Jump to content

Homage paid to Sr. Ntr in Chennai.....


Recommended Posts

Posted

చెన్నై, న్యూస్‌లైన్: ఎన్.టి. రామారావు వర్ధంతిని పురస్కరించుకొని దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం మంగళవారం చెన్నైలో ఘనంగా నివాళులర్పించింది. సీనియర్ జర్నలిస్టు వినాయకరావు ఎన్‌టీఆర్‌పై రాసిన యుగానికొక్కడు పుస్తకాన్ని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే.రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించగా, తొలి ప్రతిని యువచిత్ర బ్యానర్ అధినేత, నిర్మాత కాట్రగడ్డ మురారి అందుకున్నారు. సీఎంకే రెడ్డి మాట్లాడుతూ ఎన్‌టీఆర్ యుగానికి ఒక్కరు కాదని, అన్ని యుగాలకు ఆయన ఒక్కరేనని అన్నారు.

పుస్తకం తయారీకి ఆర్థిక సహాయాన్ని అందజేసిన పశ్చిమ గోదావరి జిల్లా జగన్ యువసేన నాయకుడు వెంకటరమణ బాబు మాట్లాడుతూ ఎన్.టీ.రామారావులాంటి నటుడు పుట్టబోడని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, సాహితీ విమర్శకులు వీఏకే.రంగారావు, నగర ప్రముఖులు ఆదిశేషయ్య, గుర్రం చంద్రశేఖర్ పాల్గొన్నారు.
[img]http://www.sakshi.com/newsimages/contentimages/19012011/18CNI4519-1-11-1431.jpg[/img]

×
×
  • Create New...