Jump to content

Pinkies nedurumalli vesadu… pv cheaadu ane paytm gorrela kosam


Recommended Posts

Posted

This is how few paytm dogs think development happened automatically 

 

Posted

1/2
కొంచెం lengthy #post see this everyone  #వాస్తవాలు తెలుసుకోవాలనుకునేవారు తప్పకుండా చదవండి !!

👉 STPI (సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా) కి...
HI-TEC City (హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ) కి... 
ముందుగా తేడా తెలుసుకోవాలి అందరూ !

అప్పటికి అంటే 1991-94 నాటికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం మరియు మన రాష్ట్రంలో ఉన్నప్పటి వరకు... STPI లు దేశం మొత్తం మీద కేవలం 7 చోట్ల మాత్రమే ఉన్నాయి !

1990లో స్థాపించబడినవి (మొదట ప్రత్యేక సంస్థలుగా ఉండి, 1991లో STPIలో విలీనమయ్యాయి):
పుణె,  
బెంగళూరు, 
భువనేశ్వర్,  
1991లో స్థాపించబడినవి (STPIలో భాగంగా):
తిరువనంతపురం,  
నోయిడా, 
గాంధీనగర్,  
హైదరాబాద్.

1995 నుండి 2004 మధ్యలో STPIలు... విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది !

శ్రీ రాజీవ్ గాంధీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్:
నేపథ్యం: ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన STPI (Software Technology Parks of India) కిందకు వస్తుంది.
పేరు: అప్పటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, హైటెక్ సిటీలోని భూమిని మరియు ప్రాజెక్టును 'శ్రీ రాజీవ్ గాంధీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్' గా నామకరణం చేశారు.
నిర్వహణ: "ఇది ఒక భవనం కాదు, ఇదొక పెద్ద ఐటీ ప్రాజెక్టు" మాత్రమే. 

అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణల్లో భాగంగా 'సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా' (STPI) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయం ఆధారంగానే జనార్ధనరెడ్డి క్యాబినెట్ హైదరాబాద్‌లో ఈ ఐటీ పార్కును ఆమోదించింది.

STPI కి నోడల్ ఏజెన్సీ గా APEL (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) వ్యవహరించింది !

STPI కి సొంత భవనం లేక చాన్నాళ్ళు అమీర్ పేట మైత్రి వనంలో కార్యకలాపాలు నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే !

👉 ఇక HI- TEC City (Hyderabad Information Technology and Engineering Consultancy City) విషయానికి వస్తే..

HI-TEC City పేరు హైదరాబాద్‌లో IT, ఇంజనీరింగ్, కన్సల్టెన్సీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పెట్టబడింది. ఈ పేరు IT, ఇంజనీరింగ్, ఆరోగ్య సమాచార శాస్త్రం, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి రంగాలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది.

బెంగళూరు IT హబ్‌గా ఎదగడంతో హైదరాబాద్‌కు పోటీ పడటానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ncbn గారు 1997లో సింగపూర్, మలేషియా సందర్శనలు చేసిన తర్వాత హైటెక్ సిటీకి పునాదిరాయి వేసిన సమయంలో (1 ఆగస్ట్ 1997న) ఈ పేరును ప్రతిపాదించారు. L&T ఇన్ఫోసిటీ (HITEC City) ప్రాజెక్ట్‌గా అధికారికంగా ప్రకటించబడింది.

ఈ L&T ఇన్ఫోసిటీ కి నోడల్ ఏజెన్సీ గా APIIC వ్యవహరించింది.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిగిన PPP ప్రాజెక్టు !!

సైబర్ టవర్స్ అనే ఐకానిక్ భవన నిర్మాణం ప్రారంభించిన కేవలం 14 నెలల్లోనే సైబర్ టవర్స్ పూర్తి చేయడమే కాకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అంతేకాకుండా ఆ 14 నెలల్లోనే 300 ఎకరాల్లో హైటెక్ సిటీలో కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి ఇతర నిర్మాణాలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దారు !!

1998లో స్పష్టమైన 'విజన్ 2020' డాక్యుమెంటును రూపొందించి  విజన్ 2020 డాక్యుమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు రూపొందించి సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిని పరుగులు తీయించారు ! 

మొదట 300 ఎకరాల్లో హైటెక్ సిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు, ఆ తర్వాత 15,000 ఎకరాల్లో 'సైబరాబాద్' ను రూపొందించారు. అప్పుడే ఎక్కడ ఐటీ హబ్‌లు ఉండాలో, ఎక్కడ కమర్షియల్ హబ్‌లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్ మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండాలో, వాటికి రోడ్లు ఎలా ఉండాలో వివరిస్తూ చంద్రబాబు గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు ! 

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైలు, MMTS.. ఇవన్నీ విజన్ 2020లో భాగమే. 2001లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న ప్రధాన ఐటీ హబ్‌లన్నీ 2000-2004 మధ్య కాలంలో ప్రారంభించినవి లేదా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే !

అప్పట్లోనే ₹33 వేల కోట్ల విలువైన ఐటీ కంపెనీల పెట్టుబడులను ఆయన తీసుకువచ్చారు. సైబర్ టవర్స్, మైక్రోసాఫ్ట్, ఎల్ అండ్ టీ ఇన్ఫోసిటీ, CII, సైబర్ గేట్‌వే, సైబర్ పెరల్, మైండ్ స్పేస్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC), హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ (HITEX), విప్రో, ఒరాకిల్, ఇన్ఫోసిస్, TCS, ISB.. మొదలైనవన్నీ ఆయన కృషి ఫలితమే. మీకు తెలుసా? అమెజాన్ 2004లోనే తన సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి, 2019లో ప్రపంచంలోనే తన అతిపెద్ద టెక్ పార్కును ఇక్కడ నిర్మించుకుంది. ఇలా చంద్రబాబు గారు తెచ్చిన కంపెనీల జాబితా చెప్పాలంటే ఇక్కడ సరిపోవు !!

 

ఇదీ...
STPI కి
HI-TEC సిటీ కి మధ్య తేడా !

హైటెక్ సిటీ నేదురుమిల్లి జనార్ధనరెడ్డి కట్టాడు అని రుద్దుతున్న వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు ఇవి !!
#సామాన్యుడు #AndhraPradesh 
 

 

 

Posted

Chillar langa gallki eppatiki mararu ani daily prove chesukuntunaru gaa .. lol 

Posted
19 hours ago, yslokesh said:

Stones and salutes kaadhu samara....

Look where India is now. India lost in the race for AI, Quantum computing, EV industry, Rare earth industry, High-end chip technology, deep-sea water ports, Gen 5 & 6 Jet engine making, weapons for 21st century, combating climate pollution, eradicating poverty, eliminating corruption, providing clean water to citizens.

yeppudoo 1999-2000 lo muchatlu yendhuku? India happened to be IT outsourcing sooper power by chance, not by design.

Had it not been by PVNR in 1991, not sure where India would have landed.

Mobile phone techindhi neene, laptop kanipettindhi neene, Satya Nadella ki computers neerpindhi neene, Bill Gates ki Microsoft pettamani cheppindhi neene ..... ituvani sollu kaburlu meere naammaali..

World moved so fast and so far ..and India lost the race.

Malli jagan anna vastadu appudu ivanni automatic ga jarigi pothayi..... 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...