకు వారి పనికి తప్ప మిగతావి ఏమి పట్టించుకోకుండా సగటు వ్యక్తిగత స్వార్థం మాత్రమే చూస్తారు. ఒక పరిశ్రమ వ్యక్తి వ్యక్తిగత జీవితంలో ఏమి చేస్తాననేది ఏం ఇబ్బందులు పడతారన్నది అసలు పట్టించుకోరు. చాలా మంది నిర్మాతలు వారి సినిమాలకు బుక్ చేసుకున్నారు, కానీ నాకు డబ్బు ఇవ్వలేదు. శ్రీ సంగీతం అందిస్తున్నారని ప్రచారం చేయడానికి వారు పేరును ఉపయోగించారు. కానీ చివరికి, పారితోషికం చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. ఇది ముఖ్యమైన విషయమా? నిర్మాత/దర్శకుడికి ముఖ్యమైనది అవుట్ పుట్, కానీ సంగీత దర్శకుడు అవుట్ పుట్ ఎలా ఇస్తాడు, ఎంత వ్యక్తిగత సంఘర్షణ అనేది చూడరని శ్రీ పర్సనల్ అభిప్రాయం. 🎼 శ్రీ సంక్షిప్త పరిచయం: శ్రీ ఉరఫ్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి సెప్టెంబర్ 13వ తేదీన విఖ్యాత స్వరకర్త చక్రవర్తి, రోహిణి దేవి దంపతులకు జన్మించారు. చక్రవర్తి గారి నలుగురు కొడుకులు ఒక కూతురు. ఈ ఐదుగురి సంతానంలో రెండవవాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. గ్రాడ్యుయేషన్ చేసిన తరువాతి రోజుల్లో తండ్రి చక్రవర్తి గారి వద్ద అసిస్టెంట్ గా చేరి రీరికార్డింగ్ పనులు, ఇంస్ట్రుమెంటైజేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వద్ద నేర్చుకొంటు మ్యూజికల్ కెరియర్ ప్రారంభించాడు. ▪️◾️▪️శ్రీ మ్యూజికల్ రంగప్రవేశం విశేషాలు: చక్రవర్తి గారి వద్ద పనిచేస్తున్న సమయంలోనే 'శ్రీ' చేసే మ్యూజికల్ వర్క్, డెడికేషన్ చూసి దర్శకుడు మోహనగాంధీ సినిమాకి సంగీత నిర్దేకత్వం చేయమని అవకాశం ఇచ్చారు. కంపోజర్ గా రావాలంటే ఇంకా కొంత పరిణితి కావాలని ఒప్పుకోలేదు. మరల తరువాత కాలంలో రెండవసారి ఆఫర్ ఇవ్వగా 'పోలీస్ బ్రదర్స్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు. 'పోలీస్ బ్రదర్స్' సినిమా పాటలు కొత్త తరహాగా ఉన్నందువల్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ విని 'అంతం' సినిమా వర్కింగ్ షెడ్యూల్ పిలిపించి ఒక రీల్ రీరికార్డింగ్ చేసి చూపించమన్నాడు. వెంటనే చేయగానే నచ్చి వెంటనే తరువాత 'గాయం' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ అవకాశం ఇచ్చాడు. గాయం సినిమా రీరికార్డింగ్ 'శ్రీ' నాలుగు రోజుల్లోనే పూర్తి చేయడం విని ప్రఖ్యాత విశ్వవిఖ్యాత కంపోజర్ 'ఎ.ఆర్. రెహమాన్' ముగ్ధుడై పోయాడు. దర్శకుడు మణిరత్నం కూడా గాయం చిత్రంలో " అలుపున్నది ఉందా.." పాట విని వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అని ప్రశంసించాడు. టెలివిజన్ లో 'అంత్యాక్షరి' కార్యక్రమంలో 'శ్రీ' చేసే యాంకరింగ్ చూసి డయాస్ మీద హాండ్సమ్ గా ఉండటం గమనించిన ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి శ్రీ హీరోగా సినిమా తీయాలనే ప్లాన్ చేసి అడుగగా కృతజ్ఞతలు తెలిపి మ్యూజిక్ పై ఆసక్తి కాని యాక్టింగ్ చేయనని సున్నితంగా తిరస్కరించారు. శ్రీ కెరియర్ లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గవి మంచి విలక్షణత ట్రెండ్ తగట్టు మెలోడి, బీట్, రిథమిక్ ఓరియెంటెడ్ పాటలు 1996 అనగనగా ఒక రోజు, 1997 సిందూరం, 1998 ఆవిడా మా ఆవిడే సినిమాలు ఒక టాలెంటెడ్ క్రియేట్ మ్యూజిక్ అందించాడు పాటలన్ని మ్యూజికల్ సెన్సేషన్ సృష్టించాయి. తండ్రి చక్రవర్తి గారిలాగే కొంత ఆనాటి యువతరం టేస్ట్ సందర్భోచితంగా తన సినిమాల్లో అన్ని వివిధ కాంపోజిషన్లతో మంచి నాణ్యమైన పాటలు అందించే విషయంలో పూర్తి విజయం సాధించాడు. అనగనగా ఒక రోజు, సిందూరం, ఆవిడా మా ఆవిడే పాటలన్నీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈనాటికి ఆ సినిమాలో పాటలు జనాదరణ పొందటం విశేషం. మనీ మనీ, అమ్మోరు, లిటిల్ సోల్జర్స్ సినిమాలు శ్రీ విన్నూత్న పాటలకు రీరికార్డింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్తమాభిరుచుల స్వరకర్తగా నిరూపించాడు. 