kingmakers Posted January 29, 2011 Report Posted January 29, 2011 [center][img]http://suryaa.com/main/gallery/2011/Jan/30/Jagan-mud.jpg[/img][size=18pt][color=red]కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్ రోజురోజుకీ సమస్యల ఊబిలోకి కూరుకుపోతున్నారా? తాజా పరిణామాలను చూస్తే అవుననే చెప్పాల్సి వస్తున్నది. పరిటాల రవి హత్య కేసు జగన్ మెడకు ఉచ్చులా చుట్టుకుంటున్నది. దరిమిలా ఆయన ఈ ఊబిలో పీకల్లోతు కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలు పెను మలుపులు తిరుగుతూ... అవి జగన్‌ని చుట్టుముడుతున్నాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జగన్ ప్రమేయం ఉన్న కేసు లన్నింటినీ తిరగతోడే భారీ వ్యూహానికి రూపకల్పన జరుగుతోంది. పరిటాల రవి హత్యకేసును మళ్లీ తెరపైకి తెచ్చి విచారణకై సీబీఐకి అప్పగించడానికి రంగం సిద్ధమవుతున్నది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తనకున్న విస్తృతాధి కారాలతో చొరవ తీసుకోబోతున్నారు. పరిటాల హత్య కేసును మళ్లీ సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరనున్నారు. మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కూడా ఆ మేరకు సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా సీబీఐ పునర్విచారణకు డిమాండ్ చే యనుంది. దానికంటే ముందు పరిటాల సతీమణి, ఎమ్మెల్యే సునీత దీనిపై సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తన భర్త హత్య కేసులో జగన్ పాత్ర ఉన్నప్పటికీ, వైఎస్ ప్రభుత్వం నాడు వాస్తవాలను సమాధి చేసినందున, తిరిగి కేసును విచారించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.పరిటాల రవి హత్య కేసులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తం ఉందని నాడు టీడీపీ ఆరోపించింది. పరిటాల హత్య వ్యవహారాన్ని రాష్టప్రతి వరకూ తీసుకువెళ్లి జాతీయ స్థాయిలో ఆందోళన చేసింది. దానితో వైఎస్ రాజశేఖరరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించారు. అయితే, అందులో వైఎస్ జగన్ పాత్ర లేదని తేల్చడంతో సీబీఐను వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న విమర్శలు సామాన్య ప్రజానీకం నుంచి వినిపించాయి. ప్రధాన అనుమానితుడయిన మంగలి కృష్ణ ను విడిచిపెట్టారన్న ఆరోపణలు వినిపించాయి.అయితే, వైఎస్ మృతి చెంది, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్‌ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ దృశ్యం మారిపోయింది. జగన్‌ను కట్టడి చేసేందుకు తన ముందున్న అన్ని మార్గాలనూ అన్వేషిస్తోన్న కాంగ్రెస్ సర్కారు అందులో భాగంగా, పరిటాల రవి హత్య కేసును తిరగతోడాలని భావిస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మంత్రివర్గ సహచరుల ఒత్తిడి తీవ్రమవుతోంది. ప్రధానంగా డీఎల్ రవీంద్రారెడ్డి, శంకర్రావు వంటి మంత్రులయితే మళ్లీ సీబీఐతో పరిటాల కేసును విచారణ జరిపించాలని పట్టుపడుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో డిమాండ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. సీబీఐ విచారణను కోరతానని డీఎల్ బాహాటంగానే వ్యాఖ్యానించడం గమనార్హం.మరో వైపు.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా జగన్‌ను ఉచ్చులో బిగించేందుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నారు. తన ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న జగన్‌ను రాజకీయంగా అణచివేసేందుకు అనువైన సమయం ఇదేనని యోచిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న ఒత్తిళ్ల మేరకు సీబీఐకు తిరిగి కేసు అప్పచెప్పాలని కిరణ్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రులు బాహాటంగా డిమాండ్ చేసే వరకూ వేచి ఉండటం వల్ల చెడు సంకేతాలు వెళతాయని భావిస్తున్న సీఎం, ఆ మేరకు పరిటాల రవి హత్య కేసును తిరిగి విచారించాలని కేంద్ర హోంమంత్రి చిదంబరానికి ఒకటి, రెండు రోజుల్లో లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు.