I hate caste...... Posted March 3, 2011 Report Posted March 3, 2011 [size=12pt]ఆడపిల్ల ఎలా బతుకుతుందో...! అంటుంది లోకం. ఆడపిల్లని... నేను బతకడమే కాదు నలుగుర్నీ బతికిస్తా అంటోంది అరుణ. నిప్పుల్లో కాలే పని ఎలా చేస్తుందో ఏమో..! అంటుంది లోకం. నిప్పుల్లో కాలుతా... అరుణ కాంతిలా వెలుగులు విరజిమ్ముతా... అంటోంది అరుణ. కొందరిని చూస్తే పాత భయాలన్నీ తొలగిపోతాయి. చెట్టంత కొడుకు కాదు మొక్కంత కూతురు ఉన్నా బతికేయచ్చు అనే ధైర్యం కలుగుతుంది. ఇంటికో అరుణ ఉంటే ఎంత బాగుండు... -రామ్, ఎడిటర్, ఫ్యామిలీఆ అమ్మాయిని చూస్తే అగ్గి జడుస్తుంది. సమ్మెటతో దెబ్బకొడితే ఇనుప కమ్మీ జీహుజూరంటుంది. కొడవళ్లు, నాగళ్లు, బొరిగెలు, మేకులు ఒక్కటేంటి కమ్మరిపనిలో ఆమెకు సాటి రారెవరూ. మగాళ్లకే పరిమితమైన పనిని నెత్తికెత్తుకుంది. స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగుతున్న అంగటి అరుణ నేటి తరానికి స్ఫూర్తి. సగర్వంగా తలెత్తుకుని బతికేందుకు కావాల్సింది శ్రమశక్తి, ఆత్మవిశ్వాసాలేనని చాటి చెప్పే అరుణను పరిచయం చేసుకుందాం...మంటల్లో మండుతూ..విశాఖపట్నం దొండపర్తి నెహ్రూబజారు వీధికి వెళితే అరుణమ్మ పనితనం కనిపిస్తుంది. నిప్పుల కొలిమి పక్కనే కూర్చుని మంటల వేడికి మండిపోతూ కూడా అదేమీ పట్టనట్టుంటుంది. ఇనుప ముక్కల్ని ఎడాపెడా సాగ్గొడుతూ కావల్సిన ఆకారాల్లో వంపులు తిప్పుతుంది. సమ్మెటతో దెబ్బమీద దెబ్బవేస్తూ ‘ఐరన్ లేడీ’ అనిపించుకుంటోంది. మామూలుగా అయితే శారీరకంగా విపరీతమైన కష్టానికి ఓర్చాల్సిన ఈ పని మగాళ్లే చేస్తుంటారు. అందుకే ఇరవై రెండేళ్ల అరుణ పడుతున్న శ్రమ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ‘‘ఆరోతరగతి వరకూ చదివాను. పెద్దగా వంటబట్టలేదు. కమ్మరిపనిలోకి దిగాను. మా తాత ముత్తాతలందరిదీ ఇదే పని. అందుకే సులువుగానే అలవాటయిపోయింది’’ పనిచేసుకుంటూనే తన మనసులోని మాటల్ని ఆ అమ్మాయి బయటపెట్టింది.కుటుంబానికి తోడుగా..దొండపర్తికి చెందిన అంగటి ఈశ్వరరావు పేదకుటుంబంలో పుట్టాడు. తండ్రి చేస్తున్న కమ్మరిపని అబ్బింది. 1976లో వైజాగ్ కంచరపాలెం ఊర్వశీ జంక్షన్‌కు చెందిన సన్యాసమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా భర్త కష్టంలో భాగం పంచుకుంటూ వచ్చింది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి. చిన్నపాపే అరుణ. ఆమెను రైల్వేన్యూకాలనీలోని మునిసిపల్ స్కూల్‌కి పంపించారు. సరిగ్గా ఆమె హైస్కూల్‌కి వచ్చేసరికల్లా తండ్రి ఈశ్వరరావుకు సమ్మెట దెబ్బలు కొట్టికొట్టీ భుజం బలహీనమైంది. దీంతో పాటు కిడ్నీలో రాళ్లు చేరాయి. ఆపరేషన్లు. ఆసుపత్రులు. డబ్బు మంచినీళ్లలా ఖర్చయింది. ఈ పరిస్థితుల్లో సోదరుడు కుమార్‌తో కలిసి అరుణమ్మ కమ్మరి కొలిమివైపు వచ్చేసింది. అమ్మను బతికించిన వైఎస్పని నేర్చుకున్న కొద్ది రోజుల్లోనే అరుణ ఇనుప వస్తువులు అద్భుతంగా చేసే స్థాయికి చేరింది. వ్యవసాయానికి పనికివచ్చే పలుగులు, పారలు, నాగలి కర్రులు, కొడవళ్లు, టెంట్‌హౌస్‌లకు అవసరమయ్యే పెద్దపెద్ద మేకులు కొలతలు తీసుకుని క్షణాల్లో చేసి ఇచ్చేస్తుంది. ఇనుమును ఎంతవరకు కాల్చాలో, ఇందుకు ఎంత మంట అవసరమో, ఇనుప కమ్మీలను ఎప్పుడు ఎలా వంచాలో తెలిసిన మనిషి అరుణ. ‘‘రోడ్డు మీద పోయేవారెందరో