kantamneni Posted February 9, 2011 Report Posted February 9, 2011 ఎప్పుడూ ఏదో ఒక గొడవతో, సమస్యలతో సతమత మయ్యే మన కేరళా ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ సుడి ఒకాసారిగా గిర్రున తిరిగింది. 2011 వరల్డ్ కప్ కు భారత్ జట్టు తరుపున ఆడే అవకాశం దక్కలేదని బాధపడుతున్న శ్రీశాంత్ కు...అదృష్టం గాయం రూపంలో అందింది. అసలు మ్యాటర్ ఏంటంటే....దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో మోచేతి గాయంతో బాధపడుతున్న భారత పేస్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ వరల్డ్ కప్ టీం నుంచి నిష్క్రమించటంతో....అతని స్థానాన్ని ఈ కేరళ బౌలర్ ఆక్రమించాడు. బెంగుళూరులో ఫిట్ నెస్ టెస్ట్ కి వెళ్ళిన ప్రవీణ్ టెస్ట్ లో విఫలం అవ్వటంతో బీసీసీఐ అతన్ని ప్రపంచ కప్ భారత జట్టు నుంచి తొలగించి, ఆ స్థానంలో శ్రీశాంత్‌ను తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో శ్రీశాంత్ బుర్రతో పాటు సుడి కూడా గిర్రున తిరిగింది.More NEws[url=http://tv5news.in/sports_news/article-id-552-name-praveen-injury-a-window-of-opportunity-for-sreesanth.htm]http://tv5news.in/sports_news/article-id-552-name-praveen-injury-a-window-of-opportunity-for-sreesanth.htm[/url]
Recommended Posts