Jump to content

Telugu women Died in Texas..........


Recommended Posts

Posted

[img]http://sakshi.com/newsimages/contentimages/09012011/UMA-photo9-1-11-8187.jpg[/img]

[size=10pt]డల్లాస్: ప్రవాసవనిలో పదహారణాల తెలుగింటి ఆడపడుచు పరమపదం చేరారు. జగజ్జనికి శుభమైన శుక్రవారం పూట పండంటి పాపకు జన్మనిచ్చి ప్రాణం విడిచారు. జగన్నాథుని జగన్నాటకంలో లీలగా కరిగిపోయారు. టెక్సాస్‌లోని రౌండ్ రాక్ సిటీలో నివసిస్తున్న తెలుగమ్మాయి ఉమా మహేశ్వరి (30) అనూహ్యంగా మరణించారు. గర్భిణి అయిన ఉమను బంధువులు కాన్పు నిమిత్తం ఇక్కడి స్కాట్ అండ్ వైట్ ఆసుపత్రిలో చేర్చారు. జనవరి 7, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఆమె పండంటి పాపకు జన్మనిచ్చారు. అయితే గంటసేపటి తర్వాత ఉమ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. అధిక రక్తస్రావమే ఉమామహేశ్వరి మరణానికి కారణంగా తెలుస్తున్నది. అయితే ఇతరత్రా కారణాలేవైనా ఉండవచ్చన్న అనుమానంతో ఉమామహేశ్వరి బంధువులు శవపరీక్ష నివేదిక కోసం వేచి చూస్తున్నారు. తిరుపతికి చెందిన ఉమా మహేశ్వరి ఎంసీఏ పూర్తిచేసి, నాలుగేళ్ళ క్రితం వివాహం చేసుకుని భర్తతో పాటు టెక్సాస్ చేరుకున్నారు. ఆమె భర్త చెన్నారెడ్డి కొరివి, ఇక్కడ ఆస్టిన్‌లోని ఐబీఎమ్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

ఉమా మహేశ్వరి మృతికి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. ‘తానా’ అధ్యక్షులు జయరామ్ కోమటి ఒక ప్రకటనలోచెన్నారెడ్డి కొరివి కుటుంబంతో పాటు మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఉమామహేశ్వరి భౌతిక కాయాన్ని స్వదేశం తరలించేందుకు సహకరించాలని చెన్నారెడ్డి స్నేహితుడైన రాజేష్ చలసాని కోరిన వెంటనే, ‘తానా’ ప్రతినిధులు వేగంగా స్పందించారు. ‘తానా’ ప్రెసిడెంట్-ఎలెక్ట్ తోటకూర ప్రసాద్, సంస్థ ప్రాంతీయ సంచాలకులు మురళీ వెన్నమ్, కోశాధికారి రామ్ యలమంచిలి నేతృత్వంలోని కార్యకర్తల బృందం, ఉమామహేశ్వరి భౌతిక కాయాన్ని స్వదేశం తరలించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ మేరకు కాన్సులేట్ అధికారులను సంప్రదించి సమన్వయం చేసుకుంటూ ప్రొసీజర్‌ను పూర్తి చేస్తున్నారు. బుధవారం నాటికి ఉమామహేశ్వరి భౌతిక కాయం స్వదేశం చేరుకోవచ్చని తోటకూర ప్రసాద్ ఈ-మెయిల్ ద్వారా వెల్లడించారు.
[/size]

Posted

[color=red][size=14pt]RIP..........[/size][/color]

Posted

paapam aah Newly born baby em authundho  sSa_j@il sSa_j@il

May her soul rest in peace

Posted

may her soul RIP..........

Posted

May Mrs. Uma's soul rest in peace. God bless newly born baby...

×
×
  • Create New...