kantamneni Posted January 27, 2011 Report Posted January 27, 2011 * నల్లధన ఖాతాల నిగ్గు తేల్చాలని ఆదేశం * ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన న్యాయస్థానం * నల్లధన మూలాలను కనుగొనాలని ఆదేశం కేంద్ర ప్రభుత్వానికి దేశ సర్వోన్నత న్యాయ స్థానం మరోసారి చివాట్లు పెట్టింది. దేశ సంపదను అక్రమ మార్గాల్లో స్విస్ బ్యాంకుల్లో దాచిన వారి పేర్లను బయటపెట్టడంలో కేంద్రానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటని సుప్రీం కోర్టు నిలదీసింది. కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. నల్లదన ఖాతాలపై దాఖలైన కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నల్లధన ఖాతాల వెనుక ఉన్నగుట్టును చేధించాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడినట్లయ్యింది.More Details[url=http://tv5news.in/national_news/article-id-786-name-sc-issues-notice-to-govt-over-black-money-issue.htm]http://tv5news.in/national_news/article-id-786-name-sc-issues-notice-to-govt-over-black-money-issue.htm[/url]
Recommended Posts