Jump to content

**** RAHUL GANDHI COMEDY *********************************


Recommended Posts

Posted

[center][size=36pt][color=red]పదేళ్లు నాకిస్తే.. మీరు గర్వపడే భవిష్యత్తునిస్తా.[/color][/size][/center]


‘నాకు పదేళ్ల సమయమివ్వండి. మీరు గర్వించేలా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతాను’ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ శనివారంనాడు యువతలో ఆశాజ్యోతిని వెలిగించారు. రాజకీయ ప్రక్రియలో ఎదురయ్యే అసలైన సవాల్‌ యువతకు అవకాశాల తలుపులు తెరవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ‘యువజన కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభించాం. ప్రజాస్వామ్య ప్రక్రియ అంటే...ఎవరినో నామినేట్‌ చేయడం కాదు. ముందుముందు చేయాల్సింది ఎంతో ఉంది. ‘చాలామంది యువకులు రాజకీయాలను గమనిస్తున్నారని నాకు తెలుసు. కానీ అవి మనకోసం కావని వారనుకొంటున్నారు. విద్యావంతులు, ప్రతిభావంతులకు నేను చెప్పేదొకటే. యువజన కాంగ్రెస్‌ వెబ్‌సైట్‌ను చూడండి. యువతతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించడంలో నాకు సహకరించండి’ అని రాహుల్‌ చెప్పారు.

ధరల్ని సంకీర్ణంతో ముడిపెట్టలేదు
మహారాష్ట్ర మూడు రోజుల సర్యటనలో చివరి రోజైన శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏకపార్టీ పాలనలో అంటే గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరల్ని అదుపులో ఉంచింది అని ఆయన అన్నట్టు వచ్చిన వార్తలపై అడిగినప్పుడు రాహుల్‌గాంధీ- సంకీర్ణ రాజకీయాలకు, పెరిగే ధరలకు ముడిపెట్టి నేనెప్పుడూ మాట్లాడలేదు’ అన్నారు.

‘ధరలు పెరగాలంటూ సంకీర్ణ రాజకీయాలు ఒత్తిడి చేస్తున్నాయని నేననుకోను. సంకీర్ణ రాజకీయాలవల్ల ఒక్కోసారి విషయాలు క్లిష్టమవుతాయి. అయితే, మన ఉద్దేశం సరైనదైనప్పుడు, మనం సరైన దిశలో ఆలోచిస్తున్నప్పుడు, దీర్ఘకాలికంగా ఉపయోగపడే మార్పును కోరుకుంటున్నప్పుడు సంకీర్ణ వ్యవస్థలో అందుకు అవకాశం ఉందని చెప్పవచ్చు. అందులో ఏ సమస్యా రాదు’ అని రాహుల్‌ వివరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెడుతుందికదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు రాహుల్‌ ‘ అది మీ ఊహ మాత్రమే. నేననుకోవడం లేదు. నా ఆలోచన, నా ప్రయత్నం రాజకీయ వ్యవస్థను మరమ్మతు చేయాలనే’ అని స్పష్టం చేశారు.

నల్లధనంపై...
Rahulఅవినీతిపై కఠినమైన, సత్వర చర్య తీసుకోవాలని రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. విదేశీ బ్యాంకుల్లో నిలవ ఉన్న భారతీయుల నల్లధనం గురించిన వివాదంపై మాట్లాడుతూ- ‘దేశం బయట ఉన్న భారతీయుల డబ్బును స్వదేశానికి తీసుకురావాలి. ‘నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయడం లేదని అనుకోవడం సరికాదు. పెరుగుతున్న సంపదలో ఎక్కువ భాగం పేదలదే. పెరుగుతున్న ఈ ధన సంపదను విద్య, ఆరోగ్యసంరక్షణ, పేదల ఇతర అవసరాలకు ఉపయో గపడేలా చూడాలి’ అన్నారు.

అవినీతిపై కఠిన చర్య
అవినీతి అంశాన్ని మనం సమష్టి బాధ్యతతో చూడాలని, దానిపై కఠిన చర్య అవసరమని ఆయన అన్నారు.
అవినీతిపరులకు ఏ ఇరవై ఏళ్లకో కాదు, ఆరు నెలలలోగా శిక్ష పడాలి’ అన్నారు. ఈ వారం ఆరంభంలో మాలెగావ్‌ అదనపు కలెక్టర్‌ యశ్వంత్‌ నోనావాలేను ఆయిల్‌ మాఫియా హత్య చేయడంపై విలేకరులు రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. చమురు కల్తీ రాకెట్‌పై 15 ఏళ్ల కిందటే అధికారిక నివేదిక అందినా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదని అడిగారు.

అదనపు కలెక్టర్‌ను హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రాహుల్‌- ‘ఆయిల్‌ మాఫియాపై కఠిన చర్య తీసుకోవడఅవినీతి ం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. అవినీతి చాలా ఆందోళనకరంగా మారిందని ఈ సంఘటన చెబుతోంది. అవినీతి లక్షణాన్ని ఇది బయటపెట్టింది. ఈ లక్షణం మరింతగా వ్యాపించ కుండా చూడాలి. మనం ఈ అవినీతి వ్యవస్థను మా ర్చాలి. ఇందుకు మనం వ్యవస్థ మూలాల్లోకి వెళ్లి, ఇలాంటి సంఘటనలకు కారణాలు తెలుసు కోవాలి. అవినీతిపై పోరాటానికి సమష్టి కృషి అవసరం. దానిపై మా పార్టీ కఠిన చర్యలు తీసుకొంది. రాజకీయ వ్యవస్థలో తలుపులు మూసుకుపో యాయి కాబట్టి, ఏదైనా మంచి చేయాలనుకునే వ్యక్తికి అవకాశం రావడం లేదు’ అని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్నారు.‘రాజకీయాలు అవినీతి మయమై పోయాయని సామాన్యుడు అనుకొంటున్నాడు. రాజకీయాలు ఏం చేయాలో అది చేయడం లేదు. ఏ పరిస్థితి మారాలంటే అసలు రాజకీయ పార్టీల నిర్మాణం ఎలా జరిగిందో అధ్యయనం చేయాలి’ అన్నారు.

పార్టీల చేతిలో బందీ ప్రజాస్వామ్య ప్రక్రియ
రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రక్రియను ఖాతరు చేయడం లేదని చెబుతూ రాహుల్‌- ‘రాజకీయ వ్యవస్ఠ ఘనీభవించి ఉంది. ఈ పరిస్థితి మారాలి. అందరికీ అవకాశాలు లభించేలా తలుపులు తెరచి రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకు రావాలని రాహుల్‌గాంధీ అన్నారు.

Posted

Adnhuke Manmohini meedha ee song mee andarki dedicated
[url=http://www.youtube.com/watch?v=Zz6nxa-6d8s#]manmohini teri ada - hum dil de chuke sanam[/url]

×
×
  • Create New...