Jump to content

vidipoyedi... raastramey kaadu, Jillalu kooda nanta


Recommended Posts

Posted

[size=10pt]ఈ రాష్ట్రానికి 23 జిల్లాలు చాలవు.. 42 జిల్లాలు?
భౌగోళిక 'పునర్ విభజన'కు ప్రతిపాదన
జిల్లాల సంఖ్య పెంచాలంటూ కేంద్రం ఒత్తిడి
సాధ్యాసాధ్యాలపై సర్కారు పరిశీలన
12 జిల్లాల విభజనపై ఏనాటి నుంచో డిమాండ్లు

విస్తీర్ణంలో పెద్దవి
1. అనంతపురం
2. మహబూబ్‌నగర్
3. కర్నూలు
4. ప్రకాశం
5. ఆదిలాబాద్
6. ఖమ్మం
7. కడప
8. చిత్తూరు

జనాభాలో పెద్దవి
1. తూర్పు గోదావరి
2. గుంటూరు
3. కృష్ణా
4. విశాఖపట్నం
5. హైదరాబాద్
6. పశ్చిమ గోదావరి

మనమే తక్కువ
మన రాష్ట్ర విస్తీర్ణం 2.75 లక్షల చదరపు కిలోమీటర్లు. జనాభా 7.62 కోట్లు (2001 ప్రకారం). జిల్లాల సంఖ్య 23.
కర్ణాటక విస్తీర్ణం దాదాపుగా మనతో సమానమే. (2,75,600 చ.కి.మి.) జనాభా 5.28 కోట్లు. జిల్లాల సంఖ్య 31.
రాజధాని బెంగళూరు మెట్రో పరిధిలోనే 3 (సిటీ, మెట్రో, రూరల్) జిల్లాలు న్నాయి.
తమిళనాడు విస్తీర్ణం మన రాష్ట్రంలో సగమే (1,30,058 చ.కి.మి.) జనాభా 6.63 కోట్లు,
జిల్లాలు 32.

మీరు వింటున్నది నిజమే! ఇది రాష్ట్ర విభజన కాదు... 'రాష్ట్రంలో పునర్విభజన'! ఒకవైపు రాష్ట్ర విభజన అంశం రగులుతుండగా... మరోవైపు రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. 23 జిల్లాలను పునర్విభజించి పరిపాలనను మరింతగా వికేంద్రీకరించాలంటూ రాష్ట్ర సర్కారుపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది.

ఆంధ్ర ప్రదేశ్ భౌగోళిక పరిస్థితి, జనాభాను పరిగణనలోకి తీసుకుంటే... 40 నుంచి 42 జిల్లాలు ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన కూడా చేశారు. జనాభా, విస్తీర్ణం, వెనుకబాటుతనం

తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజన చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... 12 జిల్లాలను పునర్విభజించే అవకాశం ఉంది.

ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, నల్లగొండ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనకు వచ్చాయి.


[/size]

sCh_elmodance2 sCh_elmodance2 sCh_elmodance2

Posted

inka convinience kosam ani prati jilla ni oka rastram chestam analedhu ..

US kantey India lo yekkuva states undeyi appudu...

×
×
  • Create New...