Jump to content

savitri


Recommended Posts

Posted

[img]http://ap7am.com/backimages/cinemaphotos/thumbnail/savitri-0_7296.jpg[/img]

మహానటి సావిత్రి నటన గురించి ఈవేళ ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. తన అభినయంతో నటనకు భాష్యం చెప్పిన నటీమణి ఆమె. కధానాయికగా కోట్లు సంపాదించినా, వాటన్నిటినీ పోగొట్టుకుని, చివరి దశలో దీనాతి దీనంగా జీవితాన్ని వెళ్లదీసింది సావిత్రి. అయితే, ఎంతటి దుస్థితికి దిగజారినా ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మాత్రం ఆమె కోల్పోలేదు. అందుకు ఉదాహరణగా ఓ సంఘటనను చెప్పుకోవచ్చు. అప్పటికే ఆర్టిస్టుగా ఆమె ప్రభ తగ్గిపోయింది.  జీవనం కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేయడం ప్రారంభించారామె. దాంతో కధానాయికగా ఉన్నప్పటి విలువ, మర్యాదలు ఆమెకు తగ్గిపోయాయి. సెట్లో ఆమెను పట్టించుకునేవారే కరవయ్యారు. ఓ రోజు షూటింగులో లంచ్ బ్రేక్ ఇచ్చారు. మామూలుగా పెద్ద ఆర్టిస్టులందరికీ ఇళ్ల నుంచి క్యారేజీలు వస్తాయి. అలా రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. అందరూ భోజనానికి ఉపక్రమించారు.
        అయితే, సావిత్రిని పట్టించుకున్న వాళ్లెవరూ లేరక్కడ. దాంతో ఆవిడ అలా దూరంగా వెళ్లి కూర్చుంది. అది గమనించిన గుమ్మడి గారు వెంటనే లేచి వెళ్లి, రండమ్మా, భోజనం చేద్దాం" అన్నారు. ఆమెకు అభిమానం అడ్డొచ్చింది. ఆకలేస్తున్నా కూడా "లేదండీ, నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి" అంటూ సున్నితంగా తిరస్కరించారు. గుమ్మడి గారికి విషయం అర్ధమైంది. ఆకలిగా వున్నా కూడా ఆమె వ్యక్తిత్వాన్ని చంపుకోవడం లేదనిపించింది. అందుకే, "మీరు రాకపోతే నేను కూడా చేయను" అంటూ ఆయన భీష్మించారు. దాంతో ఇక తప్పక ఆమె లేచి వచ్చారు. ఇద్దరూ కడుపునిండా భోజనం చేసారు. 'సావిత్రి ఆత్మాభిమానానికి ఇదొక ఉదాహరణ' అంటూ ఓ సందర్భంలో గుమ్మడి గారే ఈ విషయాన్ని చెప్పుకున్నారు. 

Posted

*=: *=: *=: *=: by the way mama.. nenu aazad ni gurtupattava??? @3$% @3$% @3$% @3$% sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2

Posted

[quote author=wolverine link=topic=152416.msg1784537#msg1784537 date=1297025107]
*=: *=: *=: *=: by the way mama.. nenu aazad ni gurtupattava??? @3$% @3$% @3$% @3$% sSc_hiding2 sSc_hiding2 sSc_hiding2
[/quote][img]http://www.gifsoup.com/view1/1764052/basha-o.gif[/img]nooooooooooooooooooooooooo & thankyou

Posted

love u Sav darling... love u so much  you rock you rock you rock you rock
*=: *=: *=: *=: maama

×
×
  • Create New...