Jump to content

Tehelka released the Blackmoney holders..........


Recommended Posts

Posted

[size=12pt]న్యూఢిల్లీ: విదేశాల్లో నల్లధనం దాచిపెట్టుకున్న భారతీయుల పేర్లు బయటకొచ్చాయి. 12 మంది భారతీయులతోపాటు, మూడు ట్రస్టుల పేర్లను తెహల్కా పత్రిక శుక్రవారం బహిర్గతం చేసింది. యూరప్‌లోని లిక్టన్‌స్టీన్ దేశంలో ఉన్న ఎల్జీటీ బ్యాంకులో వీరికి ఖాతాలున్నాయని తెలిపింది. అయితే వారి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 18 ఖాతాల యజమానుల వివరాలను.. బయటపెట్టొద్దనే షరతుపై జర్మనీ ప్రభుత్వం 2009 మార్చి 18న భారత్‌కు అందించింది. వీటిలో 16 ఖాతాదార్ల పేర్లను పత్రిక సేకరించింది. మరిన్ని వివరాల కోసం వారిలో ప్రతి ఒక్కరిని సంప్రదించింది. వివరాలు అందిస్తారని వేచిచూస్తోంది. తమకందిన పేర్లలో ఓ ప్రముఖ భారతీయ కార్పొరేట్ సంస్థ చైర్మన్ పేరు ఉందని తెహల్కా తెలిపింది. అతని నుంచి పూర్తి సమాచారం రానందువల్ల పేరు వెల్లడించడం లేదని పేర్కొంది.

తెహల్కా బయటపెట్టిన ఖాతాదార్ల పేర్లు..
1.మనోజ్ ధుపేలియా 2.రూపాల్ ధుపేలియా 3.మోహన్ ధుపేలియా 4. హష్ముఖ్ గాంధీ 5. చింతన్ గాంధీ 6. దిలీప్ మెహతా 7. అరుణ్ మెహతా 8. అరుణ్ కొచ్చర్ 9. గుణ్‌వతి మెహతా 10. రజనీకాంత్ మెహతా 11. ప్రబోధ్ మెహతా 12. అశోక్ జైపురియా 13. రాజ్ ఫౌండేషన్ 14. ఊర్వశీ ఫౌండేషన్ 15. అంబ్రునోవా ట్రస్టు. ఈ జాబితాలోని మూడు ట్రస్టులు విదేశాల్లో రిజిష్టర్ అయ్యాయని తెహల్కా తెలిపింది. ఈ ఖాతాదార్లందరిపై విచారణ దాదాపు పూర్తయ్యిందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వెల్లడించింది. జాబితాలోని ‘మెహతా సోదరు’లకు ఐపీఎల్ కొచ్చి జట్టులో 12 శాతం వాటా ఉందని తెలుస్తోంది.

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ట్రస్టులు, వ్యక్తులను త్వరలోనే పన్నుల ఎగవేత, ఆదాయ వివరాల దాచివేత నేరాల కింద ప్రాసిక్యూట్ చేయనుందని తెలిపింది. తెహల్కా ఇంకా ఏం చెప్పిందంటే.. వీరిలో కొంతమంది ఖాతాదార్లు ప్రముఖులకు బినామీలు కావచ్చు. ఒకరికి ప్రముఖ రాజకీయ నాయకుడితో సంబంధాలున్నాయని సమాచారం.
[/size]

×
×
  • Create New...