adavilo_baatasaari Posted yesterday at 04:27 AM Report Posted yesterday at 04:27 AM పుట్టిన రోజు శుభాకంక్షలు 1 Quote
kakatiya Posted yesterday at 08:48 PM Author Report Posted yesterday at 08:48 PM నరసింహరాజు .. 1970 - 80 దశకాలలో హీరోగా తన జోరు చూపించారు. 1974లో వచ్చిన 'నీడలేని ఆడది' సినిమాతో ఆయన పరిచయమయ్యారు. ఆ తరువాత చేసిన 'తూర్పు పడమర' .. ' జగన్మోహిని' సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈయన ఆంధ్ర కమలహాసన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.జగన్మోహిని సినిమాకు అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ లో ఉన్న హీరోలను ముందు అనుకున్నారట. ఈ సినిమాతోనే నరసింహరాజుకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.అనుకున్నది సాధిస్తా, అంతులేని వింత కథ, అత్తవారిల్లు, కన్యా కుమారి, కలియుగ మహాభారత, పున్నమి నాగు, పునాది రాళ్లు, నీడలేని ఆడది, ప్రయాణంలో పదనిసలు, రంభ ఊర్వశి మేనక, లక్ష్మీ పూజ, త్రిలోక సుందరి, సీతాపతి సంసారం,లాంటి సినిమాల్లో నటించారు. పశ్చిమగోదావరి జిల్లా, ఉండ్రాజవరం లో మట్లూరు అనే గ్రామంలో 1951 డిసెంబర్ 26న నరసింహరావు రాజు జన్మించారు.పీయుసి చదువుకునే రోజుల్లోనే సినిమాపై ఆసక్తి కలగడంతో మద్రాస్ కు వెళ్ళిపోయారు.అప్పట్లో నరసింహారాజు తండ్రి ఎంతో దానగుణం కలిగి ఉండి అనేక ఆస్తులను దానం పేరుతో పోగొట్టుకున్నాడు.అలా చెన్నైకి వెళ్ళిన నరసింహారాజుకి విఠలాచార్య పరిచయంతో తన జీవితం మరోవైపు మలుపు తిరిగింది. అప్పట్లో సావిత్రిగారితో కలిసి నటించాను .. కానీ ఆమె అన్ని కష్టాలలో ఉన్నట్టుగా నాకు తెలియదు. ఆమె ఎప్పుడూ కూడా తన కష్టాలను గురించి చెప్పుకున్నట్టుగా నేను చూడలేదు. ఆమె కష్టాలను గురించి తెలిసినవారు ఆదుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది. అలాగే పద్మనాభం గారు కూడా చెప్పుకునేవారు కాదు. తమ వేషానికి తగిన పారితోషికం తీసుకుని వెళ్లిపోయేవారు" అని అన్నారు. "ఇక కాంతారావుగారితోను కలిసి నటించాను. కానీ ఎప్పుడూ ఆయన తన ఇబ్బందులను గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న ప్రదేశంలో గతంలో కాంతారావుగారు ఉండేవారట. 10 - 15 లక్షల అప్పు తీర్చడం కోసం ఆయన ఇక్కడి ఇల్లు అమ్ముకుని వెళ్లారు. ఇప్పుడు ఈ చోటు కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. ఆరోగ్యం .. ఆదాయం కాపాడుకుంటూ వెళుతున్నవారు అదృష్టవంతులనుకోవాలి" అని అన్నారు. ఇక నరసింహ రాజు వ్యక్తిగత జీవితం విషయాల్లోకి వస్తే ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.కుమార్తె మెహది పట్నంలో అనేక కళాశాలలకు హెచ్ఆర్ గా పనిచేస్తుండగా, కుమారుడు మాత్రం కెనడాలో సెటిల్ అయ్యాడు.తండ్రి హీరోగా సంపాదించింది ఏమీ లేకపోవడంతో కొడుకు అయిన గట్టిగా సినిమాల్లో నటించాలని కోరుకున్నప్పటికీ నరసింహరాజు అందుకు ఒప్పుకోలేదు.దాంతో కెనడా వెళ్లి అక్కడ ప్రొఫెసర్ గా జాయిన్ అయి బాగా స్థిరపడ్డాడు నరసింహ రాజు కొడుకు.నరసింహ రాజుకి కెనడాలో 10 ఎకరాల గార్డెన్ తో పాటు రెండు ప్యాలెస్ లు కూడా ఉండడం విశేషం.ప్రతి వేసవి కాలంలో భార్యతో కలిసి నరసింహారాజు తన కొడుకు దగ్గరికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వస్తారట. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.