నన్నుచూసి అబ్బురపడతారు. ఆడపిల్లని కదా! కఠినమైన పని చేస్తున్నందుకు ముక్కున వేలేసుకుంటారు. నాలా ఎక్కడోగానీ ఉండరట. కొందరు విదేశీయులైతే ఫొటోలు తీసుకుని మరీ వెళ్లారు. శ్రమ పడటానికి మగయితేనేంటి, అమ్మాయి అయితేనేంటి? భగవంతుడి ముందు అందరూ సమానమే’’ జీవితం నేర్పిన అనుభవాలను అరుణమ్మ పంచుకుంది. గోరుచుట్టుపై రోకటి పోటులా ఆమె తల్లి సన్యాసమ్మ ఆరోగ్యం కూడా రెండేళ్ల కిందట పాడయింది. ఇంట్లో ఉండగానే పైకప్పు కూలి సన్యాసమ్మ వెన్నుపూస బీటలు వేసింది. ‘‘మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి బాబు దయవల్ల మా అమ్మకు ఆపరేషన్ జరిగింది. అసలు మాలాంటి వారు పెద్దాసుపత్రి దరిదాపుల్లోకి వెళ్లలేరు. ఆరోగ్యశ్రీ కింద సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిలో అమ్మకి శస్త్ర చికిత్స చేశారు. బతికి బట్టకట్టింది. వైఎస్ లేకుంటే తను బతికేదా? ఆపరేషన్ అయ్యాక ఎలా ఉన్నారంటూ వైఎస్ గారి నుంచి ఉత్తరంవచ్చింది. అమ్మని ఆసుపత్రినుంచి ఇంటికి తీసుకువచ్చిన పదిహేను రోజులకే ఆ మహనీయుడు చనిపోయారు. మేమే కాదు. మాలాంటి పేదలెందరికో ఆరోజు దుర్దినమే’’ అంటూ అరుణ ఆవేదనపడింది.సూరీడే భయపడాలి‘‘మా అక్క, అన్నలకు పెళ్లయింది. నా పెళ్లి గురించి నేనయితే పెద్దగా ఆలోచించను. మంచోడు దొరికినప్పుడు చూద్దాం. నా క్లాస్‌మేట్లు పిల్లల్ని తోడుతీసుకుని నన్ను చూడ్డానికి వస్తుంటారు. నేనే హాయిగా ఉన్నానంటుంటారు. కాయకాసిన నా అరచేతులు పట్టుకుని, నువ్వు పెళ్లి చేసుకున్నా ఫరవాలేదే. మొగుడు వేషాలేస్తే చితగ్గొట్టగలవంటుంటారు’’ నవ్వుతూ చెప్పుకొచ్చింది అరుణ. సరిగ్గా ఉదయం ఎనిమిదింటికి అరుణ కొలిమి రాజేస్తుంది. గంటలకొద్దీ పనిచేస్తూ పోతుంటుంది. ‘‘నిప్పుల వేడి అంతా ఇంతా కాదు. అలవాటయిపోయింది. రోహిణికార్తె ఎండలయినా నాకేం అనిపించదు. ఒక్కటి మాత్రం చెప్పగలనండీ. ఏ పనయినా మనసుకు సంబంధించినదే. సంతోషంగా చేసుకుపోతుంటే కొండలనయినా పిండి చేసేయగలం’’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.చల్లని చందనంఈ అమ్మాయి చేసేది కఠోరమైన పరిశ్రమే అయినా మనసు మెత్తనిది. చిన్నపిల్లలు, నోరులేని జంతువులంటే పంచ ప్రాణాలు. దారినపోయే పేద పిల్లల్ని పిలిచి తనకున్నంతలో దానం చేస్తుంటుంది. సంపాదించినదాన్లో ఎంతో కొంత పక్కవారికోసం ఖర్చుచేయాలని భావిస్తుంది. కండలు కరిగించి ఆర్జించిన ప్రతీ పైసా అమ్మ చేతిలో పెట్టడంలో అరుణకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.నేనే కొడుకునట!‘‘అమ్మాయిలు విమానాలే నడుపుతున్నారు. కమ్మరి పని ఒకలెక్కా! బతుకును జయించాలంటే శ్రమ వల్లే సాధ్యం. భగవంతుడు ప్రతీ మనిషికి ఒక శక్తినిస్తాడు. దాన్ని ఉపయోగించుకోవడమే. అప్పుడు నలుగురూ గర్వపడేలా బతకవచ్చు’’ బతుకుపాఠాలు చదువుతున్న అనుభవంతో చెప్పుకొచ్చింది అరుణ. అరుణ పనితనాన్ని, మంచితనాన్ని చూసిన ఎందరో ఇలాంటి చల్లని తల్లి తమ బిడ్డయితే ఎంతబాగుణ్ణో అనుకుంటున్నారు. అరుణమ్మకు దండం పెట్టి, అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు... శ్రమపడే చేతుల్లోనే దేవుడుంటాడనే పెద్దలమాట చెవుల్లో రింగుమంది. నిప్పులాంటి ఆమె జీవనం పదేపదే గుర్తుకొచ్చింది.