Jump to content

Recommended Posts

Posted

అమెరికా కాలిఫోర్నియాలోని ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయాన్ని అర్ధంతరంగా మూసివేయడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీసా మోసాలకు పాల్పడిందనే ఆరోపణలపై వర్సిటీని అధికారులు మూసివేయించిన సంగతి తెలిసిందే. ఇక్కడ చదువుతున్న వందలాది విద్యార్థులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు తమ 'స్టూడెంట్‌ వీసా'లను కోల్పోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై ఇమిగ్రేషన్‌, కస్టమ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) అధికారులు తమ దర్యాప్తులో భాగంగా పలువురు విద్యార్థుల్ని ప్రశ్నిస్తుండటంతో వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. విచారణ ఎదుర్కొంటున్న విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కొంతమంది విద్యార్థులను వెనక్కి పంపించే ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు తెలిసింది. జనవరిలో ప్రవేశాలు పొందాలనుకున్న పలువురు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది.

ట్రైవ్యాలీ వర్సిటీ పలువురు విదేశీ విద్యార్థుల్ని అక్రమంగా వివిధ కోర్సుల్లో చేర్చుకుందని ఐసీఈ అధికారులు తమ విచారణలో గుర్తించారు. పలువురు విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో రెసిడెన్షియల్‌, ఆన్‌లైన్‌ కోర్సులను చదువుతున్నారు. వీరంతా కాలిఫోర్నియాలో ఉంటున్నట్లు రికార్డుల్లో చూపించినా, వాస్తవానికి అమెరికాలోని వేర్వేరు నగరాల్లో నివసిస్తూ అక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు అధికారులు కాలిఫోర్నియా న్యాయస్థానానికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీసా మోసాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పీజే క్రౌలే స్పందిస్తూ.. 'వీసాలను జారీ చేసిన తమ శాఖ సహకారంతో మోసాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు' అని విలేకరులకు తెలిపారు. 9/11 సంఘటన తర్వాత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామనీ, విద్యార్థి వీసాలపై వచ్చే వారు కళాశాలలకు మాత్రమే వెళ్లాలని పేర్కొన్నారు.

[color=red]విశ్వవిద్యాలయం మూసివేత సంఘటనపై నివేదిక ఇవ్వాలంటూ భారత్‌ తన దౌత్య వర్గాల్ని కోరింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ఎం కృష్ణ తెలిపారు. భారత విద్యార్థుల సంక్షేమాన్ని దౌత్య కార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. బాధిత విద్యార్థులు ఇప్పటి వరకూ భారత కాన్సులేట్‌ను సంప్రదించలేరని తెలిపారు.[/color]

Posted

mana govt. paina nammakam pettukuni edo chestaru anukunte inka anthe sangathulu, Oz lo manolla paina racist attacks jarugutuntene em peekalekapoyaaru inka US paina naa  @3$% @3$%  los@r los@r

Posted

[quote author=NaughtyBoy link=topic=148510.msg1719724#msg1719724 date=1296201745]
mana govt. paina nammakam pettukuni edo chestaru anukunte inka anthe sangathulu, Oz lo manolla paina racist attacks jarugutuntene em peekalekapoyaaru inka US paina naa  @3$% @3$%  los@r los@r
[/quote]

mama dhairyam cheppu mama....edo oka hope ivvu anthe kani, comedy la anipistunda.......looser endi baa.... };_ };_

×
×
  • Create New...