Jump to content

Chavu lonu vedani bandam........


Recommended Posts

Posted

బాదేపల్లి, న్యూస్‌లైన్: జీవిత చరమాంకంలో ఉన్న భార్యాభర్త లు ఒకరికోసం ఒకరు అన్నట్లుగా జీవించి.. ఒకేరోజు మృతిచెందిన సంఘటన బంధుమిత్రుల ను కలిచివేసింది. స్థానికుల కథనం మేరకు వివరాలు.. జడ్చర్లకు చెందిన సమ్మద్‌లడ్డా (56)చిన్న కాంట్రాక్టు పనులను నిర్వహిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం సాయంత్రం ఆ యన భార్య ఫాతిమా(48) అస్వస్థతకు గురికావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా అక్కడి వైద్యులు సూచించారు.

తన కారులో డ్రైవింగ్ చేసుకుం టూ భార్యను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జడ్చర్ల ఎల్‌ఐసీ కార్యాలయం సమీపంలో సమ్మద్ గుండెపోటుకు గురయ్యాడు. దాంతో అతడు కారును రోడ్డు వారగా నిలిపి, డ్రైవింగ్ సీటులోనే ముందుకు వాలిపోయాడు. దాన్ని గమనించిన స్థానికులు సమ్మద్‌ను బాదేపల్లి ఆస్పత్రికి తీసుకురాగా, అప్పటికే మృ తిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఇదే సమయంలో అస్వస్థతకు గురైన ఫాతిమాను కూడా సమీప బంధువులు హుటాహుటిన మహబూబ్‌నగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆ మె మృతిచెందింది. అందరితో కలిసిమెలిసి ఉండే సమ్మద్ దం పతుల మృతిపై బంధుమిత్రులు, కాలనీ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు

Posted

RIP , hearing this 2nd time, Devineni Ramana,Praneeta kuda apudu ilane jarigindi  $s@d

Posted

May their souls rest in peace....

Kalisi brathikaaru...kalisi vellaru...... andariki raadu ee adrustam.....

×
×
  • Create New...