I hate caste...... Posted February 9, 2011 Report Posted February 9, 2011 [size=10pt]* రిలయన్స్ + బాబు + రామోజీ = రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం* బాబుకు వేల కోట్లు - రామోజీకి రూ. 2,500 కోట్లు* రిలయన్స్‌కు రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారు* దానికి ప్రతిగా చంద్రబాబుకు వేల కోట్లు ముట్టాయి* దాన్లో కొంత వాటా రామోజీ కంపెనీల్లోకి వచ్చింది* అందుకోసమే రిలయన్స్ అన్ని డబ్బా కంపెనీల్ని పెట్టింది* వాటి ద్వారానే రూ. 2,524 కోట్లను రామోజీ గూటికి మళ్లించింది* గ్యాస్ నిక్షేపాలు కొల్లగొడుతున్నా నోరుమెదపనందుకే ఈ నజరానా* లేకుంటే నష్టాల్లో ఉన్న రామోజీ గ్రూపులో షేరుకు రూ. 5,28,630 ఎందుకు పెడతారు?* ఆధారాలతో సహా హైకోర్టుకు ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి లేఖ.. సీబీఐ విచారణకు వినతి.. సీడీ రూపంలో విలేకరులకు విడుదలఇది... యావత్తు రాష్ట్రం నివ్వెరపోయే నయావంచన. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం. వింటూనే దిగ్భ్రాంతి కలిగించే దారుణాతిదారుణం. రాష్ట్ర ప్రయోజనాల్ని అడ్డంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు తాకట్టు పెట్టేసి... నారా చంద్రబాబు-చెరుకూరి రామోజీ జంటగా చేసిన మహా దోపిడీ. ఈ దోపిడీ పర్వంలో కొంత భాగాన్ని ‘సాక్షి’ గతంలోనే ప్రచురించింది. మంగళవారంనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి చేసిన ఆరోపణలతో... ‘సాక్షి’ కథనం అక్షర సత్యమని మరోసారి స్పష్టమైంది. ఈ వివరాలతో ఇటీవలే హైకోర్టుకు సుదీర్ఘ లేఖ రాసిన గుర్నాథరెడ్డి... మంగళవారం ఆ లేఖ ప్రతులను ఆధారాలతో సహా సీడీ రూపంలో విలేకరులకు విడుదల చేశారు. హైదరాబాద్, న్యూస్‌లైన్: కృష్ణా-గోదావరి బేసిన్‌లో గ్యాస్ వెలికితీతకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు బ్లాకులు దక్కింది బాబు హయాంలోనే. ఆ వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అవకాశమున్నా సరే... రిలయన్స్‌కు సహకరించాలని ముందే నిర్ణయించుకోవటం వల్ల బాబు అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదని గుర్నాథరెడ్డి స్పష్టం చేశారు. ‘‘మన రాష్ట్రంలోని బ్లాకుల కోసం ఎక్కడో ఉన్న గుజరాత్ ప్రభుత్వం పోటీ పడింది. కానీ నాటి మన సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. ఇక్కడ జాక్ పాట్ కొట్టిన రిలయన్స్‌కు లక్షల కోట్ల రూపాయల విలువైన అత్యంత భారీ సహజవాయువు నిక్షేపాలు దక్కాయి’’ అని ఆయన తెలిపారు. ‘‘వాటి తవ్వకంలో అడ్డగోలు ఉల్లంఘనలున్నాయి. పర్యావరణం, పునరావాసం అన్నిటినీ రిలయన్స్ గాలికొదిలేసింది. దానికి సై అన్నందుకు, సమస్త ఉల్లంఘనలనూ చూసి కూడా వదిలేసినందుకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముట్టిన నజరానా వేల కోట్ల రూపాయలకు పైనే. దాన్లో రూ. 