psycopk Posted 4 hours ago Report Posted 4 hours ago ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అసలు కథ! పార్లమెంటులోనే జగన్ పరువును గాలికొదిలేసిన మిథున్ రెడ్డి! జగన్ అంటే డోంట్ కేర్ అన్నట్టుగా మిథున్ వ్యవహారం – వైకాపా వర్గాల్లో షాక్, సైలెన్స్! “నేను గెలిచాను… లోకం మెచ్చింది! నేను నవ్వాను… వైకాపా ఏడ్చింది! నాకింకా ఆ పార్టీతో పనేముంది? డోంట్ కేర్!” లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొని బెయిల్ మీద బయటకొచ్చిన మిథున్ రెడ్డి, అప్పటి నుంచే తెగించి మాట్లాడుతున్నాడు. “నేను నోరు విప్పితే వైకాపా దుకాణం మూతపడుతుంది… లిక్కర్ బాస్ కళ్లే గిరగిరా తిరుగుతాయి!” అన్న స్థాయిలో వ్యాఖ్యలు – తాడేపల్లి వర్గాల్లో గుబులు! పార్లమెంటులో రాహుల్ గాంధీ సైతం ఆశ్చర్యపోయేలా, జగన్‌కు చెప్పకుండా… బీజేపీని ఇరకాటంలో పెట్టేలా… తన గెలుపుపైనే తనకే అనుమానం ఉందన్నట్టు మిథున్ రెడ్డి చేసిన ప్రదర్శన – అది జగన్‌కు రాజకీయంగా గుదిబండే! కడప–బెంగళూరు రైల్వే లైన్ ఉదంతం అయితే వైకాపా అసలు నైజానికి అద్దం. దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్ట్‌కు వైఎస్సార్ నుండి జగన్ వరకూ పైసా పెట్టలేదు. చంద్రబాబు హయాంలో DPR, అనుమతులు తెచ్చిన తర్వాత, జగన్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వాటా ఇవ్వకుండా అడ్డుకున్నాడు. పార్లమెంటులో ప్రశ్నిస్తే “మీ సీఎం జగన్ నిధులు ఇవ్వలేదు” అని కేంద్ర మంత్రి మొహం మీదే చెప్పిన అవమానం! అప్పుడు వైకాపా ఎంపీల మందంతా తలదించుకున్న దృశ్యం ప్రజలకు ఇంకా గుర్తుంది. సంపద సృష్టించే మూలధన వ్యయం వదిలేసి, కేవలం బటన్ నొక్కే పాలనతో రాష్ట్రాన్ని రెండు దశాబ్దాలు వెనక్కి నెట్టిన జగన్ పాలనపై అప్పుడే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆ పరాభవాలన్నింటినీ మరిచిపోయినట్టు నటిస్తూ, ఇప్పుడు మిథున్ రెడ్డి కొత్త పల్లవి అందుకోవడం వైకాపా నేతలకే జీర్ణం కావడం లేదు. “వీడి అజెండా వేరే… తండ్రీ–కొడుకుల అరాచకాలే సీమ, గోదావరి జిల్లాల్లో పార్టీని పాడెక్కించాయి” అని అంతర్గత చర్చలు జోరుగా సాగుతున్నాయట. ఇంకో చేదు నిజం ఏమిటంటే – ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమాంతరంగా ఎదిగిన పెద్దిరెడ్డిని మంత్రి పదవికీ నోచుకోకుండా మానసికంగా అణిచివేశారు. అదే చరిత్ర ఇప్పుడు తిరుగుతున్నట్టేనా? శకుని పాచికలతో ఒక్కసారి గెలిచిన జగన్, అహంకారంతో మట్టి కరిచి ఇప్పుడు కర్ణాటక మడుగుల్లో దాక్కున్నాడన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పుంగనూరు నుంచి తంబళ్లపల్లె వరకే కాదు, కడప జిల్లా జమ్మల “మడుగు” వరకూ నెక్స్ట్ సీఎం మిథున్ రెడ్డి అన్న చర్చ నడుస్తోంది అంటే వైకాపా పునాదులు ఎక్కడ దెబ్బతిన్నాయో అర్థం చేసుకోవచ్చు. కడపలోనే కడతేరిపోతుందా వైకాపా? కాలమే సమాధానం చెప్పాలి… #YCPInternalWar #MithunReddy #JaganExposed #PoliticalShock #AndhraPolitics Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.