Jump to content

Remembering TNR on his birthday anniversary


Recommended Posts

Posted
15 minutes ago, citizenofIND said:

Hit Hitting GIF

Hi Ms Jwala

 

Does @Jatka Bandi console you like in the gif when you cry for not getting enough sarees ?

Posted
2 hours ago, kakatiya said:

తెలుగు ఇంటర్వ్యూ హోస్ట్, సినిమా జర్నలిస్టు, నటుడు. "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" పేరిట అతను నిర్వహించే ఇంటర్వ్యూ సీరీస్‌ ద్వారా చాలా ప్రాచుర్యం చెందారు. పలువురు తెలుగు సినీ నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర ప్రముఖులను అతను "ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌ " షోలో భాగంగా ఇంటర్వ్యూ చేయగా వాటిలో పలు వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూలు పొందాయి.  టి.ఎన్.ఆర్.గా పేరొందిన తుమ్మల నరసింహారెడ్డి గారి జయంతి జ్ఞాపకం !

     🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿

,తుమ్మల నరసింహారెడ్డి 1976 జనవరి 9న జన్మించారు. 

MV5BZGExOTYwZTUtZDliYi00NTYyLWI0MjItOTZl
అతని స్వంత ఊరు మంచిర్యాల జిల్లా పావునూరు గ్రామం, తండ్రి రాజిరెడ్డి గ్రామ సర్పంచిగా మూడు పర్యాయాలు ఎన్నికై పనిచేశాడు. చిన్నవయసులోనే అతని తల్లి మరణించడంతో అక్క అతనిని పెంచింది. హైదరాబాద్‌లోని సరస్వతీ శిశుమందిర్‌లో పాఠశాల విద్యను, వివేకవర్థిని కళాశాలలో డిగ్రీ చదువుకున్నారు. 46 ఏళ్ల తుమ్మల నర్సింహారెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

▪️సహాయ రచయితగా, టీవీ జర్నలిస్టుగా....

టి.ఎన్.ఆర్. దర్శకత్వంపై ఆసక్తితో డిగ్రీ పూర్తికాగానే సినిమా రంగంలోకి వచ్చాడు. 1992లో టి.ఎన్.ఆర్. దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు. ఆపైన సినిమా రచయిత ఎల్. బి. శ్రీరామ్ వద్ద సహాయ రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత టెలివిజన్ జర్నలిస్టుగా పలు టెలివిజన్ ఛానళ్ళలో పనిచేశాడు.ఈటీవీలో ప్రసారమైన నేరాలు-ఘోరాలు కార్యక్రమానికి సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు. ఎన్ టీవీలో క్రైమ్ స్టోరీస్, క్రిమినల్ వంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాడు.

▪️ఇంటర్వ్యూయర్‌గా, నటునిగా....

ఐడ్రీమ్ మీడియాలో "ఫ్రాంక్లీ స్పీకింగ్‌ విత్‌ టిఎన్‌ఆర్‌" అన్న ఇంటర్వ్యూ సీరీస్‌లో ఇంటర్వ్యూయర్‌గా తెలుగు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు. ఈ కార్యక్రమంలోని పలు ఇంటర్వ్యూలకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూలు లభించాయి. 2018 అక్టోబరు నాటికే టిఎన్ఆర్ ఇంటర్వ్యూలకు మొత్తంగా 20 కోట్ల పైచిలుకు వీక్షణలు లభించినట్టు సాక్షి పత్రికలో ప్రకటించిన అంచనా.
......
మొదట్లో దర్శకుడు తేజతో చేసిన ఇంటర్వ్యూ వైరల్ కావడంతో "ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ టిఎన్ఆర్" ప్రారంభమైంది. రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు వంటి సినిమా ప్రముఖులతో టిఎన్ఆర్ చేసిన ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి.4 - 8 గంటల సుదీర్ఘమైన సమయం ప్రేక్షకుల ఆసక్తి కోల్పోకుండేలా టి.ఎన్.ఆర్. పలువురు సినిమా ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాడు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటివారిని 4 గంటల పైచిలుకు ఇంటర్వ్యూలు చేశాడు. తాను గురువుగా భావించే ఎల్. బి. శ్రీరామ్ తో చేసిన ఇంటర్వ్యూ ఏకంగా 8 గంటల పాటు చేసి రికార్డు సృష్టించాడు. ఇంటర్వ్యూయర్‌గానూ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం అందుకునేవాడు.
.......
ఇంటర్వ్యూయర్‌గా ప్రాచుర్యం పొందాక టి.ఎన్.ఆర్.కు 
నటన అవకాశాలు పెరిగాయి. నేనే రాజు నేనే మంత్రి, జార్జ్ రెడ్డి, సుబ్రహ్మణ్యపురం, మళ్ళీ మళ్ళీ చూశా (2019), ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, జాతిరత్నాలు, ది రోజ్‌ విల్లా, దొరకునా ఇటువంటి సేవ, హాఫ్ స్టోరీస్, ఊరెళ్లిపోతా మామ, నేడే విడుదల, తెరవెనుక వంటి సినిమాల్లో టి.ఎన్.ఆర్. పాత్రలు పోషించాడు. 
.......
తన అభిమాన నటుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, దర్శక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌లను ఇంటర్వ్యూ చేయాలని, తాను దర్శకునిగా సినిమా తీయాలని టిఎన్ఆర్ కోరికలు. అందుకు తగినట్లుగానే మానవ విలువలతో పాటు ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టి.ఎన్.ఆర్. అంటుండేవారు. దర్శకత్వం చేసినా, ఇంటర్వ్యూ చేయడం ఆపనని చెప్పేవారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే మరణించడం. కమెడియన్ సత్య హీరోగా సందీప్ కిషన్ నిర్మాతగా వస్తున్న వివాహ భోజనంబు సినిమాలోనూ నటించారు. టిఎన్ఆర్. ఇప్పుడిప్పుడే సినిమాలలో మంచి మంచి పాత్రలు వేస్తూ తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్న సమయంలోనే టిఎన్ఆర్ మరణించాడు. టి.ఎన్.ఆర్. కోవిడ్-19 వల్ల 2021 మే 10లో మరణించారు. చనిపోయే సమయానికి ఈయన వయసు కేవలం 46 ఏళ్ళు మాత్రమే.

            🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿v

He was my favorite journalist man… used to watch all his interviews… missing him 

Posted

DO you know Director Maruthi has partnership in IDREAM Media?

Indirectly controlled by AA camp

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...