Jump to content

FLASH FLASH.........venkataramana is no more..........


Recommended Posts

Posted

[size=12pt]చెన్నై : ప్రముఖ తెలుగు సినీ రచయిత ముళ్లపూడి వెంకటరమణ కన్నుమూశారు. చెన్నైలోని అభిరామపురంలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వెంకటరమణ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన 1931 ధవళేశ్వరంలో జూన్ 28న జన్మించారు. వెంకటరమణ అసలు పేరు వెంకటరావు. దాగుడుమూతల చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘సాక్షి’ సినిమాతో వెంకటరమణ నిర్మాతగా మారారు.

ప్రముఖ దర్శకుడు బాపు- వెంకటరమణలు ప్రాణ స్నేహితులు. వీరిరువురు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జంట ఒకే ఇంట్లో 50 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వెంకటరమణ రాసిన ‘బుడుగు’ తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకుంది. కోతి కొమ్మచ్చి పేరుతో ఆత్మకథను రాశారు. గీత ద్వారా బాపు- రాత ద్వారా రమణ తెలుగు ప్రజలు మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వెంకట రమణ మృతి పట్ల తెలుగు చిత్రసీమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని చిత్ర ప్రముఖలు నివాళులు అర్పించారు.
[/size]
[img]http://sakshi.com/newsimages/contentimages/24022011/or24-2-11-33312.jpg[/img]

Posted

RIP ramana garu.......... #$1 #$1 #$1 #$1

×
×
  • Create New...