kingmakers Posted January 12, 2011 Report Posted January 12, 2011 [img]http://suryaa.com/Main/gallery/2011/Jan/13/assembly-cm.jpg[/img]అధికార కాంగ్రెస్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేలు గీత దాటి జగన్‌తో కలసి ఢిల్లీలో ధర్నాకు వెళ్లిన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం సాంకేతికంగా మైనారిటీలో పడింది. నైతికంగా కూడా కిరణ్‌కుమార్‌రెడ్డికి పరిపాలించే హక్కు లేదన్న వ్యాఖ్యలు ఇప్పటికే క్షేత్రస్థాయిలోని వివిధ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాల నేతలు కూడా కిరణ్ తన బలాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తు న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరదింపి, పార్టీ పరువును, జగన్ వల్ల పెరిగిన అప్రతిష్ఠను తగ్గించుకోవాలంటే రాష్ట్రంలో రాష్ర్టపతి పాన విధించడమే ఉత్తమమని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.దానికితోడు తెలంగాణ అంశం కూడా చిక్కులు తెస్తున్నందున దానికీ రాష్టప్రతి పాలన తాత్కాలిక పరిష్కారంగా అంచనా వేస్తోంది. ఆ మేరకుఫిబ్రవరిలోపే రాష్ర్టపతి పాలన విధించవచ్చంటున్నారు. ఇటీవలి కాలంలో గవర్నర్ తరచూ ఢిల్లీ పర్యటించడం కూడా ఈ అనుమానాలను మరింత బలం చేకూరుస్తోంది. ఢిల్లీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం, సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, తెలంగాణపై సొంత పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహం-అసంతృప్తిని అణచివేసే పరిస్థితి లేనందున రాష్టప్రతి పాలన విధించడం ఒక్కటే పరిష్కారమని నాయకత్వం భావిస్తోంది. జగన్ వెంట వెళ్లకుండా ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడంతో పాటు, ఢిల్లీకి రాకుండా జగన్ వెంట ఇంకా మరో 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న సమాచారం అధిష్ఠానం వద్ద ఉంది.దీనితో ఇక బుజ్జగింపులు చేయడం వ్యర్థమని, దానికన్నా రాష్టప్రతి పాలన విధించడం ద్వారా పార్టీని కొద్దికాలమయినా కాపాడుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీలో జగన్ దీక్ష పరిణామాల ద్వారా కిరణ్ ప్రభుత్వం నైతికంగా పతనమయినట్లేనన్న అభిప్రాయం దాదాపు అన్ని వర్గాల్లోనూ నెలకొంది. సాంకేతికంగా కూడా కిరణ్ సర్కారు మైనారిటీలో పడినందున ఆయన సభలో విశ్వాసం నిరూపించుకోవలసి ఉంటుంది. 294 మంది ఉన్న అసెంబ్లీలో వైఎస్ విజయలక్ష్మి రాజీనామాతో 293 మంది ఉన్నారు. అందులో సాంకేతికంగా 155 మంది కాంగ్రెస్‌కు ఉన్నారు.అందులో ఢిల్లీ యాత్రకు 24 మంది వెళ్లారు. అంటే 131 మంది అధికారపార్టీని బలపరుస్తారు. అయితే, జగన్ ఢిల్లీ యాత్రకు ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో హాజరుకాలేదు. అంటే వారిని కలిపితే జగన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 39 మంది అవుతారు. అప్పుడు కాంగ్రెస్ బలం 116 మందికి పడిపోతుంది. అదే సమయంలో జగన్‌ను ఇద్దరు పీఆర్పీ, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సమర్ధిస్తున్నారు. ఆ రకంగా చూస్తే జగన్ బలం అసెంబ్లీలో 43 మంది అవుతారు. ఇక తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో బలం సాంకేతికంగా 91. అందులో ఇద్దరు జగన్‌ను, మరొకరు టీఆర్ఎస్లో చేరినందున టీడీపీ బలం 88. కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెడితే జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా దానిని బలపరిస్తే సర్కారు పుట్టి మునగక తప్పదు.ఒక వేళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దన్నుగా నిలవాలని భావిస్తే 11 మంది ఎమ్మెల్యేలున్న టీఆర్ఎస్ బలం తోడవుతుంది. 18మంది ఎమ్మెల్యేలు ఉన్న పీఆర్పీకి ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు దూరంగానే ఉంటున్నారు. అంటే వారి బలం 14. మజ్లిస్‌కు ఉన్న 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే అవకాశం ఉంది. మరో ముగ్గురు సర్కారుకు మద్దతనివ్వవచ్చు. దీన్నిబట్టి కాంగ్రెస్ సర్కారుకు టీఆర్ఎస్, పీఆర్పీ, మజ్లిస్ నుంచి 35 మంది ఎమ్మెల్యేల బలం తోడవుతుంది. ఆ విధంగా చూసినా ప్రభుత్వానికి 151 ఎమ్మెల్యేల బలం ఉంటుంది.టీడీపీ+ వామ పక్షాలు+ బీజేపీ +జగన్ మద్దతుదారుల సంఖ్య 138 అవుతుంది. సభలో సీపీఐకి-4, సీపీఎంకు 1, బీజేపీకి ఇద్దరు సభ్యుల బలం ఉంది. ప్రభుత్వం కూల్చే విషయంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్న లోక్‌సత్తా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. ఆ ప్రకారంగా చూసినట్టయితే కిరణ్ సర్కారు బయటపడుతుంది. అయితే.. పీఆర్పీ నుంచి 10మంది ఎమ్మెల్యేలు జగన్ వర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా అదే జరిగితే అప్పుడు కాంగ్రెస్ బలం 141కు పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వానికి -ప్రతిపక్షానికీ బలాలలో తేడా మూడు మాత్రమే. జగన్‌కు 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే నిజమయితే జగన్ వర్గం బలం అసెంబ్లీలో 45కి పెరిగి ఒక్క ఓటుతో కిరణ్ సర్కారు కూలిపోవచ్చు.