BattalaSathi Posted 4 hours ago Report Posted 4 hours ago ప్రియాంక గాంధీ ఇంట వేడుక.. కుమారుడి ఎంగేజ్మెంట్.. Priyanka Gandhi son Engagement: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడి నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. By Eenadu 1 min. read View original దిల్లీ: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రేహాన్ వాద్రా (Priyanka Gandhi son Engagement) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో రేహాన్ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం వీరిద్దరూ దిగిన ఫొటోను అవీవా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. తర్వాత అదే ఫొటోను ‘హైలైట్స్’ సెక్షన్లో ఉంచారు. దీంతో వీరి ఎంగేజ్మెంట్ వార్తలకు ఇది మరింత బలం చేకూర్చినట్లయ్యింది. రేహాన్-అవీవా ఏడేళ్లుగా స్నేహితులు. ఇటీవల అవీవా ముందు రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. దానికి ఆమె ఆమోదించినట్లు సమాచారం. వీరి ప్రేమ బంధాన్ని ఇరు కుటుంబాలు అంగీకరించి నిశ్చితార్థం జరిపించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే దీనిపై గాంధీ, వాద్రా కుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అవీవా కుటుంబసభ్యులు దిల్లీకి చెందినవారని, వాద్రా కుటుంబంతో వీరికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. రేహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్. వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో దిల్లీలోని బికనేర్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన తొలి ఎగ్జిబిషన్ నిర్వహించారు. అవీవా కూడా ఫొటోగ్రాఫర్. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్ పూర్తి చేశారు. ఓ ఫొటోగ్రఫిక్ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీకి సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.