Jump to content

Manodey mana kompa munchindu.........


Recommended Posts

Posted

[size=12pt]ఇమ్మిగ్రేషన్ అవకతవకలపై {sైవ్యాలీ వర్సిటీ ప్రకటన
తాము మోసానికి పాల్పడలేదని వెల్లడి

వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారతీయ విద్యార్థులను మోసగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాలోని ట్రైవ్యాలీ యూనివర్సిటీ (టీవీయూ) ఎట్టకేలకు మౌనం వీడింది. ఈ ఉదంతంపై విచారణ పూర్తయ్యే వరకూ వర్సిటీని ఒబామా సర్కారు మూసేయడంతో ఆర్థికంగా తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న ట్రైవ్యాలీ యాజమాన్యం ఈ వ్యవహారంపై స్పందిం చింది. వర్సిటీలో జరిగిన ఇమ్మిగ్రేషన్ మోసాల్లో తమ ప్రమే యం ఎంతమాత్రం లేదని చెప్పుకొచ్చింది. సంస్థపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, విద్యార్థులను తాము మోసగించలేదని తెలిపింది. వర్సిటీలో గతంలో పనిచేసిన భారత సంతతి సిబ్బందే ఈ మోసానికి పాల్పడ్డారని టీవీయూ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు సుసాన్ సూ ఆరోపించారు. సంస్థ పరిపాలన కార్యాలయంలో పనిచేసిన అంజిరెడ్డి అనే విద్యార్థుల సహాయకుడు, రామ్‌క్రిష్ట కర్రా అనే విద్యార్థితో కలిసి (ఇతనికి కన్సల్టెన్సీ కంపెనీ కూడా ఉంది) ఏప్రిల్‌లో విద్యార్థులను మోసగించారని ఓ వార్తాసంస్థకు పంపిన ఈ-మెయిల్‌లో వివరించారు.

విద్యార్థుల ఐ-20, సీపీటీ ఆమోదానికి బదులుగా ట్యూషన్ ఫీజును రామ్‌క్రిష్ట కర్రా తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని విద్యార్థులను కోరినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలిసి వారిద్దరినీ వర్సిటీ నుంచి తొలగించినట్లు సూసాన్ చెప్పారు. తమ వర్సిటీపై వాళ్లే అమెరికా ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. వర్సిటీని అధికారులు మూసేయడం వల్ల లాభాల్లో ఉన్న తమ సంస్థ నష్టాలబాట పట్టిందని, విద్యార్థులు, అధ్యాపకులు కూడా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా, ట్రైవ్యాలీ వంటి వర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఎలా అనుమతించారని అమెరికా ప్రభుత్వాన్ని కోరతామని విదేశాంగశాఖ మంత్రి ఎస్.ఎం. కృష్ణ ఢిల్లీలో చెప్పారు. అయితే భారత విద్యార్థుల కాళ్లకు అమెరికా అధికారులు రేడియో కాలర్లు తగిలించిన వ్యవహారాన్ని దూరదృష్టితో చూడాలని ప్రజలు, మీడియాను కోరారు. అమెరికాలో సుమారు 1.8 లక్షల మంది భారత విద్యార్థులు చదువుతున్నారని, వారిలో ప్రస్తుతం 12 నుంచి 18 మంది విద్యార్థులు మాత్రమే ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే విషయాన్ని గుర్తుచేశారు. అయినా ఈ అంశంపై ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో అత్యున్నత స్థాయిలో చర్చించామన్నారు.

అగమ్యగోచరంగా బాధిత విద్యార్థుల భవిష్యత్తు

ట్రైవ్యాలీ మోసానికి బలైన సుమారు 1,555 మంది (ఇందులో అత్యధికులు ఆంధ్రప్రదేశ్ వారే) భారత విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. ఈ ఉదంతంలో తమ తప్పు లేకున్నా అమెరికా అధికారులు వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై వారు వేసిన పిటిషన్‌ను కాలిఫోర్నియాలోని కోర్టు సెప్టెంబర్‌లోగా విచారణకు స్వీకరించే అవకాశాలు కనిపించకపోవడంతో విలువైన సమయం వృథా అవుతుందని కలవరపడుతున్నారు.
[/size]

×
×
  • Create New...