I hate caste...... Posted March 2, 2011 Report Posted March 2, 2011 [size=12pt]మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: బహుశా..పాలమూరు కూ లీలు కనిపించని ప్రదేశం దేశంలో ఉండకపోవచ్చు. ఏటా లక్షలాది మంది వలసపోతున్న జిల్లా ఒక్క పాలమూరే. అందుకే ఇది వలస జి ల్లాగా పేరుగాంచింది. నిత్యం కరువు కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడిపోతుండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం..కరువు అనే చెబుతారు ఏ పాలమూరు వాసినడిగినా. కేంద్ర ప్రభుత్వం కూ డా ఇదే నిర్ధారణకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కరువుకు కారణమైన అత్యల్ప వర్షపాతంపై పరిశోధన లు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కేంద్ర సైన్స్ అండ్ టె క్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు ఏడాది పాటు అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పరిశోధనలు చే య నున్నారు. ఇందులో భాగంగా గత నెల 24న ఆరుగురు శాస్తవ్రేత్తల బృందం మహబూబ్‌నగర్ జిల్లాను సందర్శించింది. జిల్లా శివారు ప్రాంతమైన చౌదరిపల్లితో పాటు నారాయణపేట, అడ్డాకుల ప్రాం తాల్లో తమ పరిశోధనలకు శాస్తవ్రేత్తలు శ్రీకారం చుట్టారు. జైసల్మేర్ తరువాత పాలమూరే..దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా రాజస్తాన్‌లోని జైసల్మేర్. ఇక్కడ సాధారణ వర్షపాతం 150 మిల్లీమీటర్లు. అయితే రా జస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతోంది. జైసల్మేర్ తరువాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా మహబూబ్‌నగరే. అలాగే అనంతపురంలో సాధారణ వర్షపా తం 553 మి.మీ కాగా, మహబూబ్‌నగర్‌లో 604 మి.మీ. 2004 ఏ ప్రిల్ నుంచి 2005 మే వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో నమోదైన వర్షపాతం కేవలం 413 మి.మీ. ఆ సంవత్సరం రాష్ట్రంలోనే అత్యల్ప వర్షపాతం గా నమోదయింది. ఆ తర్వాత ఈసారి మాత్ర మే జిల్లాలో సాధారణ వర్షపాతం కన్నా 20 శా తం అధికంగా నమోదయింది.పరిశోధనలు ఎందుకని..?దేశంలో కరువు, కాటకాల వల్ల ప్రజాజీవనం లో సమతుల్యత లోపిస్తోంది. అభివృద్ధి, వెనుకబాటుతనం మధ్య అంతరం పెరిగిపోవడం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వర్షపాతం త క్కువ నమోదు కావడానికి గల కారణాలపై దృష్టిసారించింది. కరువు నివారణకు శాస్ర్తీ్తయ్రంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై పరిశోధించాలని నిర్ణయించింది. ఇం దుకోసం తొలివిడతగా దేశంలోని మూడు జి ల్లాలను ఎంపిక చేసింది. అత్యల్ప వర్షపాతం ఉండే జైసల్మేర్‌తో పాటు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, అనంతపురంలలో శాస్తవ్రేత్తలతో పూర్తిస్థాయి పరిశోధన చేయించాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే గత నెల 24న 6గురు శాస్తవ్రేత్తల బృందం జిల్లాలోని మూడు ప్రాంతాల్లో పరిశోధనలు ప్రారంభించింది. అ ధునాతన రాడార్ వ్యవస్థను, ఇతర సాంకేతి క పరిజ్ఞానాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలో గు ర్తించిన ఓ కళాశాల స్థలంలో ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం.[/size]
Recommended Posts