సీబీఐ ఒకసారి మూసేసిన కేసును మళ్లీ పునర్విచారించేందుకు అవకాశాలున్నాయని సీఎంకు న్యాయనిపుణులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో బెస్ట్బేకరీ కేసును ఇదేమాదిరిగా విచారించిన సీబీఐ ఆ కేసును మూసేసింది. మళ్లీ ఒక వ్యక్తి అదే అంశంపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు పునర్విచారణకు ఆదేశించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే.. పరిటాల కేసు విషయంలో గతంలో స్వయంగా ప్రభుత్వమే విచారణను కోరినందున, ఈ కేసులో అంతదూరం వరకూ వెళ్లనవసరంలేదన్నారు. ఆ కేసుపై అనుమానాలు తొలగకపోవడం, సీబీఐపైనే అప నమ్మకం కలిగేలా డాక్యుమెంట్లు బయటపడినందు వల్ల మళ్లీ విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరవచ్చని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదిలాఉండగా.. జగన్‌కు ప్రధాన అనుచరుడిగా పేరున్న మంగలి కృష్ణపై గతంలో సీబీఐ చేసిన విచారణ సక్రమంగా లేదని, ఆయనను వైఎస్ ప్రభుత్వ ఆదేశాలతో వదిలేశారన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి వస్తున్నందున, వాటిని కూడా నిగ్గు తేల్చాలని కిరణ్ సర్కారు భావిస్తోంది. అంటే మంగలి కృష్ణ భుజంపై తుపాకి పెట్టి జగన్‌ను లక్ష్యంగా చేసుకోవాలని సర్కారు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ పౌరుడయిన మంగలి కృష్ణకు గన్‌మెన్ సౌకర్యం నుంచి ఇతర అన్ని అంశాల్లోనూ వైఎస్ ప్రభుత్వం చూపిన సానుకూల వైఖరి విమర్శలకు గురవుతోంది. పరిటాల హత్య కేసులో మంగలి కృష్ణను ప్రధాన పాత్రధారిగా చూపించడంతో పాటు, అసలు సూత్రధారి జగనేనన్న విషయాన్ని బయట ప్రపంచానికి చాటేందుకు కిరణ్ సర్కారు సీబీఐను మరోసారి తెరపైకి తీసుకురానుంది.పునర్విచారణ కోరతాంపరిటాల హత్యకేసు పునర్విచారణకు అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జగన్ విషయంలో సరైన సమాచారం ఉంది. మంత్రులందరం ఒకే విధానానికి కట్టుబడి ఉన్నాం-మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిబెదిరింపులకు బెదరనువైఎస్ కేబినెట్లో మంత్రులు కొనసాగటం వల్లే రాష్ర్టంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. వారిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని సోనియాను కోరతాను. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వాటికి నేను బెదరను-మంత్రి శంకర్రావు[/color][/size][/center]
nenuinthe Posted January 29, 2011 Report Posted January 29, 2011 [img]http://img151.imageshack.us/img151/3411/aaaahtc6.gif[/img]
NaughtyBoy Posted January 29, 2011 Report Posted January 29, 2011 asalu em chusi veediki CM post ivvaalanukunnaado,,,,,,,,,,,,, @3$% @3$%dobbina dabbutho hai ga undaka CM post ki poyi den*inchu kunnattu undi,,,,,,,,,,,,,, @3$% @3$%
Nellore Pedda reddy Posted January 29, 2011 Report Posted January 29, 2011 [quote author=SKCHINNARI link=topic=149152.msg1730197#msg1730197 date=1296342971] LoL.1q[/quote]wassup chinnu [img]http://www.amazing-animations.com/animations/babies12.gif[/img]
bing Posted January 30, 2011 Report Posted January 30, 2011 sCo_hmmthink[quote author=BEZAWADA ROWDY link=topic=149152.msg1730160#msg1730160 date=1296342280][img]http://img151.imageshack.us/img151/3411/aaaahtc6.gif[/img][/quote]
chipanjichiru Posted January 30, 2011 Report Posted January 30, 2011 Kingu };_ };_ };_ *7*^ *7*^ sSc_hiding2
Minister Posted January 30, 2011 Report Posted January 30, 2011 Fafam emi vundi rastram mottanni dochukunni tintunnaru ga .... };_ };_ };_ };_
baluabcdefgh Posted January 30, 2011 Report Posted January 30, 2011 [img]http://i325.photobucket.com/albums/k379/NFDB/Brahmanandam%20-8/th_entobemmi.gif[/img]
kingmakers Posted January 30, 2011 Author Report Posted January 30, 2011 [quote author=TollywoodEmperor link=topic=149152.msg1731041#msg1731041 date=1296352697]Kingu };_ };_ };_ *7*^ *7*^ sSc_hiding2[/quote] no comment no comment no comment
Recommended Posts