kantamneni Posted January 25, 2011 Report Posted January 25, 2011 [img]http://www.tv5news.in/national_news/photos/775/Aarushi-Talwar2.jpg[/img]టీనేజ్ గాళ్ ఆరుషి హత్యకేసు మరోమారు వార్తల్లోకెక్కింది. మృతురాలి తండ్రి రాజేశ్ తల్వార్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆకస్మిక దాడికి దిగాడు. తీవ్రగాయాలైన తల్వార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫజియాబాద్ సీబీఐ కోర్టు ఆవరణలో ఈ ఘటన జరిగింది. ఆరుషి హత్యలో ఆమె తండ్రి పాత్ర వుందన్న అనుమానాలు మొదట్నించీ వుంది. సీబీఐ కూడా ఈ కోణంపైనే ఎక్కువగా దృష్టి పెట్టి.. రెండున్నరేళ్ల పాటు విచారణ సాగించారు. కానీ.. సత్యశోధన పరీక్షల్లోనూ, ఫోరెన్సిక్ నివేదికల్లోనూ రాజేశ్‌తల్వార్ నేరాన్ని రుజువుచేసే ఆధారాలేమీ లభించకపోవడంతో.. సిబీఐ వెనకడుగు వేసింది. ఈ క్రమంలో.. ఆరుషి తండ్రిపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. పోలీసులు విచారిస్తున్నారు.Video[url=http://www.tv5news.in/national_news/article-id-775-name-aarushis-father-attacked-outside-ghaziabad-court.htm]http://www.tv5news.in/national_news/article-id-775-name-aarushis-father-attacked-outside-ghaziabad-court.htm[/url]
NaughtyBoy Posted January 25, 2011 Report Posted January 25, 2011 ido pedda mystery case,,,,,,,,,,,,, !q# !q#
Recommended Posts