Jump to content

Recommended Posts

Posted

Chandrababu Naidu: ఇంధన రంగాన్ని గాడిన పెట్టాం...విద్యుత్ భారం తగ్గిస్తున్నాం : ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

30-09-2025 Tue 04:35 | Andhra
Chandrababu Naidu Announces Reduction in Electricity Charges in AP
 
  • విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక అడుగు పడిందన్న సీఎం చంద్రబాబు
  • నవంబర్ నుంచి విద్యుత్ చార్జీలు తగ్గుతాయన్న సీఎం
  • విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించామన్న సీఎం
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా ఒక కీలకమైన ముందడుగు పడింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా నవంబర్ నుండి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు.

గత 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన సత్ఫలితాలే ఈ ఘనతకు కారణమని ఆయన అన్నారు. ఇతర రాష్ట్రాలతో పవర్ స్వాపింగ్ విధానం ద్వారా పీక్ డిమాండ్ ఉన్న సమయాల్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసే విధానానికి అడ్డుకట్ట వేశామన్నారు. స్వల్పకాలిక కొనుగోళ్లలో ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పవర్ స్వాపింగ్ ఉపయోగపడిందని ఆయన తెలిపారు.

పీఎం కుసుమ్ స్కీమ్ ద్వారా రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తున్నామని, పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందుతోందని ఆయన అన్నారు. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ.98 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నామని, అంతేకాకుండా 1500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇలా అనేక చర్యలతో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన నిర్వహణతో విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టిందని ఆయన అన్నారు.

దీని ఫలితంగానే నేడు ట్రూడౌన్ పేరుతో కరెంటు ఛార్జీలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. యూనిట్‌కు 13 పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని, నవంబర్ నుండి ట్రూ డౌన్ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన విధంగా ట్రూ డౌన్ ద్వారా ప్రజలకు రూ.923 కోట్ల మేర భారం తగ్గిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు నెలకొల్పి ప్రజలకు మరింత చౌకగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన అన్నారు. విద్యుత్ రంగంలో మార్పు ఇప్పటికే మొదలైందని, ఈ మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందని ప్రజలకు వినయంగా తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. 
Posted

Chandrababu Naidu: నేడు ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్!

30-09-2025 Tue 04:33 | Andhra
Chandrababu Naidu and Nara Lokesh to Visit Delhi Today
 
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న సీఎం చంద్రబాబు
  • అక్టోబర్ 16న కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించనన్న సీఎం
  • ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ సమావేశమయ్యే అవకాశం
  • సీఐఐ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ల ఢిల్లీ పర్యటన ఖరారు అయింది. ఈరోజు (మంగళవారం) ఉదయం వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో వారు కేంద్ర నేతలతో కీలక భేటీ కానున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో జరగనున్న జీఎస్టీ 2.0 కార్యక్రమానికి ప్రధాని మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. అలాగే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక మద్దతు, ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
 
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి సీఐఐ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపే అవకాశం ఉంది.
 
ఇక మంత్రి నారా లోకేశ్ కూడా ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర ఐటీ, విద్య రంగాలకు సంబంధించిన కేంద్ర సహకారంపై వారు చర్చించనున్నట్లు తెలిసింది. అయితే ఒకే రోజు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. 
Posted

Chandrababu Naidu: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు... మంత్రి నారా లోకేశ్ స్పందన

29-09-2025 Mon 22:57 | Andhra
Chandrababu announces reduction in electricity charges in Andhra Pradesh
 
  • విద్యుత్ ట్రూ-అప్ ఛార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • యూనిట్‌పై 13 పైసలు తగ్గింపునకు ప్రభుత్వ నిర్ణయం
  • దేశంలోనే తొలిసారిగా 'ట్రూడౌన్' విధానం అమలు
  • నవంబర్ నెల నుంచి వినియోగదారులకు ఊరట
  • సమర్థ నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
  • ఇది ప్రజా ప్రభుత్వమని మరోసారి రుజువు చేశామన్న మంత్రి లోకేశ్
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దేశంలోనే తొలిసారిగా 'ట్రూడౌన్' విధానాన్ని అమలు చేస్తూ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రజలపై ఏకంగా రూ.923 కోట్ల భారం తగ్గనుండగా, వచ్చే నవంబర్ నెల నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. యూనిట్‌కు 13 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ "దేశ చరిత్రలో ట్రూడౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్న తొలి రాష్ట్రం మనదే. ఈ నిర్ణయాన్ని ప్రకటించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈ భారాన్ని తగ్గిస్తున్నాం" అని తెలిపారు. గత 15 నెలలుగా విద్యుత్ వ్యవస్థల సమర్థవంతమైన నిర్వహణ, సరైన ప్రణాళికల వల్లే ఈ సానుకూల ఫలితం సాధ్యమైందని ఆయన వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి చంద్రబాబు వివరిస్తూ, "ఇతర రాష్ట్రాలతో 'పవర్ స్వాపింగ్' విధానాన్ని అనుసరించడం ద్వారా విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని గణనీయంగా తగ్గించగలిగాం. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో (పీక్ అవర్స్) అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని అధిగమించాం. ఈ విధానం వల్ల ఆదా అయిన ప్రయోజనాన్ని ఇప్పుడు ట్రూడౌన్ రూపంలో ప్రజలకు అందిస్తున్నాం" అని పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'పీఎం కుసుమ్' పథకం కింద రైతులకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. అదేవిధంగా, 'పీఎం సూర్యఘర్' పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ.98,000 వరకు సబ్సిడీ అందిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించేందుకు రాష్ట్రంలో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

రానున్న రోజుల్లో 'క్లీన్ ఎనర్జీ పాలసీ'ని తీసుకువచ్చి, పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తద్వారా ప్రజలకు మరింత చౌకగా, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తాము తీసుకొచ్చిన మార్పు భవిష్యత్తులో మరిన్ని అద్భుత ఫలితాలను సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి నారా లోకేశ్ ఏమన్నారంటే...!

ఈ నిర్ణయంతో ప్రజలపై సుమారు వెయ్యి కోట్ల రూపాయల భారం తగ్గనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మరో ముఖ్యమైన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రజా ప్రభుత్వం అంటే ఏమిటో తమ ప్రభుత్వం మరోసారి నిరూపించిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) రద్దు చేయడం నుంచి మొదలుకొని, ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ నిర్వీర్యమైందని, దాని భారాన్ని ప్రజలపై మోపారని లోకేశ్ విమర్శించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం తీసుకున్న ట్రూ-అప్ ఛార్జీల తగ్గింపు నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రూ-డౌన్ నిర్ణయంతో రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరుతుందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Posted

First, electricity rate 50% penchutam….saripoledu ani cheppi Jaggadi boochi ani chupetti inkoka 50% penchutham…

Atarvata public tiragapadutaru ani telisi, oka 10% taggistadu…

tarvata desham antha tirigi idigo rate taggindi ani dappu kodtaru…

eedu tagginche danikante, tagginchinam ani chese publicity ki ekuva karchu aitadi..

Posted
15 minutes ago, Android_Halwa said:

First, electricity rate 50% penchutam….saripoledu ani cheppi Jaggadi boochi ani chupetti inkoka 50% penchutham…

Atarvata public tiragapadutaru ani telisi, oka 10% taggistadu…

tarvata desham antha tirigi idigo rate taggindi ani dappu kodtaru…

eedu tagginche danikante, tagginchinam ani chese publicity ki ekuva karchu aitadi..

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...