2,524 కోట్లు బాబుకు సయామీ కవలలాంటి రామోజీ గూటికి చేరింది’’ అని స్పష్టంచేశారాయన. ఈ డబ్బు రామోజీ గూటికి చేర్చటానికి బాబు తోడుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎన్ని డ్రామాలాడిందో సీడీలో వివరంగా తెలియజేశారు గుర్నాథరెడ్డి. అది చూస్తే... నిత్యం సుద్దులు చెప్పే రామోజీ ఇంతకు తెగించారా? అని ఎంతటి వారికైనా మనసు మొద్దుబారిపోవటం ఖాయం. ఆ వివరాలివిగో...ఇక్కడే పునాది...రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీది. ధీరూబాయ్ మరణానంతరం పంపకాల్లో ఇది ముఖేష్ చేతికొచ్చింది. దీన్లో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ హోల్డింగ్స్‌కు 6.6 శాతం వాటా ఉంది. ఈ వాటా విలువ దాదాపు రూ. 22 వేల కోట్లు. నిజానికిది నూరు శాతం ఆర్‌ఐఎల్‌కు అనుబంధ కంపెనీయే. అంటే దీన్లో వాటా రిలయన్స్ వాటాదారులదే. కానీ ఏం జరిగిందో తెలుసా?* రిలయన్స్ పెట్రోలియం ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌కు రిలయన్స్‌లో ఉన్న వాటా మొత్తాన్ని దీనికి బదలాయించారు. జేఎం ఫైనాన్షియల్ అధినేత నిమేష్ కంపానీ, విష్ణుభాయ్ హరిభక్తి దీనికి ట్రస్టీలు.* షినానో రిటైల్, తీస్తా రిటైల్ అనే రెండు కంపెనీల్ని ఆర్‌ఐఐహెచ్‌ఎల్ ఏర్పాటు చేసింది. రెండింటి ఆఫీసూ ముంబైలోని వర్లిలో ఉన్న శ్రీరామ్ మిల్స్ కాంపౌండే. అశ్విన్ కజరీవాలా, బాబూజీ దీనికి డెరైక్టర్లు. షినానో మూలధనం రూ. 71 లక్షలు. తీస్తాది రూ. లక్ష.* కవీంద్ర కమర్షియల్ అనే సంస్థకు రూ. 1,054 కోట్లను, దేవకీ కమర్షియల్ అనే సంస్థకు రూ. 952 కోట్లను షినానో అప్పుగా ఇచ్చింది. అంటే... రూ. 71 లక్షల మూలధనమున్న కంపెనీ 2,002 కోట్ల రూపాయల్ని అప్పుగా ఇచ్చిందన్న మాట. శెభాష్!!. ఇంకా చిత్రమేంటో తెలుసా? కవీంద్ర, దేవకీ అనే రెండింటి చిరునామా ఒక్కటే. రిలయన్స్ మీడియా సంస్థలదీ ఇదే అడ్రస్.కంపానీ రంగంలోకి దిగాడు...ఆర్థిక మంత్రగాడుగా, ముఖేష్ అంబానీకి నమ్మిన బంటుగా పేరున్న నిమేష్ కంపానీ రంగంలోకి దిగాడు. ఆల్టిట్యూడ్ మర్కంటైల్, ఈక్వేటర్ ట్రేడింగ్ సంస్థల్ని ఏర్పాటు చేశాడు. తాడూ బొంగరం లేని ఈ కంపెనీలు నిధులు కావాలంటూ డిబెంచర్లు (రుణ పత్రాలు) జారీ చేశాయి. నిజానికి పేరున్న గ్రూపులైతే వాటి ఆస్తులు, పనితీరు చూసి ఎవరైనా డిబెంచర్లు కొంటారు. కానీ ముఖేష్-కంపానీ బంధం దేన్నీ ఖాతరు చేయలేదు. ఈ రెండు కంపెనీల డిబెంచర్లు కొని... ఏకంగా రూ. 2,004 కోట్లను కవీంద్ర, దేవకీ వీటిలోకి మళ్లించేశాయి. మొత్తానికి రిలయన్స్ డబ్బులు కంపానీ చెంతకు చేరాయి. ఆఖరి అంకం రసవత్తరంగా ముగిసింది. రూ. 2,004 కోట్లు జేబులో పెట్టుకున్న కంపానీ... ఈక్వేటర్ ట్రేడింగ్ ద్వారా రామోజీ గ్రూపులోని రూ. 100 విలువైన ఒక్కో షేరును ఏకంగా రూ. 5,28,630 చొప్పున కొన్నాడు. అలా 22.7 శాతం వాటా కోసం ఏకంగా రూ. 1,424 కోట్లు చెల్లించాడు. మొత్తానికి మార్గదర్శి కుంభకోణంతో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్న రామోజీ నావను... చంద్రబాబు లాఘవంగా పైకి లేపేశారు. కాకపోతే మునిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే.తొలి అంకం పూర్తయింది 2008 జనవరిలో. కొన్ని వారాల వ్యవధిలో పుట్టగొడుగుల్లా కంపెనీలు ఏర్పాటవటం, దాన్లోకి రిలయన్స్ ఇన్వెస్టర్ల సొమ్ము వారికి తెలీకుండానే ప్రవహించటం అన్నీ కొన్ని వారాల్లోనే జరిగిపోయాయి. అయినా రామోజీ దాహం తీరలేదు. బాబుకు అంత వాటా వచ్చినపుడు తనకు తక్కువే ఇచ్చారని కినిశారో ఏమో...! రెండో విడత నిధుల ప్రవాహం మొదలైంది. ఈసారి వాటా 17.1 శాతం; ముట్టింది రూ.1100 కోట్లుసువీ ఇన్ఫోకన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సువీ ఇన్ఫో మేనేజ్‌మెంట్ (ఇండోర్) ప్రైవేట్ లిమిటెడ్, సువీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్... ఇవన్నీ రిలయన్స్ గ్రూపునకు చెందిన షెల్ కంపెనీలు. వీటన్నిటి చిరునామాలు వేరైనా ఏర్పాటు చేసింది మాత్రం ఒక్కరే. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు ద్వారా ఈ కంపెనీల్లోకి ప్రవహించిన నిధులు పెట్టుబడుల రూపంలో అక్కడి నుంచి వివిధ కంపెనీల్లోకి మళ్లాయి. ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో అనూ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెబ్‌దునియా మీడియా గ్రూపు తదితరాలు ఉన్నాయి. వీటన్నిటి కేంద్ర స్థానం ముంబై. కార్యస్థానం ఇండోర్. అక్కడ నిమేష్ కంపానీలానే ఇక్కడ పాత్రధారి వినయ్ ఛజ్‌లానీ. 2008లో ఈక్వేటర్ పెట్టుబడులు ముగిసిన దరిమిలా... 2009లో అనూ ట్రేడింగ్ బరిలోకి దిగింది. ఈ కంపెనీ రామోజీకి చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 17.1 శాతం వాటాను రూ. 1,100 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంటే తొలుత 22.7 శాతం వాటాకు రూ. 1,424 కోట్లు. ఇపుడు 17.1 శాతానికి రూ. 1,100 కోట్లు... మొత్తమ్మీద రూ. 2,524 కోట్లు రామోజీ గూట్లోకి వచ్చి చేరిపోయాయి. రామోజీ అయితే తన కంపెనీలో 40 శాతం వాటా కార్పొరేట్ల అధీనంలో ఉందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు చెబుతున్నారు. కానీ రిలయన్స్ నిజంగా దీన్లో వాటా దక్కించుకుని ఉన్నట్లయితే ఆ విషయం బయటకు చెప్పకుండా ఉంటుందా? ‘ఈనాడు’ పేపరుపై అజమాయిషీ చేయకుండా ఉంటుందా? ఇదంతా బాబుకిచ్చిన ముడుపుల సొమ్ము కాబట్టే పట్టించుకోకుండా ఉందా? తన పత్రికలో బాబుకు వాటా ఉంది కనకే రామోజీ రాతలన్నీ బాబు చుట్టూ తిరుగుతున్నాయా? ఇవీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి సంధించిన ప్రశ్నలు. ప్రజాప్రతినిధిగా ఆయనడిగిన ప్రశ్నలకైనా రామోజీ-బాబు బదులిస్తారా?[/size]Flow chart of Money transfer from reliance[img]http://www.sakshi.com/newsimages/contentimages/09022011/Nidhulu9-2-11-2171.jpg[/img]
sid_22 Posted February 9, 2011 Report Posted February 9, 2011 Ekkada nundi pattuku vachav Fakeshi(Sakshi) nunda....... @3$% @3$% @3$%
I hate caste...... Posted February 9, 2011 Author Report Posted February 9, 2011 [quote author=sid_22 link=topic=153435.msg1801247#msg1801247 date=1297214764]Ekkada nundi pattuku vachav Fakeshi(Sakshi) nunda....... @3$% @3$% @3$%[/quote]sakshi nunche.........
