kantamneni Posted January 24, 2011 Report Posted January 24, 2011 [b][url=http://"http://www.tv5news.in/international_news/article-id-266-name-earth-to-get-a-second-sun-as-early-this-year.htm"][img]http://www.tv5news.in/international_news/photos/266/2%20suns.JPG[/img]More Details N Video[/url][/b]త్వరలోనే రాత్రిపూట కూడా భానుడి ప్రకాశాన్ని మనం చూడబోతున్నాం! భూమికి దాదాపు 640 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓరియన్ నక్షత్ర మండలంలో సూపర్‌నోవా దశకు చేరిన బీటిల్‌గూస్ ఈ ఏడాదిలోనే అంతరిక్షంలో విస్ఫోటనం చెందుతుందని, కొన్ని వారాలపాటు దేదీప్యమానంగా వెలిగి ఆ తర్వాత అంతర్ధానమవుతుందని ఖగోళ శాస్తవ్రేత్తలు వెల్లడించారు. రాత్రి వెలుగు జిలుగులను విరజిమ్మడంతోపాటు పగటిపూట రెండో సూర్యుడిగానూ బీటిల్‌గూస్ కనువిందు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే భూమి చరిత్రలోనే అరుదైన ఈ ఘటన కచ్చితంగా ఎప్పుడు జరుగుతుందన్న విషయంపై మాత్రం వారు ఓ అంచనాకు రాలేక పోతున్నారు. మాయన్ క్యాలెండర్, డూమ్స్‌డే సిద్ధాంతం ప్రకారం..2012లో యుగాంతం వస్తోందని, ఈ సూపర్‌నోవాతోనే ప్రళయం సంభవిస్తోందని ఇప్పటికే ఇంటర్‌నెట్‌లో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే భూమికి ఎంతో దూరంలో జరిగే ఈ పేలుడువల్ల ఎలాంటి ముప్పు ఉండబోదని నిపుణులు స్పష్టం చేశారు.
Recommended Posts