Jump to content

Coca cola secret revealed


Recommended Posts

Posted

[size=12pt]లండన్: వందేళ్లకుపైగా అత్యంత గోప్యంగా ఉంచిన కోకకోలా మిశ్రమ రహస్యం బట్టబయలైందా? అవునంటోంది ‘దిస్ అమెరికన్ లైఫ్’ అనే వెబ్‌సైట్! ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మోతాదులో అమ్ముడుపోయే కూల్‌డ్రింక్‌గా కోకకోలాకు పేరున్న విషయం తెలిసిందే. అయితే ఈ పానీయాన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కంపెనీలోని అత్యున్నతస్థాయి అధికారులు ఇద్దరికి మాత్రమే ఈ ఫార్ములా తెలుసునని, అది కూడా చెరిసగం మాత్రమే ఉంటుందని గాథలున్నాయి. అట్లాంటాలో ఒక లాకర్‌లో భద్రపరచిన కోకాకోలా ఫార్ములాకు 24 గంటలు కట్టుదిట్టమైన కాపలా ఉంటుందని కూడా చెబుతారు. వీటిలో నిజమెంతో తెలియదు కానీ ‘దిస్ అమెరికన్ లైఫ్’ వెబ్‌సైట్ మాత్రం ఈ పానీయంలోని మిశ్రమాలను తాము ఓ పాత న్యూస్‌పేపర్ కథనం ఆధారంగా కనిపెట్టామని ప్రకటించింది. 1979 ఫిబ్రవరి 8నాటి ‘అట్లాంటా జర్నల్ కాన్‌స్టిట్యూషన్’లో పుస్తకాన్ని తెరచిపెట్టుకున్న ఒక వ్యక్తి ఫొటో ప్రచురితమైందని, ఆ పుస్తకంలోని వివరాలు... 1886లో జాన్ పెంబర్టన్ సిద్ధం చేసిన కోకకోలా మిశ్రమాల జాబితాకు సాక్షాత్తు నకలని ప్రకటించింది. ఆ వెబ్‌సైట్ తెలిపిన దాని మేరకు కోకకోలా తయారయ్యేందుకు కావాల్సినవి...

1. కోకా.... మూడు డ్రాములు (ఒక డ్రామ్ 1.771 గ్రాములకు సమానం)
2. సిట్రిక్ యాసిడ్.... మూడు ఔన్సులు
3. కెఫీన్... ఒక ఔన్సు
4. చక్కెర .... 30 (కొలత ఎంతన్నది అస్పష్టం)
5. నీరు... 2.5 గ్యాలన్లు (9.5 లీటర్లు)
6. నిమ్మ రసం.... 940 మిల్లీలీటర్లు
7. వెనీలా.. ఒక ఔన్సు
8. కారమెల్ .. 1.5 ఔన్సు
9. ఆల్కహాల్... 8 ఔన్సులు
10. నారింజ తైలం... 20 చుక్కలు
11. నిమ్మ తైలం... 30 చుక్కలు
12. జాజికాయ తైలం ... 10 చుక్కలు
13. ధనియా తైలం... 5 చుక్కలు
14. నెరోలీ (ఒక రకమైన నారింజ తైలం) ... పది చుక్కలు
15. దాల్చిన చెక్క తైలం... పది చుక్కలు
[/size]
[img]http://www.sakshi.com/newsimages/contentimages/18022011/COCA-COLA17-2-11-36406.jpg[/img]

Posted

idi cheskoni tagitey coke radu loose motion vastadi
aina andulo fizz edi sCo_hmmthink
incomplete recipe

Posted

[quote author=keko__keka link=topic=157479.msg1872213#msg1872213 date=1298080519]
wha re wah.com pettandi baa  @3$% @3$%
[/quote]

nope sakshi.com

×
×
  • Create New...