jandhyala Posted February 9, 2011 Report Posted February 9, 2011 %<>( %<>( %<>( %<>( %<>( already esesaaru ee post :0012391: :0012391: :0012391:
katharnak Posted February 9, 2011 Report Posted February 9, 2011 [quote author=I hate caste...... link=topic=153435.msg1801252#msg1801252 date=1297214808]sakshi nunche.........[/quote]inni yrs power undi emchesaru..? nijam aite CBN ni bokkalo veyyochu kada..
I hate caste...... Posted February 9, 2011 Author Report Posted February 9, 2011 [quote author=jandhyala link=topic=153435.msg1801261#msg1801261 date=1297214867] %<>( %<>( %<>( %<>( %<>( already esesaaru ee post :0012391: :0012391: :0012391:[/quote]sardar mama ela unav??????
I hate caste...... Posted February 9, 2011 Author Report Posted February 9, 2011 [quote author=katharnak link=topic=153435.msg1801277#msg1801277 date=1297214988]inni yrs power undi emchesaru..? nijam aite CBN ni bokkalo veyyochu kada..[/quote]emo vella politics ento kani..........idhe koncham nijam laney undi........endukantey.........nimesh kampani ramoji dantlo chala ekkuva amount petti shares konnadu........
sid_22 Posted February 9, 2011 Report Posted February 9, 2011 [quote author=I hate caste...... link=topic=153435.msg1801252#msg1801252 date=1297214808]sakshi nunche.........[/quote]Anukunna aade ani @3$% @3$% @3$%..... aa Fakeshi gaadu emo Ramoji goorinchi........... Eenadu gaadu emo Jagan goorinchi..... Raj news gaadu emo Andhra people gitla chesindru manalni dochukuntundru ani......... okkadidi okkadu tavvukuni raastaru.Aaa papers anni saduvutunna manalni pedda VP lani sesturru @3$% @3$% @3$%
I hate caste...... Posted February 9, 2011 Author Report Posted February 9, 2011 [quote author=sid_22 link=topic=153435.msg1801316#msg1801316 date=1297215312]Anukunna aade ani @3$% @3$% @3$%..... aa Fakeshi gaadu emo Ramoji goorinchi........... Eenadu gaadu emo Jagan goorinchi..... Raj news gaadu emo Andhra people gitla chesindru manalni dochukuntundru ani......... okkadidi okkadu tavvukuni raastaru.Aaa papers anni saduvutunna manalni pedda VP lani sesturru @3$% @3$% @3$%[/quote]sorry small correction its not vp.........KVP........kvp sirio
Bhargav2010 Posted February 9, 2011 Report Posted February 9, 2011 ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"!andarikante maa KCR ee best... ... eellu evadu chusina velu,Lakshala kotlu anta.... thengi thinandi... AP Rocks....
perk Posted February 9, 2011 Report Posted February 9, 2011 [quote author=I hate caste...... link=topic=153435.msg1801329#msg1801329 date=1297215426]sorry small correction its not vp.........KVP........kvp sirio[/quote] LoL.1q LoL.1q LoL.1q LoL.1q
Recommended Posts