kantamneni Posted January 27, 2011 Report Posted January 27, 2011 పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతోన్న విశాఖ అందాలను వీక్షించడానికి ఓ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది. గతంలో ఆగిపోయిన హిల్‌టాప్ ప్రాజెక్ట్ ఫైల్‌పై దృష్టిపెట్టారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తే అందాల నగరాన్ని కొండలపై నుంచి హిల్‌టాప్ ప్రయాణం ద్వారా వీక్షించవచ్చు. అందాల విశాఖ నగరాన్ని కొండలపై నుంచి వీక్షించడానికి ఆరేళ్ల క్రితం హిల్‌టాప్ రోడ్డు ప్రతిపాదనకు శ్రీకారం చుట్టారు అధికారులు. అప్పట్లో నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకోవడంతో పదకొండు మంది మృతి చెందారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడింది. అయితే అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న జెఎస్వీ ప్రసాద్ ప్రస్తుతం దేవాదాయ కమిషనర్ హోదాలో ప్రాజెక్ట్ ఫైల్‌ను కదిలించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ శ్యామలరావు దృష్టికి తీసుకొచ్చారు. హిల్‌టాప్ నిర్మాణంతో పాటు కొండపై సదుపాయాలకు సంబంధించి ఓ కన్సల్టెన్సీని కూడా ఆహ్వానించారు. హనుమంత వాకనుంచి సింహాచలం కొండపై వరకు పన్నెండు కిలోమీటర్ల హిల్‌టాప్‌ని డబుల్ రోడ్డుగా నిర్మించాలని నిర్ణయించారు. రోడ్డు పొడవునా ఫుట్‌పాత్‌లు, వ్యూ పాయింట్‌లు ఏర్పాటు చేసి మద్యమద్యలో అందమైన పార్కులు నిర్మించాలని భావిస్తున్నారు. సింహలేశుని చరిత్రను వివరించే శిలాపలకాలతో పాటు స్వామి విగ్రహాలను, ముఖ ద్వారాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. పూర్తిగా దేవాదాయ నిధులతో ఉడా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌కు జీవీఎమ్‌సీ తన వంతు సాయం అందిస్తోంది. హిల్‌టాప్ నుంచి అందమైన నగరాన్ని వీక్షించడానికి నగర వాసులతో పాటు... పర్యాటకులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.More News N Video[url=http://tv5news.in/state_news/article-id-6895-name-visakha--dream-project-to-fulfill-soon.htm]http://tv5news.in/state_news/article-id-6895-name-visakha--dream-project-to-fulfill-soon.htm[/url]
Recommended Posts