మా దైవంఅరుణలాంటి కూతురు ఉండటం మేం చేసుకున్న పూర్వ జన్మ ఫలం. మాకోసం ఆమె పడుతున్న శ్రమ ఇంతని చెప్పలేం. తను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే మేం బతికేదెలా అనే ఆలోచిస్తోంది. వైఎస్ ఆరోగ్యశ్రీ వల్ల బతికి బట్టకట్టాను. మా పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. - సన్యాసమ్మ (అరుణ తల్లి)రెండో కొడుకు అరుణ మా అమ్మాయి కాదు. అబ్బాయనే అనుకుంటాను. రెండవ కొడుకును తన రూపంలో భగవంతుడిచ్చాడు. ఆమె మాకు తోడు నీడ. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తలకెత్తుకుంది. మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మాకు రకరకాలుగా ధైర్యం చెబుతుంది.- ఈశ్వరరావు (అరుణ తండ్రి)- చింతకింది శ్రీనివాసరావు, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు: ఎ.శరత్‌కుమార్[/size][img]http://www.sakshi.com/newsimages/contentimages/03032011/mahilamainsss3-3-11-4109.jpg[/img]
samantha. Posted March 4, 2011 Report Posted March 4, 2011 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 *=: *=: *=: *=: you rock
StoneCold Posted March 4, 2011 Report Posted March 4, 2011 *=: *=: *=: sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4
sittiman Posted March 4, 2011 Report Posted March 4, 2011 inta pedda story chadavala nalugu mukkallo cheppochuga sSa_j@il
samantha. Posted March 4, 2011 Report Posted March 4, 2011 [quote author=dhaumyudu link=topic=162800.msg1950262#msg1950262 date=1299197082]inta pedda story chadavala nalugu mukkallo cheppochuga sSa_j@il[/quote]nee stories evaraina ila ante feel avvavu..too gud story chaduvu..asale nuvvu telugu lo thop thurum kada *7*^ *7*^
PMREDDY19 Posted March 4, 2011 Report Posted March 4, 2011 [img]http://epaper.sakshi.com/epaperimages/432011/432011-sh-hyd-11/D147327742.JPG[/img]
sittiman Posted March 4, 2011 Report Posted March 4, 2011 [quote author=samantha. link=topic=162800.msg1950275#msg1950275 date=1299197226]nee stories evaraina ila ante feel avvavu..too gud story chaduvu..asale nuvvu telugu lo thop thurum kada *7*^ *7*^[/quote]nanne tidatava[img]http://www.andhrafriends.com/Smileys/default/3D_Smiles_37.jpg.gif[/img]
chotu gadu Posted March 4, 2011 Report Posted March 4, 2011 inspiring sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sHa_clap4...ARUNA ROCKSSSSS!!!!!!
samantha. Posted March 4, 2011 Report Posted March 4, 2011 [quote author=dhaumyudu link=topic=162800.msg1950300#msg1950300 date=1299197690] *=: *=: *=: *=: *=: *=: aruna rocks[/quote] *=: you rock
sittiman Posted March 4, 2011 Report Posted March 4, 2011 [quote author=samantha. link=topic=162800.msg1950356#msg1950356 date=1299198725] *=: you rock[/quote] sCo_hmmthink sCo_hmmthink
The QUEEN Posted March 4, 2011 Report Posted March 4, 2011 sHa_clap4 sHa_clap4 sHa_clap4 sFun_duh *=: *=:
Recommended Posts