Jump to content

Obama-interacts-with-indian-students


Recommended Posts

Posted

విద్య, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన వంటి రంగాల్లో దేశం పట్టుకోల్పోతోందని అమెరికా అధ్యక్షుడు ఒబామా అంగీకరించారు. ఈ రంగాల్లో పెట్టుబడులు భారత్, చైనా వంటి దేశాలకు తరలివెళుతుంటే అమెరికా వెనుకబడిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత - చైనా దేశాలు విద్య, ఉపాధి, సాంకేతిక రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు.

ఈ దేశాలతో పోటీపడటంలో అమెరికా ఎంతో వెనకపడిందని ఒబామా అమెరికా ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆధునిక ప్రపంచంతో పోటీపడటంలో భారతీయ యువత ఎంతో చొరవ చూపిస్తోందని ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. గత నవంబర్‌ పర్యటనలో అమెరికా... భారత్‌తో ప్రతిష్ఠాత్మకమైన కొన్ని ఒప్పందాలను చేసుకుందని, వీటి వల్ల రెండు లక్షల అమెరికన్‌ పౌరులకు ఉపాధి లభించే అవకాశం ఉన్నదన్నారు.

చైనా - భారత్‌తో పాటూ ఆసియా దేశాల సంబంధాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తున్న రష్యాతోనూ ధృడమైన సంబంధాలను ఏర్పరుచుకుంటామన్నారు. ఉగ్రవాదాన్ని తొక్కిపట్టడంతో పాటూ ..విద్య, వ్యాపారానికి పెద్దపీట వేస్తున్నామన్నారు.

ప్రముఖంగా నైపుణ్యత, కొత్త ఆలోచనలు, విద్య, నిర్మాణాత్మకమైన వ్యూహాలు, వనరులు, సంస్కరణలు తదితరాలపై సర్కారు బ్లూ ప్రింట్‌ను విడుదల చేసింది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మాథ్స్‌ కోర్సుల కోసం లక్ష మంది ఉపాధ్యాయులను ఈ దశాబ్దంలోగా నియమిస్తామని చెప్పారు.
More NEws N Video
[url=http://www.tv5news.in/international_news/article-id-271-name-obama-interacts-with-indian-students.htm]http://www.tv5news.in/international_news/article-id-271-name-obama-interacts-with-indian-students.htm[/url]

×
×
  • Create New...