Jump to content

HAppy Birthday KrishnamRaju


Recommended Posts

Posted

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్టైల్‌ను సృష్టించుకుని, ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి జీవం పోసిన మంచి నటుడు రెబెల్‌స్టార్‌ కృష్ణంరాజు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

రౌద్రరసాన్ని పోషించడంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.. రెబల్ స్టార్ కృష్ణంరాజు. 1940వ సంవత్సరం జనవరి 20వ తేదీన జన్మించిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పల పాటి వెంకట కృష్ణంరాజు. 1966లో విడుదలైన చిలక గోరింక చిత్రంతో తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కృష్ణంరాజు దాదాపు 183 పైగా సినిమాలలో నటించారు.

కృష్ణంరాజు నటించిన ప్రతీ సినిమా ప్రేక్షకుడికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. కృష్ణంరాజు నటించిన చిత్రాలలో కటకటాల రుద్రయ్య, పల్నాటి పౌరుషం, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, అంతిమ తీర్పులాంటి ఆణిముత్యాలు ఎన్నో ఎన్నెన్నో.. భక్త కన్నప్ప చిత్రంలో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకులను అబ్బుర పరిచింది.

నిజంగా ఆ శివుని మహాభక్తుడి పాత్రలో కృష్ణంరాజు జీవించారు. నాటి చిలక గోరింక నుండి నేటి బిల్లా వరకు ఆయన నటుడిగా ప్రేక్షకులను అలరించారు. ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో 1991వ సంవత్సరంలో క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు.

లోక్‌ సభ సభ్యునిగా, ఎన్డీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.

[color="#FF00FF"][b]HAppy Birthday KrishnamRaju[/b][/color]
[b][url=http://"http://www.tv5news.in/movie_news/article-id-949-name-rebel-star-krishnam-raju-celebrates-his-birthday-today.htm"]Video[/url][/b]

×
×
  • Create New...