BattalaSathi Posted Saturday at 01:49 PM Report Posted Saturday at 01:49 PM Patang Movie: హీరోయిన్ డ్రెస్‌ల వివాదం: ఏ బట్టల సత్తిగాడి మాట వినకండి: ఎస్కేయన్ ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ (patang movie 2025). By Eenadu 1 min. read View original ఇంటర్నెట్‌డెస్క్: ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రధారులుగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘పతంగ్’ (patang movie 2025). ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. డి.సురేశ్‌బాబు సమర్పణలో సురేశ్ కొత్తింటి, నాని బండ్రెడ్డి నిర్మించారు. గౌతమ్ మేనన్, ఎస్పీ చరణ్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పతంగ్’ సక్సెస్ మీట్లో పాల్గొన్న నటుడు సందీప్ కిషన్, నిర్మాత ఎస్కేయన్ హైదరాబాద్‌లోని మూవీ లవర్స్ కోసం ఆఫర్ ప్రకటించారు. 20శాతం డిస్కౌంట్.. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘క్రిస్మస్ సందర్భంగా వచ్చిన సినిమాలన్నీ మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ‘శంబాల’, ‘దండోరా’, ఛాంపియన్’ ఒక్కో సినిమా బిర్యానీ, తందూరి చికెన్, చికెన్ 65లా ఉంది. అన్నీ తిన్న తర్వాత ఒక స్వీట్ తినాలి కదా. అదే ‘పతంగ్’. ఈ సినిమా పాయసంలా ఉంటుంది. ఇలాంటి వినోదాత్మక చిత్రం ఎక్కువమందికి చేరువ అవ్వాలి. ఇందుకోసం 500 టికెట్లు నా తరఫున ఇస్తా. సినిమా చూడండి. ‘శంబాల’ టికెట్లను తీసుకుని ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్లకు వెళ్తే 20శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ‘పతంగ్’కు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది’’ అని అన్నారు. ఏ బట్టల సత్తిగాడి మాట వినకండి..: ఎస్కేయన్ అలాగే నిర్మాత ఎస్కేయన్ కూడా సినిమా బాగుందని కితాబిచ్చారు. ‘‘నా స్నేహితులకు, ఫాలోవర్స్‌కు ‘పతంగ్’ ఫ్రీ షో వేస్తా. ఈ రెండు మూడు రోజుల్లో ఒక మల్టీప్లెక్స్ స్క్రీన్ మొత్తం తీసుకుని అందరినీ ఆహ్వానిస్తా. ప్రెస్ మీట్లో ఏదైనా మాట్లాడితే అది వైరల్ అవుతుందన్న విషయం కూడా ఈ ‘పతంగ్’ టీమ్‌కు తెలియదు. సినిమా బాగుంటే జనాలు వస్తారని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అంతా మారిపోయింది. ఒకడు సినిమా చూడకుండానే రివ్యూ రాసేస్తాడు, ఇంకొకడు ఏదో మాట్లాడేసి అటెన్షన్ తిప్పుకొంటాడు. అమ్మాయిలు, హీరోయిన్స్ మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోండి.. మీపై మీకు నమ్మకాన్ని ఇచ్చే దుస్తులు వేసుకోండి.. ఏ బట్టల సత్తిగాడి మాట వినకండి’’ అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్లో ‘పతంగ్’ మూవీని జనవరి 1న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. Quote
psycopk Posted Saturday at 02:17 PM Report Posted Saturday at 02:17 PM November lo nuts tinakunda undi sampadinchina telivia idi anta. 🤣🤣 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.