ఎంపీ సబ్బం హరి అయితే తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వాదిస్తున్నారు. నిజంగా జగన్ వైపు అంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అసలు కిరణ్ సర్కారు మనుగడే కష్టమవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, అవిశ్వాసంపై బాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి టీఆర్ఎస్ కూడా సర్కారు కూల్చివేత వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. అదే నిజమైతే కాంగ్రెస్ బలం 130కి పడిపోతుంది. ఇన్ని కూడికలు, తీసివేతలు, సమీకరణలు పరిశీలించిన తర్వాతే అధిష్ఠానం రిస్కు తీసుకోవడం ఇష్టం లేకనే రాష్టప్రతి పాలన విధించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఒకవేళ సాహసించి అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమయినప్పటికీ, సర్కారు కూలిపోతే అప్పటికప్పుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లవలసి ఉంటుందన్న ముందుచూపు కూడా అధిష్ఠానానికి లేకపోలేదు. ఇప్పుడయితే ఆరునెలల పాటు రాష్టప్రతి పాలన విధించి, ఆ లోగా జగన్ వర్గం ఎమ్మెల్యేలను అణచివేసి పార్టీని కాపాడుకోవచ్చన్న ఆలోచన నాయకత్వంలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదే సమయంలో తెలంగాణ అంశంపై సొంత పార్టీ నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నందున... ఆ సమస్యను కొద్దిరోజులు పక్కదారి మళ్లిం చేందుకు సైతం రాష్టప్రతిపాలన పనికివస్తుందని అధిష్ఠానం భావి స్తోంది. రాష్టప్రతి పాలన అమలులో ఉండే ఆరు నెలలలోగా తెలం గాణలో పార్టీని బలోపేతం చేసుకోవచ్చని అంచనా వేస్తోంది.
Deletedid1 Posted January 12, 2011 Report Posted January 12, 2011 PRP + 19 TRS+ 11MIM + sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink
kingmakers Posted January 12, 2011 Author Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628419#msg1628419 date=1294875992]PRP + 19 TRS+ 11MIM + sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink[/quote]prp ki 19 ekkada nunchi vachayi baa @3$% @3$% @3$%
Pilla Zamindar Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628419#msg1628419 date=1294875992]PRP + 19 TRS+ 11MIM + sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink[/quote]prp 19 leru ga and trs kalutundhi antava... sCo_hmmthink
man for the society Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628419#msg1628419 date=1294875992]PRP + 19 TRS+ 11MIM + sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink[/quote]trs congress ki support iwwadu, trs want elections. PRP iddamanukunnasre kontha mandhi prp mlas jump chesaru jagan side ki. there is no chance for congress @3$% @3$% @3$%
siddha Posted January 12, 2011 Report Posted January 12, 2011 sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink
Deletedid1 Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=KINGMAKERS link=topic=142875.msg1628424#msg1628424 date=1294876075]prp ki 19 ekkada nunchi vachayi baa @3$% @3$% @3$%[/quote]vallaki 19 vachayi gaaa sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink
kingmakers Posted January 12, 2011 Author Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628434#msg1628434 date=1294876208]vallaki 19 vachayi gaaa sCo_hmmthink sCo_hmmthink sCo_hmmthink[/quote]18 ee kada
Deletedid1 Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=KINGMAKERS link=topic=142875.msg1628440#msg1628440 date=1294876256]18 ee kada[/quote]oh ok............ @3$% @3$%
Deletedid1 Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=lavanam link=topic=142875.msg1628428#msg1628428 date=1294876127]trs congress ki support iwwadu, trs want elections. PRP iddamanukunnasre kontha mandhi prp mlas jump chesaru jagan side ki. there is no chance for congress @3$% @3$% @3$%[/quote]inko 1000cr KCR ki iste suffort isatru @3$% @3$%
gladiator Posted January 12, 2011 Report Posted January 12, 2011 ippudu tdp aviswasa teermanam pettistey govt assaamey... ^^" ^^" ^^"
man for the society Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628447#msg1628447 date=1294876314]inko 1000cr KCR ki iste suffort isatru @3$% @3$%[/quote]already jagan ichesadu kcr ki ani talk sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il sSa_j@il
Deletedid1 Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=gladiator link=topic=142875.msg1628452#msg1628452 date=1294876343]ippudu tdp aviswasa teermanam pettistey govt assaamey... ^^" ^^" ^^"[/quote]kaani pettadu baaa
rajesh550 Posted January 12, 2011 Report Posted January 12, 2011 [quote author=BENZBABU link=topic=142875.msg1628447#msg1628447 date=1294876314]inko 1000cr KCR ki iste suffort isatru @3$% @3$%[/quote] @gr33d @gr33d
Recommended Posts