Jump to content

**** HIGH COMMAND $UCKS ******


Recommended Posts

Posted

కడప మాజీ ఎంపీ వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీలో నిర్వహించిన ‘జలదీక్ష’పై కాంగ్రెస్‌ అధిష్టానవర్గం సిరీయస్‌గా తీసుకుంటోంది. జగన్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలుగా ముద్రపడిన వారిని కట్టడి చేసేందుకు అధిష్టానవర్గం ‘యాక్షన్‌ ప్లాన్‌’ రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. అధిష్టానవర్గం ‘యాక్షన్‌ప్లాన్‌’ను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి బాధ్యత అప్పగించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌తో పాటు ప్రభుత్వ చీప్‌ విఫ్‌ భట్టివిక్రమార్క పలు దఫాలుగా చర్చించారు.

జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యదీక్షకు, ఢిల్లీలో నిర్వహించిన జలదీక్షకు హాజరైన ఎమ్మెల్యేలపై ఒకే మారు వేటు వేస్తే ప్రభుత్వ మనుగడ కష్టంగా భావించిన ముఖ్యమంత్రి మొదటి దశలో పరకాల ఎమ్మెల్యే కొండ సురేఖపై, టీడీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పార్టీ వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కొండా సురేఖ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ చీప్‌విఫ్‌ మల్లు భట్టివిక్రమార్క గురువారం శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

దీనితో పాటు కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీడీ పీ ఏడాది క్రితమే స్పీకర్‌గా కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి గెలిచిన కొన్ని నెలలకే చంద్రబాబుతో విభేదించి, వై.ఎస్‌ రాజశేఖరరెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తు వచ్చారు. ప్రస్తుతం ఆయన జగన్‌ వర్గంలో కొనసాగుతున్నారు. అయితే అప్పటి నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం జగన్‌ వర్గాన్ని కట్టడిచేసే పక్రియలో ఈనెల 24లోగా కొండా సురేఖ, నల్లపురెడి్డ్డిపై డిప్యూటీ స్వీకర్‌ వేటు వేసే అవకాశం ఉందని తెలిసింది

Posted

[b]Sonia rocks... She is doing her best...  If she appointed Jagan as CM... Than she is great aa... whole andhra Congress people praised her like a Goddess when YSR is CM... Just in 1 year she became villian only one reason she didnt appointed Jagan as CM... [/b]

×
×
  • Create New...