Jump to content

Gattu Shankar........YOU rock............

Recommended Posts

Posted

కడుపున పుట్టిన బిడ్డపై ఉండే ప్రేమ... తల్లిప్రేమ
బిడ్డలపై బాధ్యతగా ఉండే ప్రేమ... తండ్రి ప్రేమ
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లపై ఉండే ప్రేమ... సహోదర ప్రేమ
స్నేహితులపై ఉండే ప్రేమ... సమవయసు ప్రేమ.
ఏ బంధమూ లేకుండా, సేవచేసే ప్రేమ... పిచ్చిప్రేమ.
మతిస్థిమితం లేనివారిపై ఇలాంటి పిచ్చిప్రేమను చూపుతున్న ‘అమ్మానాన్న’ ఆత్మీయానుబంధాలే...ఈవారం మన రిలేషన్‌షిప్స్.
- రామ్, ఎడిటర్, ఫ్యామిలీ
[img]http://www.sakshi.com/newsimages/contentimages/18012011/07nlcbureau1117-1-11-27906.jpg[/img]

ఆర్థికంగా బలం పుంజుకున్నాక సేవ మొదలుపెడదాం అనుకుంటారు కొద్దిమంది. సేవ అంటూ మొదలుపెడితే శక్తి ఆ దేవుడే ఇస్తాడు అనుకుంటారు కొద్దిమంది. ఈ రెండో కోవకు చెందిన వారు శంకర్, ఆయన భార్య పరమేశ్వరి. మనసులో సంకల్పం ఉండాలేగాని సమాజానికి మేలు చేసే ఏ చిన్న పనైనా ఈ క్షణమే మొదలుపెట్టవచ్చు అంటారు శంకర్. మతిస్థిమితం కోల్పోయి ఎక్కడెక్కడో తిరుగుతున్న వారికి ‘అమ్మానాన్న’ ఆశ్రమం పేరుతో ఈ దంపతులు నీడను కల్పించారు. వీరి ఆశ్రమం హైదరాబాద్ - విజయవాడ రహదారిలోని చౌటుప్పల్ ప్రాంతంలో ఉంది. ఆశ్రమంలోకి అడుగుపెడితే చుట్టూ పాతిక, ముప్పై మంది మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు కనిపిస్తారు. వారి పనులు వారు చేసుకోలేక, ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉన్నవారిని కంటికి రెప్పలా చూస్తూ వారి మధ్యనే కనిపిస్తారు శంకర్ దంపతులు. అంతేకాదు వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్ది వారి వారి కుటుంబాలకు దగ్గర చేస్తున్నారు.

అన్న వేసిన మార్గం 
నల్లగొండ జిల్లా సంస్థాన్‌నారాయణపురానికి చెందిన శంకర్... కుటుంబం గడవడానికి చిన్నాచితకా పనులు చేసేవాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఇరవై ఏళ్ల క్రితం ముంబై వెళ్లిపోయాడు. నాలుగేళ్ల క్రితం స్వస్థలానికి తిరిగి వచ్చి చౌటుప్పల్‌లో ఓ చిరు వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఓ రోజు సొంతపని మీద పక్క ఊరు లక్కారం వెళ్లాడు. ఆ రోజు చెత్తకుప్పల్లో ఒంటిపై సరిగా బట్టలు లేకుండా, మురికిపట్టిన ఓ ముసలవ్వ కనిపించింది. ఆహారం కోసం పందుల్ని తరుముతున్న అవ్వ... ఆ అవ్వను ఉరిమురిమి చూస్తున్న పందులు. అయినా వాటిని లెక్కచేయక చెత్తకుప్పలోని వ్యర్థపదార్థాలను ఆబగా తినేసింది ఆ అవ్వ. తన కళ్లముందు చోటు చేసుకున్న ఈ సంఘటన శంకర్‌ను ఇరవై ఏళ్లు వెనక్కి నడిపించింది.

మానసిక స్థితి బాగా లేక చెత్తకుప్పల పాలై ప్రాణాలొదిలిన తన అన్న ఎల్లయ్య గుర్తుకువచ్చాడు. ‘‘మాది ఉమ్మడి కుటుంబం. మా పెదనాన్న, వారి కుటుంబం అందరం కలిసే ఉండేవాళ్లం. మా అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి శానా ఇష్టం. ఏమైందో తెలియదు. మా అన్న పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాడు. ఒకరోజు ఇల్లొదిలి వెళ్లిపోయాడు. అన్న ఆచూకీ కోసం ఎక్కడెక్కడో తిరిగాం. అయినా లాభం లేకపోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు హైదరాబాద్ ఉస్మానియా ప్రాంతంలో చెత్తకుప్పల్లో చనిపోయి కనిపించాడు.

ఆరోజు ఇంట్లో వాళ్లు ఎంత తల్లడిల్లారో... ’’ అంటూ ఆనాటి విషాదాన్ని తల్చుకొని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు శంకర్. ‘‘నా అన్నలాగ మరొకరు ప్రాణాలొదల కూడదని ఆనాడే అనుకున్నాను. అందుకు ఈ అవ్వే నాలో ఓ సంకల్పానికి ప్రాణం పోసింది. దీనికి నా భార్య చేదోడుగా నిలిచింది. కిందటేడాది ఇద్దరం కలిసి ‘అమ్మానాన్న’ అనాథ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాం’’ అని వివరించాడు శంకర్.
[img width=150 height=179]http://www.sakshi.com/newsimages/contentimages/18012011/1-117-1-11-3378.jpg[/img]

Posted

[quote author=The QUEEN link=topic=144591.msg1655322#msg1655322 date=1295310676]
this news from which paper?
[/quote]

sakshi...........

Posted

*=: *=:

[quote author=I hate caste...... link=topic=144591.msg1655315#msg1655315 date=1295310554]

[quote author=I hate caste...... link=topic=144591.msg1655331#msg1655331 date=1295310815]
sakshi...........
[/quote] thankyou editor,family vunte adiga. new paper emo doubt  sHa_high5ing

Posted

[img]http://epaper.sakshi.com/epaperimages/1812011/1812011-sh-hyd-21/D25741220.JPG[/img]

Posted

*=: *=: *=: shankar  you rock

Is there any way to contact Mr.Shankar, to extend help to his great deed.

please PM

Posted

[quote author=andari bandhuvu link=topic=144591.msg1656418#msg1656418 date=1295324991]
*=: *=: *=: shankar  you rock

Is there any way to contact Mr.Shankar, to extend help to his great deed.

please PM
[/quote]

naku idea ledhu bhayya..........if possible sakshi info desk call cheye thet will let u know

×
×
  • Create New...