Jump to content

40000 fans chief guests ga Shakti audio release.........


Recommended Posts

Posted

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: ఓ వైపు ప్రపంచ కప్‌ మ్యాచ్‌...ఇంగ్లండ్‌తో భారత్‌ కీలక లీగ్‌పోరు...అయినా అభిమానం ఆగలేదు. తమ హీరో కోసం హైదరాబాద్‌ హైటెక్స్‌ గ్రౌండ్స్‌లోకి దూసుకొచ్చారు జూనియర్‌ ఎన్టీఆర్‌ అభి మానులు. సెక్యూరిటీ, పోలీస్‌, బౌన్సర్లు ఎందరు నిలువరించినా కంచె నిలు వలేదు. అభిమానుల ప్రవాహానికి వీఐిపీ గ్యాలరీలు చెల్లాచెదురయ్యాయి. ఎక్కడి కక్కడ కుర్చీలు తోసుకుంటూ స్టేజి ముందుకు దూసుకొచ్చేశారు. ఈలలు, గోలతో సందడి చేస్తూ తారకనామం జపించారు. ఇంతలో అక్కడి కొచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు సైతం చోద్యాన్ని చూస్తూ నిలబడ్డాయే తప్ప లాఠీ ఝళిపించే సాహసం చేయలేకపోయాయి. వెర్రితలలు వేసిన అభిమానం మీది మీదికి దూసుకొస్తుంటే ఓ వైపు మీడియా జనం, మరోవైపు వీఐపీలు పరుగులం కించుకున్నారు. స్టేజిపై జూనియర్‌ ప్రత్యక్షమై స్టెప్పులేస్తుంటే అభిమానుల కోలా హలానిి, ఉత్సాహానికి అంతే లేదు. స్టెప్పు స్టెప్పుకి అభిమానులు కేకలేస్తూ స్టేజి ముందుకు దూసుకొచ్చారు.

దీనితో ఆడియో వేడుక గ్యాలరీలో గందరగోళం చోటుచేసుకుంది. ఇదంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘శక్తి’ ఆడియో వేడుక దగ్గర ఆవిష్కృతమైన దృశ్యం. ఈ సినిమా ఇప్ప టికే చిత్రీ కరణ పూర్తి చేసుకుని మార్చి 30న విడు దలకు సిద్ధమైంది. దాదాపు 40 వేల మంది ఎన్టీఆర్‌ అభిమానుల మధ్య ‘శక్తి’ పాటలు ఆదివారం మార్కెట్లోకి విడు దలయ్యాయి. తొలి సీడీని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆవిష్కరించి సంగీత దర్శకుడు మణిశర్మకు

×
×
  • Create New...