Jump to content

Lancham Lancham Lancham -2


Recommended Posts

Posted

[color=red][size=18pt]లంచావతారమెత్తిన జడ్జిలు
నిందితుడి నుంచి ముడుపులు తీసుకొని తీర్పు
కేరళలో లోకల్ చానల్ స్టింగ్ ఆపరేషన్

తిరువనంతపురం, ఫిబ్రవరి 2: నేరస్తులు, న్యాయమూర్తులు కుమ్మక్కైన ఉదంతం కేరళలో ప్రకంపనలు రేపుతోంది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు నుంచి బయటపడేందుకు స్థానిక రాజకీయ నేత.. కేరళ హైకోర్టులోని ఇద్దరు జడ్జిలకు ముడుపులు ఇవ్వడాన్ని ఓ లోకల్ చానల్ వెలుగులోకి తెచ్చింది. ఆ చానల్ జరిపిన స్టింగు ఆపరేషన్‌లో, కోలికట్‌కు చెందిన ముస్లిం లీగ్ నేత, మాజీ మంత్రి పీకే కున్హాలీ కుట్టి, జస్టిస్ నారాయణ కురప్ప సహా ఇద్దరు న్యాయమూర్తులు అడ్డంగా దొరికిపోయారు.

అయితే.. చానల్ కథనాన్ని అటు ముస్లిం లీగ్ నాయకులతో పాటు, ఇటు సదరు న్యాయమూర్తులు కూడా ఖండిస్తున్నారు. చానల్ కథనం ప్రకారం.. 1997లో కోలికట్‌లోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్‌కు వచ్చిన చిన్నారిని పీకే కున్హాలీ కుట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయగా, కేరళ హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో తీర్పు ఇచ్చిన జస్టిస్ నారాయణ్ కురప్ప, మరో న్యాయమూర్తికి లంచాలు మేపి, తీర్పును కుట్టి ప్రభావితం చేశారనేది చానల్ ప్రధాన కథనం.

[/size][/color]

×
×
  • Create New...