Jump to content

Rayalaseema traitor @ysjagan


Recommended Posts

Posted
37 minutes ago, balancer said:

kuppam is part of rayalaseema?

Kuppam lo evo issues unnayi ani talk

Hyd kattina pedda manishi evi kattaleda

Posted

Lol…

Thanks to Revanth…jaggadi chesindi chepukokapoina, Revantham punyama ani andariki telsindi, Baboru RLIS ni nakinchesindu ani confirm chesukunaru seema batch..

Meeru inka enni abadhalu seppina, issue limelight lo vunnanni rojulu meeke bokka

  • Upvote 2
Posted

2024 ఏప్రిల్ 1 తేదీ పూల్స్ డే కి సరిగ్గా 24 రోజుల ముందు బూచేపల్లి వెంకాయమ్మ రెడ్డి అవ్వ ఊరికి వెళ్లాడు జగన్. ఆ అవ్వ వైఎస్ రాజశేఖరరెడ్డి మీద స్వయంగా స్వరపరిచిన బాణీలతో అద్భుతమైన పాటను ఆలపించడం మొదలెట్టింది.

సభలో కలకలం. జరిగిన ఊహించని హఠాత్పరిణామానికి ఉలిక్కిపడ్డ జగన్, లేచి వెళ్లి తన అమ్మ విజయమ్మ మీద చూపే ప్రేమ కంటే  ఎక్కువ ఆప్యాయంగా ఆ అవ్వను పొదివిపట్టుకుని నడిపించుకు వచ్చి కూర్చోబెట్టేశాడు. 

దాని తరువాత అవ్వను కూడా సమీపంలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్దకు తీసుకు వెళ్లాడు. అవ్వనే కాదు యావత్తు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనం చెవుల్లో పూలు పెట్టబోతున్నాడని ఎవరూ ఊహించలేదు.

ఆ అవ్వ పాట విని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చి ఉంటే ఆ రెండో టన్నెల్లో ఇరుక్కున్న యంత్రానికి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకునేవాడు.

రాజకీయాల్లో ‘జాతికి అంకితం’ అనే పదానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ, గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ పదానికి అర్థం మారిపోయింది. పనులు చెయ్యకుండానే, కేవలం ఫొటోల కోసం రిబ్బన్లు కత్తిరించి ‘మమ’ అనిపించడం జగన్ మార్కు పాలనకు నిలువుటద్దం.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ గారు వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసేశారు. ఆ రోజు పండగ చేసుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఇప్పుడు వాస్తవాలు చూసి అవాక్కవుతున్నారు. 

ప్రస్తుతం ప్రాజెక్టు తొలి దశ పూర్తి కావడానికే ఇంకా రూ. 3,000 కోట్లకు పైగా నిధులు అవసరమని తేలింది (రూ. 2,000 కోట్లు పనులకు, రూ. 1,000 కోట్లు పునరావాసానికి). అసలు నీళ్లే రాని ప్రాజెక్టును ఏ విధంగా అంకితం చేశారో ఆ దేవుడికే ఎరుక!

పునాది నుంచి పురోగతి వరకు ప్రాజెక్టు చరిత్రను గమనిస్తే, 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పరుగులు పెట్టించింది.

చంద్రబాబు హయాంలో అత్యంత క్లిష్టమైన టన్నెల్-1 పనులలో సుమారు 13.6 కిలోమీటర్ల మేర తవ్వకాన్ని పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 'డబుల్ షీల్డ్ టన్నెల్ బోరింగ్ మిషన్' (TBM) ను వినియోగించి నల్లమల అడవుల గుండా తవ్వకాలు జరిపింది అప్పటి ప్రభుత్వమే.

ఆ ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 1,319 కోట్లు వెచ్చించి ప్రాజెక్టును ఒక కొలిక్కి తెచ్చారు.

గత జగన్ ప్రభుత్వం "పని పూర్తయ్యింది" అని గొప్పలు చెప్పుకున్నా, వాస్తవానికి ఐదేళ్లలో పనులు నత్తనడకన సాగాయి:

రెండో టన్నెల్‌లో మొత్తం 7 కిలోమీటర్ల లైనింగ్ చేయాల్సి ఉండగా, జగన్ పదవి నుంచి దిగిపోయే నాటికి సగం పని కూడా పూర్తి కాలేదు.

రెండో టన్నెల్‌లో చిక్కుకున్న భారీ యంత్రాన్ని బయటకు తీయకుండానే, కేవలం తవ్వకం పూర్తయ్యిందని అబద్ధపు ప్రచారం చేశారు.

వైకాపా ప్రభుత్వం రూ. 3,518 కోట్లు కేటాయించినట్లు చెప్పుకున్నా, వాస్తవానికి ఖర్చు చేసింది కేవలం రూ. 647 కోట్లు (18%) మాత్రమే.

మళ్లీ చంద్రబాబు రాగానే.. వెలిగొండ పనులకు ఊపిరి పోశారు:

రెండో టన్నెల్‌లో మిగిలి ఉన్న 3.6 కిలోమీటర్ల లైనింగ్ పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నాలుగు క్రేన్లతో రోజుకు 12 మీటర్ల మేర పని జరుగుతోంది.

ఫీడర్ కాలువలోని 500 మీటర్ల మేర ఉన్న కఠినమైన రాళ్లను (Hard Rock) తొలగించే పనులు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికోసం ప్రభుత్వం రూ. 456 కోట్లు మంజూరు చేసింది.

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 600 కోట్ల పునరావాస బిల్లుల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనివల్ల 7,321 ముంపు కుటుంబాల తరలింపు వేగవంతం కానుంది.

2026 జులై: కొత్త వెలుగుల లక్ష్యం
శ్రీశైలం జలాశయం నిండినప్పుడు వచ్చే వరద జలాలను 2026 జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు తరలించేలా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. ఈ నెలలోనే చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించి స్వయంగా సమీక్షించనున్నారు.

అభివృద్ధి అంటే ప్రకటనల్లో కనిపించడం కాదు, పొలాల్లో నీళ్లు పారడం. జగన్ హయాంలో జరిగిన ‘అంకితం’ ప్రహసనం ప్రజల కళ్లలో మట్టి కొట్టడమే. గతంలో చంద్రబాబు గారు వేసిన పునాదిని, ఇప్పుడు అదే వేగంతో పూర్తి చేసి 2026 జులై నాటికి వెలిగొండ జలాలను ప్రజలకు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

బూచేపల్లి అవ్వలాంటి అభిమానులను ఏమార్చే జగన్  బూచి రాజకీయాలు జనానికి అర్థం అయ్యి, ఎవరు పనిచేసేవారు ఒక స్పష్టత వచ్చింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...