Popular Post kakatiya Posted October 16 Popular Post Report Posted October 16 She inspired sp balasubramanyam. When SPB was a teenager around 13 years old he fell in love with her poster..he was big fan. 2 1 Quote
kakatiya Posted October 17 Author Report Posted October 17 (అక్టోబర్ 16 - 2025) -- "రావు బాలసరస్వతి దేవి గారికి శ్రద్ధాంజలి.. --" 🪔🪔🪔 ఆమె స్వరం తెలుగు శ్రోతలకో వరం. 🎶 🎵 ఆమె గాన మాధుర్యంలో బేధాభిప్రాయాలకి చోటే లేదు. 1928 అక్టోబర్ 28న బాపట్ల లో జన్మించిన ఈ సరస్వతి దేవి గాయని అయ్యాక బాలసరస్వతి దేవి అయింది. "రావు బహుదూర్ బిరుదాంకితులు, వెంకటగిరి జమీందారు వంశంలో రాజా వారితో వివాహమయ్యాక రావు బాలసరస్వతి దేవి అయ్యింది" చిన్నతనంలోనే సంగీతం నాటకాలపై ఉన్న ఆసక్తి కారణంగా చదువు మూడో తరగతి దాటలేదు. సితార వాయించే ఈమె తండ్రి ప్రోత్సాహం ఉండటంతో ఆరేళ్ల వయసులోనే ఓ సంగీత కార్యక్రమంలో పాడింది. పదేళ్ళ వయసులోనే బాలనటిగా నాటకాల్లో సినిమాల్లో అరంగేట్రం చేసింది. హిందుస్తానీ సంగీతంలో ఒక సంవత్సరం బొంబాయి వెళ్ళి ప్రసీద్ధ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ వద్ద శిక్షణ పొందింది. కొంచెం పెద్దయ్యాక 1940లో వచ్చిన ఇల్లాలు సినిమాలో యస్ రాజేశ్వరరావు తో కలిసి నటించింది. ఈ పరిచయం ఆలంబనగా హెచ్ ఎం వి సంస్థకి అనేక లలిత గీతాలు మృదుమధురంగా పాడటంతో ఈమె పేరు తమిళ కన్నడ హిందీ లకు పాకి అక్కడా కొన్ని పాటలు పాడేలా చేసింది. ఈమె గాత్రం నౌషాద్ అంతటివారిని కూడా ముగ్ధుల్ని చేయడంతో ఆయన రెండు హిందీ పాటలు పాడించారు. లతా మంగేష్కర్ అడ్డుకోవడంతో ఆ హిందీ సినిమాలో మిగతా పాటలన్నీ లతా చేతే పాడించారు. లతాజీ తన కేరీర్ కి అడ్డం తగిలిందని రావు బాలసరస్వతి చెబుతుండే వారు. ఓగిరాల, సుబ్బరామన్, రాజేశ్వరరావు, ఘంటసాల, రమేష్ నాయుడు వంటి సంగీత దర్శకులు ఈమెని బాగా ప్రోత్సహించి చాలా మంచి పాటలు పాడించారు.. లలిత గీతాలు, సినిమా పాటలు కూడా. తొలుత పది సినిమాల్లో నటించి పాటలపై దృష్టి సారించారు. మొత్తం రెండు వేల పైచిలుకు పాటలు పాడారు. కేరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే వివాహం ఓ అడ్డంకిగా మారింది. పెద్ద జమీందారీ వంశంలో అడుగు పెట్టడంతో అక్కడి పద్ధతులకి తలొంచాల్సి వచ్చింది. అలా మూడేళ్ల పాటు తన కేరీర్ కి బ్రేక్ పడింది. ఐతే, ఈమెలోని తపన భర్త మెల్లగా గ్రహించడం, అక్కినేని నాగేశ్వరరావు, యస్ రాజేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు.. ఈ ముగ్గురు రాజా వారిని కలిసి ఒప్పించే ప్రయత్నం చేయడంతో మళ్ళీ సింగర్ గా బిజీ అయ్యింది. శ్రీశ్రీ రాసిన తొలి గీతం పాడిన ఘనత రావు బాలసరస్వతి దే. తరువాత సంసారం పిల్లలు బాధ్యతల వలన ఎక్కువగా పాడలేకపోయింది. ఈమె పాడిన చివరి పాటగల చిత్రం విజయనిర్మల రూపొందించిన సంఘం చెక్కిన శిల్పాలు. 1974లో భర్త రాజావారి మరణంతో ఈమె జీవితం అతలాకుతలమైంది. దివాణం వైభవం అన్నీ పోయాయి. ఆస్తులు స్థలాలు ఎవరికందింది వాళ్ళు దోచుకున్నారు. 850 ఎకరాల స్థలం అన్నవరం దేవస్థానం పాలైంది. ఈవిడకి ముట్టింది అరకొరే. ఇద్దరు కొడుకులుతో మైసూర్ లో ఓ అద్దె ఉంట్లో ఉండాల్సి వచ్చింది. కొడుకులు కొంత ప్రయోజకులైనంత వరకూ ఆర్ధిక ఇబ్బందులు తప్పలేదు. #ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఈమె పరిస్థితిని తెలుసుకుని తన కొలువులో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్ వచ్చేయమన్నారు. ఇక్కడా దురదృష్టం వెంటాడింది. ఇంతలోనే రాజకీయంగా దెబ్బతిన్న ఎన్టీఆర్ కి గడ్డురోజులు రావడం 1996లో మరణించడం జరిగాయి. కొన్నేళ్ల తరువాత హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు కొడుకులు ప్రయోజకులు కావడంతో. గాయనిగా రావు బాలసరస్వతి దేవి అనేక అవార్డులు సత్కారాలు అందుకున్నారు. వయసు మీరీన తరువాత కూడా ఆహ్వానం అందితే సభలకు హాజరయ్యేవారు. అందరితో తన పాటలు, జీవితానుభవం మననం చేసుకునేవారు. తన జీవితంలో అత్యంత మధుర క్షణాలు.. మనకి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజునే (15-08-1947) మద్రాసు రేడియో కేంద్రంలో ప్రభాత ప్రాంగణమున మ్రోగెను నగరా.. అనే ఉత్తేజభరిత పాట పాడటం అని చాలా సార్లు చెప్పారు. రావు బాలసరస్వతి దేవి గారు 97 సంవత్సరాలు జీవించి నిన్ననే (15-10-2025) తన స్వగృహంలో మణికొండ హైదరాబాద్ లో సునాయాస మరణం పొందారు. వృద్ధాప్యం తప్పిస్తే అనారోగ్య సమస్యలు పెద్దగా ఏమీలేవని ఆమె కుమారుడు చెప్పారు. తొలి తెలుగు ప్లేబ్యాక్ సింగర్ గా గుర్తింపు పొందిన మధుర గాయని ఆర్ బాలసరస్వతీ దేవి లేని లోటు ఎవరూ పూడ్చ లేనిది. ఎందరో అలనాటి అభిమానులు ఈమె పాటలను పదేపదే గుర్తుచేసుకునే వారు. ఇంతటి సుదీర్ఘమైన జీవితం పొందిన వారు చాలా అరుదుగా ఉంటారు. సంగీత సరస్వతి.. రావు బాలసరస్వతి దేవి గారికి... ఆశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ.. ---- 🙏🙏🙏 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.