🎵🎵♾🎵🎵 ◾️⚫️◾️1995 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన "అమ్మోరు" సినిమా సంగీత దర్శకత్వం చేసాడు శ్రీ. ఆ చిత్ర నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి శ్రీ అంటే విపరీతమైన అభిమానం నమ్మకం. అందుకే "అమ్మోరు" సినిమా పాటలు చక్రవర్తి గారు పైపైన స్వరపరచి పూర్తి పాటలన్ని సన్నివేశం అణుగుణంగా రీరికార్డింగ్ చేసాడు. అసలు అమ్మోరు సినిమా కంపోజర్ శ్రీ అనేది చాలామంది తెలియదు. ఈ చిత్రంలో కీలక సన్నివేశంలో జాతరలో రాజమండ్రి నుంచి 15 మంది డప్పు వాయించే వారిని పిలిపించి ప్రయోగం చేసాడు. అలాగే, చిరంజీవి నటించిన 'అంజి' సినిమా రెండు పాటలను కంపోజ్ చేశాడు. కన్నడ నటుడు రమేశ్ అరవింద్, ఆనందం చిత్రం హీరో ఆకాశ్, పూరీ జగన్నాథ్ తమ్ముడు శాయిరామ్ శంకర్ వాయిస్ ఓవర్ (డబ్బింగ్) చేసాడు కంపోజర్ శ్రీ. 🎵🎵♾🎵🎵 శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా తండ్రి చక్రవర్తి గారి ప్రభావం కాని, శైలి గాని, ముద్ర గాని లేకుండా తన సొంత బాణీలో వేరే మార్గాన్ని ఎంచుకొని స్వరకల్పనం చేసాడు. శ్రీ కంపోజ్ చేసిన పాటల్లో చక్రవర్తి గారి బ్రాండ్ పడకుండా నైపుణ్యంతో విభిన్నంగా చేసాడు. చక్రవర్తి గారి సంగీతాన్ని నిలబెట్టలేదు కాని, ఆయన పేరును ఏమాత్రం చెడగొట్టలేదు. ఆ గౌరవం నిలబెట్టి తండ్రి ముందే శాశ్వతంగా శ్రీ వెళ్లిపోవడం ఊహించని హాఠాత్ పరిణామం జీర్ణించుకోలేని సంఘటనం. ఏదిఏమైనా, కొంత జీవితంలో నిరాశ నిస్పృహల మధ్య కెరియర్ ద్రోహం చేసుకోవడం, ఫిలిం ఇండస్ట్రీ వారు మనస్తత్వం అర్థం చేస్తుకోలేకపోవటం కారణంగా శ్రీ బంగారు భవిష్యత్తు అర్థాంతం ముగిసింది. ఒక గొప్ప యువ స్వరకర్తను సంగీతాభిమానులు, చిత్ర పరిశ్రమ కోల్పోవడం అత్యంత విచారకరం దారుణం. ▪️◾️⬛️◾️▪️శ్రీ మ్యూజికల్ సెక్షన్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తు దూసుకుపోయే నవతరం యువతరం సంగీత కెరటంలా ఎదిగే సమయంలో ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం శ్రీ మధ్య జరిగిన యథార్థ సంఘటన వివరాలు. ఈ విషయం ఇంత ఖచ్చితంగా చెప్పే కారణం మేము అక్కడే ఉన్నాం... అది 1998 సంవత్సరం ఆవిడా మా ఆవిడే సినిమా మ్యూజికల్ సిట్టింగ్స్ జరిగే సందర్భం. ఎస్.పి. బాలు గారు శ్రీతో మాట్లాడుతూ "ఏమోయ్ మీ నాన్నగారిలా అన్ని టైప్ సాంగ్స్ కంపోజ్ చేస్తున్నావు కదా మరి మాతో మెలోడి పాటలు ఎందుకు పాటించడం లేదోయ్? మీ నాన్నగారు ప్రతి కొత్త సంవత్సరం నాతో సుశీలమ్మతో కంపల్సరీగా కొత్త పాట కంపోజ్ చేయడం జరిగింది. ఆ బాటలో రాజ్ కోటి కూడా న్యూ ఇయర్ ఫస్ట్ కాంపోజిషన్ నడిచారు. మరి నువ్వేంటి మెలోడి సాఫ్ట్ పాటలు నాతో కంపోజ్ చేయడం లేదు" అన్నారు. వెంటనే శ్రీ "సుశీలమ్మ పాడటం లేదు కదా అదే కారణం" అని చటుక్కున అనేసి నవ్వేసాడు. ఎందుకంటే తండ్రి చక్రవర్తి గారి లాగే శ్రీ కి సుశీలమ్మ, ఘంటసాల, సాలూరి మహదేవన్ గార్లంటే చెప్పలేని ఆరాధనా అభిమానం. ఎప్పుడైనా ఖాళీ దొరికితే వీరి నలుగురి పాటలే వినే అలవాటు శ్రీ నైజం ఇష్టం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.