Jump to content

classic-movie-hum-dono-re-releasing-in-colour-format


Recommended Posts

Posted

దేవానంద్‌, సాధన, నందా నటించిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం హమ్‌దోనో ఇప్పడు కలర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇవాళ విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. ఎవర్‌గ్రీన్‌ హీరో దేవానంద్‌ క్లాసిక్స్‌లో ఒకటైన హమ్‌దోనే సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొస్తోంది.

యాబై ఏళ్ల క్రితం నాటి చిత్రమే కావచ్చు కాని ఇప్పుడు చూసినా తాజాగా వుంటుందంటున్నారు క్రిటిక్స్‌. హమ్‌దోనే చిత్ర కథ నేటికి తగ్గట్టుగా వుంటుంది. యుధ్ద నేపథ్యం కావటంతో బోర్‌ అనే ప్రశ్నే వుండదు. ఇక సంగీతం పరంగా ఎవరూ వొంకపెట్టలేరు. హీరోయిన్ల గురించయితే చెప్పనవసరంలేదు..

ఇప్పటి తరానికి కూడా స్టయిల్‌ అంటే ఏంటో నేర్పించగల సాధన... నందాల అందాల గురించి చెప్పటం కన్నా చూస్తేనే బాగుంటుంది. అన్నిటికి మించి దేవానంద్‌ను ఎవర్‌గ్రీన్‌ హీరో ఎందుకంటారో ఈ చిత్రమే సమాధానం చెబుతుంది. దేవ్‌ను చూస్తే నేటి కుర్రహీరోలు కూడా కుళ్లుకుంటారు!

More Details
[url=http://tv5news.in/movie_news/article-id-992-name-classic-movie-hum-dono-re-releasing-in-colour-format.htm]http://tv5news.in/movie_news/article-id-992-name-classic-movie-hum-dono-re-releasing-in-colour-format.htm[/url]

×
×
  • Create New...